Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 42

 

      శంకూ చేతిలోని కత్తి ఆయన్ను ప్రాణభయంతో గడగడ లాడించి౦ది.

    అప్పుడాయన తొలిసారిగా పశ్చాత్తాపపడ్డాడు. ఎన్నడూ దేవుణ్ణి తలచుకొని చలమయ్య __ ఆ సమయంలో ఆపద మొక్కుల వాడికి వేయి రూపాయలిస్తానని మ్రొక్కుకున్నాడు.

    రాజారావు తనను రక్షించడం నమ్మాడు.

    దేవుడు డబ్బుకి లొంగుతాడు ....

    తను రక్షించబడగానే రాజారావు యధాలాపంగా అన్న ఆనందమూర్తి పెరాయన్ను కలవరపరిచింది.

    జ్ఞాపకాల అట్టడుగున మరుగుపడిపోయిన ఆనందమూర్తి చరిత్ర రాకూడని సమయంలో ఆయనకు గుర్తుకోచ్చింది.

    ఆనందమూర్తి భార్యను తనేతువంటి అవమానానానికి గురిచేశాడో _ అదే అవమానం తన భార్యకు జరిగింది.

     ఈ పోలిక కూడా ఆయనలో ఆత్మవిమర్శకు కారణభూతమయింది.

    తనసలు ఆనందమూర్తి మీద ఎందుకు పగబడ్డాడు? అతడు తనకేమీ అపకారం చేయలేదు. ఊరికి ఉపకారం చేయబోయాడు. తనకది ఇష్టంలేదు. ఎందుకని? ఊరికి ఉపకారం __ తన కపకారమయింది మరి _

    ఆ పచ్చి నిజాన్నరిగించుకోవడానికి చలమయ్యకు చాలాసేపు పట్టింది. ఆనందమూర్తి వంటివారూరికి చాలా అవసరం. ఈ రాజారావూ ఆనందమూర్తి వంటివాడే ! అందువల్ల తను రక్షింపబడ్డాడు.

    మర్నాడు కృతఙ్ఞతలు చెప్పుకుందుకు రాజారావు వద్దకు ప్రత్యేకంగా వెళ్ళినపుడు _ అతడన్న మాటలాయన్నిప్పటికీ కలవరపరుస్తూనే ఉన్నాయి.

    "చలంయ్యగారూ! మీ అదృష్టం మిమ్మల్ని కపాడింది. తప్పితే, ఇందులో నేను చేసిందేమీ లేదు. మీరు నాకు ఋణపడ్డానంటున్నారు. నేనలా అనుకోవడంలేదు. అయినా అ భావం మీలో ఉంది కాబట్టి __ మీరు ఋణవిముక్తులయ్యే మార్గం చెబుతాను. మీరు నాకు పైసాఇవ్వనక్కర్లేద. కాన్వీ లీలాసుందరి మాటలు విన్నారుగా .... ఆమె ఆరోపణలన్నీ నిఅజమేనా! నిఅజ్మే అయితే అవి అబద్దాలుగా చేసి __ లీలాసుందరి వంటివాళ్ళ కళ్ళు చేయకున్నా __ మంచి పనులు చేసేవాళ్ళు మీద కక్ష కట్టకండి. ఇంతలా ఎందుకు చెబుతున్నానంటే __ మీకీ ఊళ్ళో చాలా చెడ్డపేరున్నమాట వాస్తవం. మీరు వడ్డీకి అప్పులిచ్చిన వాళ్ళకి __ నేను వడ్డీ లేకుండా అప్పులిచ్చాననుకోండి. అప్పుడు వాడు నన్ను పొగిడి ఊరుకోకుండా __ మిమ్మల్ని తిట్టడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మీరు నామీద కక్ష కట్టకుండా ఉంటే నాకు చాలు. మీ గురించి ఎంత చెడ్డగా వినప్పటికీ , మీరంటే నాకు మంచి అభిప్రాయంమే ఉంది. అందువల్ల మీనుంచి నాకు ప్రాణభయమటు౦దను కోవడంలేదు....."

    రాజరావన్న ఏ మాటలు చలమయ్యకు కించపరిచాయి. రేచ్చాగోట్టాయి, బాధపెట్టాయి. అయినా అయన నవ్వాడు. సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు. రాజారావిప్పుడు చాలా ఎత్తుఎదిగాడు. అందునా అతడు తన ప్రాణదాత. అతడి మాటలకు తను కోపగించుకోకుండా __ ఆలోచించడం నేర్చుకోవాలి. అయితే అదే మంచిది. కోపం అనర్దాలు తెస్తే __ ఆలోచన వివేకాన్ని పెంచుతుంది.

    లీలాసుందరి మాటలు చలమయ్య చెవుల్లో గిమ్గిరుమంటున్నాయి. __ "ఒక్కోసారి నీ వంటిమీద చూసుకో - చిన్న గోచీ తప్ప ఏమీలేదు . నువ్వు పుట్టి నప్పుడయితే __ ఆ గోచీ కూడా నీవెంట రాడు. మరెందుకింత కక్కుర్తిపడ్డావు? ఇన్ని అమానుషకృత్యాలు చేశావు?....."

