Read more!
 Previous Page Next Page 
నింగిలోని సిరిమల్లి పేజి 3

    ఆ కౌంపౌండ్ లో అయుదారు కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. అంతా ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళే అడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ వుండటం చేత యిళ్ళా౦తా నిద్రబోతున్నట్ట్లుగా వున్నాయి. నిండు ప్రశాంతంగా వున్న బోజలా వుంది కౌంపౌండ్. చంటిపిల్లలు నిద్రపోతూ వుంటారు. పెరిగిన పిల్లలు బళ్ళకి వెళ్ళి వుంటారు.
    ఇళ్ళుగలావిడ జానికమ్మగారు. ఆమె భోలా మనిషి. మనిషిలాగే మనస్సు నిండుగా వుంటుంది. ఇలా కపటం ఎరగని మనస్తత్వం ! ఎన్నాళ్ళయింది సుజాతా! ఈ రైల్లో దిగేవా! బాగా ఆలస్యమైందే!" అంటూ ఆప్యాయంగా పలుకరించింది.
    "అవును పిన్నిగారూ!" తడబడుతూ జవాబు చెప్పింది.
    "మీ పిన్ని కిపుడు నెమ్మదిగా వుందా!"
    "అం" సూట్ కేస్ క్రిందిపేట్టి తాళం తీసి, వాకిలి. తోసింది సుజాత.
    అది రెండుగదుల యిల్లు. ఒక హాలు. అదే డ్రాయింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, బెడ్డింగ్ రూం, మరోకటి కిచన్. అదే డైనింగ్ హాలు! దానికి అనుకుని బాత్రూం లెట్రిన్.
    తలుపు తీసుకుని లోపలి వెళ్ళగానే వెచ్చటిగాలి ఆవహించింది. ఫేన్ వేసి. భుజంపై పాపని మంచపై పడుకోబెట్టింది. ఫేస్ గాలికి దుమ్ము రేగటంలో స్పీడ్ తగ్గించి, చీపురుతో ఆ గది చక్ చకా చిమ్మేసింది.
    "అదృష్టం యిదింకా నిదరపోతున్నది!" అనుకుని వంటిల్లు దాటి బాత్ రూంలోకి వెళ్ళింది. పంపు తిప్పగానే నీళ్ళు వచ్చేయి. "టాంక్ లో నీళ్ళున్నాయన్నమాట!" అనుకుని చకచకా వంటగది శుభ్రం చేసింది. తను తలారా స్నానం చేసింది. పంపు నుండి చల్లని నీరు ధారగా తలని తడుపుతు వుంటే మనస్సు  శరీరం రెండూ తేలిక పడ్డట్టుగా అనిపించాయి.
    చీరచుట్టుకుని రాబోతూ వుంటే ముందు గదిలోంచి "సుజాత! ఎవార్ యీ పాపా?" అన్న జనికమ్మ గొంతు వినిపించి తుళ్ళి పడింది. గొంతు తడారిపోయినట్లుగా అయింది. అయినా ఆ ప్రశ్న వినిపించుకొనట్టుగా చకచకా చీర మార్చుకుని ఆ గదిలోకి వచ్చింది.    
    జానికమ్మగారు చేతిలో పళ్ళెం నిండా అన్నం, పప్పు, కూరలు వేసుకుని వచ్చింది. మరో చేతిలో గిన్నెలో మజ్జిగ తెచ్చింది సుజాతని చూడగానే చిరునవ్వు నవ్వి "ఇప్పుడే౦ వంట చేసుకుంటావని నేనే తెచ్చానమ్మా!" అంది. 
    "ఎందుకు శ్రమ పడ్డావు పిన్నీ!"
    "ఇందులో శ్రమేం వుందమ్మా! ఇంట్లో వుంది తెచ్చాను. అంతే! సరేగాని యీ పాపా ఎవరమ్మా?" అనిమళ్ళీ అడిగింది.        
    "ఆ పాప _ " అర్ధోక్తిలో ఆగింది సుజాత.
    "అం యీపాపే! ఎంత బాగుంది? ఆ కళ్ళు ఆ బుగ్గలు ఆ రంగూ , ఆ బుల్లి పెదాలు, ఆ చుబాకం ఎంత ముద్దోస్తుంది!  బంగారుబొమ్మలా వుంది !" సహజంగా ఉప్పొంగిన మాతృహృదయంతో అంది.
    సుజాత జవాబేమీ యివ్వకుండా పాపని చూసి మురిసిపోతోన్న జనికమ్మగారినే చూస్తూవుండిపోయింది. "ఈ పాప ఎవరో తెలియకుండా యింతి ముద్దు చేస్తోంది. తెలిస్తే_"
    అమట్లో పాప నిద్ర లేచి కేవ్వుమంది.
    ఆప్రయత్నంగా వెళ్ళిఎత్తుకుంది సుజాత.
    "ఉండమ్మా! పాలు తెస్తాను. పడుదువుగానీ, ఇప్పుడు నీ వద్ద ఎక్కడివి?" అంటూ గబగబా వెళ్ళింది జానికమ్మ.
