"తెలిసిందా చలమయ్యా _ కొరడాదెబ్బ రుచి !" అంది లీలసుందరి __ "బాధ మనుషులచేత చేయని నేరాలను కూడా ఒప్పిస్తుంది. ఇలాగే నువ్వు తెలుసుకోవలసినవింకా చాలా ఉన్నాయి. నువ్వు వయసులో ఉండగా, వారి ఇష్టాయిష్టలతో నిమిత్తం లేకుండా ఎందరో పడుచుల ననుభవించావు. ఇప్పటికీ నీలో పులుపు చావలేదనడానికి నువ్వు న దగ్గర ప్రవర్తించిన తీరే సాక్ష్యం! కానీ, నీ భార్యపట్ల ఇతరుల ట్యాచారం చేస్తే ఎలాగుంటుందో నీకు తెలియదు. ఇప్పుడు చూద్దువుగానీ, నా దురదృష్టంకొద్దీ __ నీ కూతుళ్ళళ్ళళ్ళో లేరు. నీ భార్య మాత్రం ఉంది౦ట్లో. నీకు భార్యగా వచ్చిన పాపానికి _ ఆమె కేగతీ పడుతోందో నువ్వు కళ్ళారా చూడాలి. ఆ తర్వాత ఒకో అవయవాన్ని నరుకుతూ నిన్ను చిత్రవధ చేస్తాను. నీ దొడ్లో చెట్టుకు నీ మొండెన్ని వ్రేలాడగట్టి _ ఈ గ్రామంలోని ఇతర పైశాచిక శక్తులకు హెచ్చారికగా వదిలిపెడతాను _ ..." అంటూ ఆమె ఆగింది.
అప్పుడా గదిలోనికి చేతులు వెనక్కట్టి ఉన్న చలమయ్య భార్య ప్రవేశపెట్టబడింది. ఆమె వెనకనే ఓ యువకుడు వచ్చాడు. అతడిని చూస్తూనే రాజారావు తృళ్ళిపడ్డాడు.
"శంకూ !" అంది లీలాసుందరి _ "బాకు పడునేలా గుంది?"
అతడు మోలలోంచి బాకు తీసి, చిన్నగా బొటనవ్రేలి మీద రాశాడు. రక్తం చిమ్మింది.
"ఈమె వయసులో పెద్దదని ఆలోచించకు . చలమయ్య భార్య అని గుర్తుంచుకో. నువ్వు కోరుతున్నది. శారీరికసౌఖ్యం కాదు, చలమయ్యకు అవమానం . చలమయ్య చూస్తుండగా నీ యిష్టంవచ్చినట్టు ఈమె శరీరంతో ఆడుకో. ఆ దృశ్యం తనివితీరా చూసేక చలమయ్య కళ్ళు తీసేద్దాం. __" అంది లీలాసుందరి.
అందమయిన లీలసుందరిలో అంత క్రూరత్వమూ, అమాయకంగా అగుపడే జగ్గారవులో అంత రహస్యమూ ఉండడం రాజారావుకి విపరీతమయిన ఆశ్చర్యాన్ని కలిగిస్తే, అప్పటి పరిస్థితి కలిగించిన కలవరం ఆ ఆశ్చర్యన్ని మించింది.
తనకళ్ళ ఎదుట ఘోరాతిఘోరం జరగబోతుంది. ఆ ఘోరం జరక్కుండా ఆపాలంటే ముందు లీలాసుందరినీ, జగ్గారావునీ ఆపాలి.
లీలాసుందరి చేతిలో కొరడా ఉంది. జగ్గారావు దగ్గర పదునయిన బాకు ఉంది. ఇద్దర్నీ ఒక్కసారి ఎదుర్కోవడం ఆత్మహత్యా సాదృశ్యం . విజయం సులభంగా లభించడానికి ఎదుటి వారు సినిమా విలన్సుకారు. కొన్ని ఆశయాల కోసం ప్రాణాలనయినా లెక్కచేయని శిలాహృదయులు.
