అతడోసారి తన రేడియం డయల్ వకాహీ చూసుకున్నాడు. టైము పదింపావయింది.
రాజారావు గది తలుపులకు చెవులానించి మాటలు వినడానికి ప్రయత్నించసాగాడు. క్రమంగా అతడికి లోపలిమాటలు అర్ధంకాసాగాయి.
"సరే _ మనం కబురర్లు చాలా చెప్పుకున్నాం. అప్పటికే చాలా పొద్దుపోయింది. మరి నా ముచ్చట కూడా తీర్పు ...." అంది చలమయ్య గొంతు.
"మరి నే వచ్చిన దెందుకనుకున్నారు? మీ సరదా లన్నీ తీర్చడానికే .... కానీ మీరే ఆ కబురూ ఈ కబురూ చెబుతూంటే _ మీ ఆసక్తి వేరే విషయాల మీదుందనుకున్నాను. నిన్న దుస్తుల్లో దాగిన నా అందం ఎందరినో పరవశింది. కానీ ఈ రాత్రి మీ కళ్ళకూ, నా అందానికీ మధ్య ఏ దుస్తులూ అడ్డురావు అయితే మీకు బాగా వయసై పోయింది. నా సౌఖ్యం కోసం మీ వయసును తగ్గించే మందులు నా దగ్గరున్నాయి. తీసుకుంటారా?" అంది లీలా సుందరి గొంతు.
"ఏమిటని ?" అంది చలమయ్య గొంతు.
"ఇదిగో _ ఇది మత్తెక్కించే సువాసనద్రవ్యం. ఒక్కసారి వాసన చూస్తిరా _ ...." తర్వాత ఆమె ఏదో తగ్గుస్వరంతో గుసగుసలాడునట్ట్లుంది. రాజారావుకి మాటలు వినబడలేదు.
ఆ తర్వాత ఏదో కదిలిన అలికిడి _ అటూ యిటూ అడుగుల చప్పడు తప్పితే గదిలో మాటలు పూర్తిగా ఆగిపోయాయి.
రాజారావు శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తూనే, మధ్య మధ్య గడియారం చూసుకుంటున్నాడు. టైము పదీ నలభై అవుతూండగా _ గదిలోని వ్యక్తి తలుపును సమీపిస్తున్న అలికిడియింది.
ఆ గది గోడనానుకుని కొంచెం అవతలగా ఒక బల్లవుంది. ఆ బల్లచాటుకు తప్పుకోవాలని రాజారావు ముందే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడదే చూశాడు.
గది తలుపులు తెరచుకున్నాయి. లీలాసుందరి ఓంట రిగా బయటకు వచ్చింది. మండువాలో ఒకసారి అటూ ఇటూ చూసి రాజారావు ఇంటివైపు నడిచింది. గుమ్మందాకా తలుపులకు చెవులానించి శ్రద్దగా కాసేపు ఏదో వినడానికి ప్రయత్నించింది. తర్వాత తలుపుకు బయట గొళ్ళెం పెట్టింది. అప్పుడామే వీధిలోకి నడిచింది.
ఆమె కనుమరుగు కాగానే రాజారావు చలమయ్య గదిలో దూరాడు. అక్కడి దృశ్యమతడి కాశ్చర్యాన్ని కలిగించింది.
చలమయ్య నోట్లో గుడ్డలు కుక్కబడి ఉన్నాయి. చేతులు వెనక్కు విరిచి కట్టబడ్డాయి. ఒంటిమీద చిన్న గోచీ మినహా ఎక్కడా నూలుపోగు లేదు. మనిషి కళ్ళు మూసుకుని ఉన్నాడు. అనుమానం వచ్చి రాజరావోసారి అతడి ముక్కు వద్ద వెలుంచి చూశాడు. శ్వాస ఆడుతోంది కానీ, మనిషికి స్పృహా ఉన్నట్ట్లులేదు. ఇంకా రాజరావోదో చేద్దామనుకూంటూ౦డగానే దూరంగా అతడికి అడుగుల చప్పుడు వినపడింది.
ఆ గదిలో అతడు దాక్కోవడానికి రెండు మూడుస్థలాలున్నాయి. రాజారావు చటుక్కున మంచంక్రిందకు దూరాడు. అక్కడో ట్రంకుపేట్టి ఉంది __ కాస్త పెద్ద సైజుదే! అతడుదాని వెనక్కు వెళ్ళిపోయాడు.