    ఆ మాటలే ఆత్మవిమర్శ కాగా, చలంయ్యలో క్రమంగా మార్పు రాసాగింది. తను మ్రొక్కుకున్నానని ఊళ్ళో వెంకటేశ్వరస్వామి గుడిలో వెయ్యి రూపాయలూ సమర్పించుకున్నడాయన గురించి అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. అంత పెద్ద మొత్తాన్ని దేవుడికివ్వడం అదే తొలిసారి అయినప్పటికీ, అంతకంటే ముఖ్య విశేషమింకోకటుంది.

    చలమయ్య నిజాయితీకది తొలి నిదర్శనం!

     
                                                                            26

    ఆ ఊళ్ళో అంతవరకూ గరవయ్య అనామకుడు ఇప్పుడూళ్ళో చాలామంది అతడి గురించీ, చెప్పుకోసాగారు. తాగుమోతెదవ అని అందరిచేతా అసహ్యహించుకోబడే గరవయ్యప్పుడూరికి అభిమాని అయ్యాడు.

    అనుకోకుండా పెరిగిన తన అంతస్తుకి గరవయ్య గర్వపడ్డాడు. నలుగురి మన్ననలనూ పొందడంలో ఇంత ఆనందముంటుందని అతడునుకోలేదు. తనకీ గౌరవం దక్కడానికి రాజరావే కారణమని అతడు మరచిపోలేదు. అతడు తన కృతఙ్ఞతలు రాజారావుకు తెలియబర్చుకున్నప్పుడు __ "నిన్ను మనస్పూర్తిగా తమ్ముడూ అని పిలుస్తున్నాను తమ్ముడూ!" అంది వసంత. ఆ పిలుపు కతడి శరీరం పులకరించింది. అ కుటుంబం చాలా కాలంగా తన్నాదరిస్తూంటే తనే అలక్ష్యం చేస్తున్నాడు. ఎంతో ఎత్తునుండి వాళ్ళు తనని ఆదరించి ఆహ్వానింస్తూంటే _ తను క్రిందనే ఉండి బదులిస్తాన్నాడు. తప్ప __ వాళ్ళున్న ఉన్నత స్థానం చేరుకోవాలనుకోలేదు. పైపెచ్చు._ ఒకనాడు తను ఆ అక్కనే చేయి పట్టుకున్నాడు ఆ సంఘటన తలచుకున్నపుడల్లా హృదయాన్ని కలచివేస్తూ౦టుంది. అటుంవంటప్పుడే తాగుడంటేనర్తకి పుడుతూం టుంది.తాగిఉండకపోతే తనప్పుడూ ప్రవర్తించి ఉండేవాడు. కాదు. తన ప్రవర్తనకు రాజారావు తనపై కక్షకట్టి ఉంటే కథ మరోకలా ఉండేది. వసంతను తనకు అక్కనుచేసి అతడు తనమీద కొత్తరకంగా దెబ్బతీశాడు.

    అయినా తాగుబోతులకు ప్రజల్లో ఎలాంటి స్థానమున్నదీ సుదర్శనం బ్రతుకునుబట్టి తెలుస్కోవచ్చు సాటి గ్రామస్థుడని ఏదో జాలిపడ్డారు. తప్ప __ సుదర్శనం చావు ఎవర్నీ బాధించినట్లు లేదు. కొంతమంది సంతోషించినట్లు కూడా కనబడుతుంది. ఇలాంటి వాళ్ళవల్ల ఊళ్ళో పిల్లలు చేదిపోతారని, ఆ అమ్మాయి చెప్పింది. నిజమేనని ఒకళ్ళిద్దరనుకోవడం కూడా విన్నడతడు.

    లీలాసుందరిని తలుచుకున్నప్పుడల్లా గరవయ్య మనస్సదొక రకమయిన పులకింతకు గురవూతూంటు౦ది. ఆమె అందాన్ని కతడాకర్శింతుడయ్యాడు. ఆమె మాటలకతడు ముగ్దుడయ్యాడు. ఆమెలోని ఏదో ఠీవి అతడికామేపై గౌరవభావం కలిగించింది. రాజారావు మాటలు విన్నాక _ ఆమెను మార్చడానికి ప్రయత్నించాలి తప్ప __ అమెనసహ్యించుకోకూడదని గ్రహించాడు. అయినా అతడికామపై ఏహ్యభావం కలగాలేదు. ఆమె తన తల్లిపట్ల అత్యాచారం చేయబోతుందని కాస్త బాధ అతడిక్కకలగపోలేదు. ఒక ఆడది మరో ఆడదాన్నంత మాదపెట్టాలనుకుంటుందన్న దతడి ఊహకందడంలేదు. లీలాసుందరిలో అటువంటి క్రూరత్వమున్నందు కతడి మన సులో బాధగా ఉంది.

 Previous Page Next Page