మంచం అడుగునుండి చూస్తుండగా , లక్ష్మమ్మ వంటిమీది బట్టలోకటోక్కటిగా నేలమీద పడ్డాయి. తరువాత జగ్గరావామెను చలమయ్యకు కాస్త ఎడంగా నేలమీద పడుకోబెట్టాడు. ఆమె నోట్లో కూడ గుడ్డలు కుక్కడంవల్ల _ ఆమె కూడా సన్నగా మూలుగుతోంది.
గదిలో నేలమీద _ చిన్న గోచీతో చలమయ్య. ఆయనకు కాస్త ఎడంగా వంటిమీద ఆ మాత్రం కూడా లేకుండా లక్ష్యమ్మ .....
వాళ్ళకు తలవైపు లీలసుందరి. ఆమె చేతిలో కొరడా .
కాళ్ళవైపు జగ్గారావు. అతడి చేతిలో చాకు ....
చలమయ్య. లక్ష్యమ్మళ కళ్ళలో అసహాయత.
లీలాసుందరి, జగ్గరావుల కళ్ళలో క్రూరత్వం ....
తన కళ్ళముందే ఏం జరగబోతోందో రాజారావుహించాడు. ఒక్కసారిగా అతడి శరీరం ఆవేశంతో వణికింది. అతడు మెరుపు వేగంతో తన ముందున్న ట్రంకును జగ్గారావు మీదకు తోసి __ అదే ఊపులో మంచం కిందనుంచి బయటపడి, లీలాసుందరి మీదపడి ఆమె చేతిలోని కొరడా లాక్కున్నాడు.
శత్రువేవరో కూడా చూడలేదు జగ్గారావు. ట్రంకు అతడి కాళ్ళకు తగిలి క్రింద పడడంతో, అతడి చేతిలోని బాకు అతడినే గయాపరిచింది. తల గోడకు తగిలి, క్షణాల మీద అతడికి స్పృహా తప్పింది.
"మీరా?" అంది లీలాసుందరి ఆశ్చర్యంగా.
రాజారావు కొరడా రుళింపించి _ " కదలడానికి ప్రయత్నించవద్దు __" అన్నాడు.
లీలాసుందరి ఆ సమయంలో కూడా ధైర్యంగా చిరునవ్వు నవ్వి _ "నేను చావుకి భయపడను. మీ చేతిలోని కోరదాకు భయపడటానా? చేతకానిదానిలా నేనిక్కడ నిలబడతాననుకుంటే అది మీ భ్రమ . నన్ను మీరాపలేరు. పారిపోతున్నాను __ " అంటూ గుమ్మంవైపు ఓ అడుగు వేసింది.
వెంటనే రాజారావు చేతిలోని కొరడా చెళ్ళుమంది. లీలాసుందరి బాధతో మెలికలు తిరిగి, నేలమీద పడిపోయింది. రాజారావు గుమ్మందగ్గరకు వెళ్ళి, తలుపులు మూసి గెడ వేశాడు.
"అనవసరంగా పిచ్చివేషాలు వేయొద్దు . ఇప్పుడు నా హృదయం శిలతో సమానం __" అన్నాడతడు.
లీలాసుందరి కదల్లేదు.
మరికొద్ది క్షణాల్లో _ చలమయ్య , భార్య బంధవిముక్తులు కావడం _ దుస్తులు ధరించడం _ లీలాసుందరి, జగ్గారావు బంధితులవడం జరిగింది. రాజారావు తనని బందీ చేస్తున్నప్పుడు లీలాసుందరి సన్నగా ఈల వేసింది.
మీ ఉత్సాహం అభినందించతగ్గదే ...." అన్నాడు రాజారావు.
"కానీ మీరు చేసిన పని మాత్రం అభినందించిన తగ్గది. కాదు పామును ముగింప బారినుండి రక్షించి, మళ్ళీ మనుషుల మీదకి వదుల్తున్నారు __" అంది లీలాసుందరి బాధగా.
"మనిషి పాములాంటి వాడయితే బాదే లేదు. పాము తన జోలికి రాణివాళ్ళ జోలికి పోదు_" అన్నాడు రాజారావు.
లీలా సుందరి ఏదో అనబావుగా __ "ముందు మీ శంకూకి ఏదయినా కట్టు కట్టనివ్వండి. రక్తం చాలా పోయినట్ట్లుంది __" అన్నాడు రాజారావు.