ఇప్పుడేవారయినా మంచం కిందకు తొంగి చూసినా అతడు కనిపించడు.
అడుగుల చప్పుడు గదిలో మంచాన్ని సమీపించింది.
"చలమయ్యగారూ!"
అది లీలాసుందరి కంఠమే! రాజారావు ఊపిరి బిగబట్టాడు.
చలమయ్య నుంచి ఉలుకూ పలుకూ లేదు.
రాజరావు ట్రంకుమీద ఓ కన్నుంచి, బయటే౦ జరుగుతున్నదీ చూడసాగాడు.
లీలాసుందరి మంచంమీ౦చి చలమయ్యను గదిమధ్య్తకు తరలించి నేలమీద పడుకోబెట్టింది. ఆయనింకా స్పృహా లేదు.
"చలమయ్యా కదల్లేదు.
అప్పుడు లీలాసుందరి చేత్తో చెళ్ళుమని చలమయ్య రెండు దవడలూ గట్టిగా వాయించింది. చంయ్య కళ్ళు విప్పి ఆమె వంకియా చూశాడు. బాధకంటే ఆశ్చర్యం ఎక్కువగా అయన కళ్ళలో కనబడింది. కాసేపటిక్రితం తనున్న పరిస్థితి వేరు ..... ఇప్పటి పరిస్థితి వేరు ....."
" చలమయ్యా!" అంది లీలాసుందరి _ 'నువ్వు చేసిన ఘోరాల కీరోజు నీకు శిక్ష పడబోతుంది . ఇంకా నీకు నరక బాధ ఉండదు. నేను విధించబోయే శిక్షలతో _ నీ పాపా లన్నింటికీ పరిహారం లభించి __ చావగానే స్వర్గానికి పోతావు నువ్వు ...."
చలమయ్య సన్నగా మూలిగాడు.
"పాపం _ మాట్లాడానికి నీకిప్పుడు నోరులేదు కదూ! అవున్లే - నువ్వు పుట్టినప్పుడుకూడా నీకు నోరులేదు. ఆతర్వాత నోరు సంపాదించావు. ఆ నోటితో ఎన్నో అబద్దాలాడావు. ఎన్నో అకార్యాల నాజ్ఞపించావు. ఇప్పుడు నేను నీ నోరు మూసేశాను. వెధవ నోరు __ దీన్ని మూసేయడం ఎంత సులభమో చూశావా! ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నీ వంటిమీద చిన్న గోచీ తప్ప ఏమీలేదు. నువ్వు పుట్టినప్పుడయితే ఆ గోచీ కూడా లేదుగా నీ వంటిమీద . చచ్చేటప్పుదాఖరికి నీ శరీరం కూడా నీ వెంటరాదు. మరెందుకింత కక్కుర్తి పడ్డావు.? ఇన్ని అమానుష కృత్యాలు చేశావు? ఇదంతా కేవలం డబ్బుకోసమంటే నేను నమ్మలేదు. పూర్వ కాలంలో రాజులు అడవికి వెళ్ళి మృగాలని వేటాడేవారు. నువ్వూ జీవితంలో అమాయక మృగాల్లాంటి మనుషులు కొందర్ని వేటాడావు. నీ వేట వారిని చంపదు. వారిలోని ఆత్మను చంపుతుంది. అప్పుడు వారు జీవచ్చవౌలాతారు ....."
ఉన్నట్లుండి లీలాసుందరి తన చేతిలోని కోరడాను రుళిపించింది. అంతవరకూ ఆమె చేతిలోని కోరడాను రాజారావు గమనించలేదు. అతడాశ్చర్యపడి చూస్తూండగా __ "అనుమానం మీద ఎన్నోసార్లు నీ పాలేళ్ళను కొరడాతో బాదావు. ఆ బాధేలాగుంటుందో ఇప్పుడు రుచి చూడు ......" అంటూ కోరాడానేత్తిందామె.
కొరడా చలమయ్య శరీరంపై చెళ్ళుమంది.
చలమయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతడికి నోరు మొదలదు, కాలు కదలదు . తనను తాను రక్షించుకోలేని అసహాయ స్థితి.