    "హమ్మయ్య!" అనుకుంది సుజాత. తాత్కాలికంగా ఒక గండం గడిచినట్ట్లుగా అనిపించింది. పాపయింకా ఏడుస్తూనే వుంది. ఆప్రయత్నంగా నోటిలో వేలు వుంచింది. సుజాత. ఉదయం లా ఆమయమ్కంగా ఆ వేలిని చీకుతూ వుండిపోయింది పాప.
    అప్రయత్నంగా ఉదయం ట్రెయిన్ లోజరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
    తను ఆలోచనలతో మునిగిపోయి రాత్రంతా నిదరేపోలేదు. రాత్రి కడుపు నిండా పాలు పట్టేడేమో అతను, ఉదయం దాకా పాప కెవ్వుమని కూడా అనలేదు కదాల్నూ లేదు. మెదలనూ లేదు. తనచుట్టూ జరిగే దానికి తను బాధ్యురాలీని కాదన్నట్టుగా ప్రశాంతంగా నిదురపోసాగింది. కానీ తెల్లరేక ఆపకుండా ఏడుపు ప్రారంభించింది.
    "ఏంటమ్మా! పాప అలా ఏడుస్తూ వుంటే నువ్వు ఆలోచనలో పడిపోయావు! పాప ఏడుపు వినిపించటం లేదా! ఎం కాలమో ఏమో! పక్కన పిల్ల కదిలితే ఉలికిపడే వాళ్ళం మేము!"
    ఉలికి పడింది తను.
    ఏంటమ్మా అది. పాలు పట్టు __పిల్ల గొంతు తడారి పోతుంది!"
    "పాలా!" ఆ ప్రయత్నంగా అంది.
    "అవునమ్మా పాలు పట్టు! అలా చూస్తావేం? అయ్యో పాపకి తల్లి పాలు కరువయ్యాయా !" నొచ్చుకుంటూ అడిగింది ముసలమ్మ.
    అనాలోచితంగా తలూపింది తను.
    "అయితే పోత పాలయినా పట్టు! సీసా వెంట తెచ్చుకాలేదా?" మళ్ళీ అడిగింది.
    తెల్లబోయింది తను. ప్రశ్నపై ప్రశ్న! ఎం జవాబు చెబుతుంది. తను.
    "అదేం చోద్యం తల్లీ! పిల్లని చేతుల్లోకయినా తీసుకో. తల్లి స్పర్శ తగిలితే చాలు ఏడుపు మానుతుంది. అయినా కన్న కూతుర్ని ఎత్తుకోమని చెప్పాలా నేను!" అందామె.
    ఆప్రయత్నంగా చేతులు చాచీ ఎత్తుకుంది.! చిత్రం. పాపా ఏడుపు మానేసింది. తన స్పర్శలో మాతృస్పర్శ లభించిమ్డా యీ పాపకి . తనకి యీ స్పర్శలో మాతృస్పర్శ లభించిమ్డా యీ పాపకి. తనకి యీ పాపని చూస్తే మనస్సు స్పందిస్తోంది. ప్రపంచంలో బంధాలూ, బంధవ్యాలూ అన్నీ గతజన్మల వెంటాడే జ్ఞాపకాలు! ఈ పాపా తనకి ఎ జన్మలో ఆత్మ బందువో!
    "వచ్చే స్టేషను లో నయిన పాలు కొన్ని పట్టమ్మా! అంత దాకా న వద్ద మందుకోసం వున్న తేనే వేలుతో అద్ది నాలిక్కి తాకించు!" అందామె మళ్ళీ పల్లెటూరి ఆమె అయినా ఎంత ఆదరణ! ఎంత ఆప్యాయత!
    ఎవరికేవరు?
    ఎక్కడిదీ స్వచ్చత! సహజంగానే దయా, ప్రేమా వుంటాయా వీళ్ళలో ! నీళ్ళు పారినట్టు, గాలి వీచినట్టు, వెన్నెల కాసినట్టు  వీళ్ళు ప్రేమని వర్షిస్తారా!            
    ఊరు చేరగానే అనాధ బాల బాలికల శరణాలయంలో చేర్చేయ్యాలి అనుకుంది. తర్వాత స్టేషనులో పాలు కొనిపాపకి పడుతూ! తన ఉద్యోగానికి యీ చాకిరికీ ఎలా కుదురుతుంది. అందునా మరీ మూడునెలలయినా నిండని పసిపాప! పసిబిడ్డ సంరక్షణ అంతే మాటలా! తనతో ఏమవుతుంది వృద్దురాలిన తల్లి సేవ, నెలలు నిండని పసిపాప పోషణ రెండూ కష్టమే! తను యీ పాపని అతనిలాగే రైల్లోనో వదిలేసి వెళ్ళాలనుకున్న నిర్ణయం పాపాఏడుపూముసలమ్మా చొరవతో యిల మారింది. వెంటనే పాపాని హొంలో చేర్పించాలి.

 Previous Page Next Page