Read more!
 Previous Page Next Page 
ఈడూ జోడూ పేజి 2

    అతడి కన్నులలో నీరున్నది. ఆ నీరు సముద్రనిముందు చుక్కరీతిని కనబడవచ్చును. కానీ సముద్రమంతటి భాధతో నిండివున్న అతడి హయం ఈ విధంగా చుక్కలు చుక్కలుగా మాత్రమె అతడి బాధను బయటకు వేదనడపగ్గలుతున్నది.
    ప్రసాద్ బాధ ఎప్పటికి తీరేను?
    సుభద్ర నతడు ఎప్పటికి తీరేను?
    సుభద్ర నతడు ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు.  సుభాద్రకోసం అతడు అయినవారందరిని వదులుకున్నాడు. కేవలం సుభద్రకారణంగా అతడు లోకంలో తను ఏకాకి అన్న భావన రాలేదు.
    ఇప్పుడు సుభద్ర లేదు.......
    ప్రసాద్ ఏకాకి!
    మూడునెలలక్రితం శివరాత్రి జాగరణచేసి పుణ్యంవస్తుందని సమద్రస్నానానికి వచ్చారు ప్రసాద్, సుభద్ర, వారి గారాలపుత్రుడు.
    ముందు ఇద్దరూ బాబుచేత స్నానంచేయించి ఒడ్డున కూర్చోబెట్టడం కాసేపు బుద్ధిగా కూర్చున్నావాడల్లాబాబు తనూ మళ్ళీ స్నానానికిసిద్దపడ్డారు.
    ప్రసాద్ కు ఈత వచ్చును. అతడు కాస్త లోతున వున్నాడు.
    సుభద్ర ఒడ్డునే స్నానం చేస్తున్నది.
    బాబు ఉన్నట్లుండి సముద్రవైపుకు పరుగెత్తాడు.
    "బాబూ __ రాకు!" గట్టిగా అరిచింది సుభద్ర.
    బాబు వినలేదు.
    బాబూ!" అని అత్రుతుగాలేచి నిలబడింది సుభద్ర.
    అప్పుడక్కడున్న వారందరూశివరాత్రి జాగరణచేసి స్నానానికి వచ్చినవారే! ఉప్పునీటి స్నానం నిద్రలేని కనులలో మంటపుట్టిస్తోంది.
    అయినా అయుకుడినీ, అతడికనులలోని పాపచింతనుచూసి అప్రయత్నంగా తనవంక చూసుకుంది. తనకు పైటజారివున్నది. రవిక వంటికి హత్తుకునిఉన్నది.
    చటుక్కున ఆమె పైట సరిచేసుకోవాలనుకున్నది.
    తడివళ్ళు, తడిబట్టలు.
    అవతల్ పరుగున వస్తున్నబాబు.
    ఎదురుగా యువకుడి చూపులు.
    సరిగ్గాఅప్పుడే ఓ కెరటం ఉవ్వెత్తున లేచింది. అకేరటం తననూ ఆ యువకుడినీ మాత్రమెకాక బాబునుకూడా ముంచే౦త దూరంవెళ్ళగలదన్న అనుమానంతో సుభద్ర గట్టిగా "ఏమండీ __ బాబు!" అంది దూరంగా ఉన్నప్రసాద్ వరకూ ఆమాటలు చేరాయోలేదోనని __ ఏమండీ __ బాబుజాగ్రత్త!" అనిమళ్ళీ గట్టిగా అరిచింది మరోసారి అరవాలనుకుంది కానీ కెరటం ఆమెను ముంచింది.
    దూరాన్నుంచి ప్రసాద్ వీలైనంత త్వరగానే వచ్చాడు.
    అప్పటికే కెరటం సుభద్రను ఆరాయికేసి ఉతికింది.
    ప్రసాద్ త్వరగా ఆమెను సమీపించాడు.
    ఆమె తలనుండి రక్తంధారగా స్రవిస్తున్నది.
    "సుభద్రా!" అతడు అరిచాడు.
    సుభద్ర కళ్ళుతెరచి __"ఏమండీ బాబు జాగ్రత్త!" అన్నది.
    అవే ఆమె ఆఖరుమాటలు. అవే అమే ఆఖరుచూపులు.
    పెద్దకెరటాన్ని చూసిన బాబు భయంతో వేనకడుగువేసి తన్నుతాను రక్షించుకున్నాడు. సుభాద్రలో తత్తరపాటు కలిగించి ఆమె బ్యాలెన్సు తప్పడానికి కలసిపోయాయి.
    ఇప్పుడు ప్రసాద్ కు బాబు ఒక్కడే మిగిలాడు.
    సుభద్ర వున్నప్పుడు వారు ముగ్గురూ ఒకటిగా జీవించారు. ఆమె పోవడంలో ఇప్పుడు ప్రసాద్, బాబు ఎవరికీవారు ఏకాకిగా ఫీలవుతున్నారు.
    బాబుకు చావంటే ఏమిటో తెలియదు కానీ తన తల్లీ చచ్చిపోయిందని తెలుసు. అందువల్ల అస్తమానూ ఏడుస్తూ ఉంటాడు.
    బాబు అల్లరిపిల్లవాడు కాదు. బుద్దిమంతుడు. కానీ అమ్మకోసం అల్లరి చేస్తున్నాడు. ఎన్నిరోజులైనవాడు తల్లిని మరచిపోలేకపోతున్నాడు.
    ఏడాది వయసులో బాబు చాలా అల్లరిచేసేవాడు. ఆ అల్లరి చూసి తల్లీ తండ్రీ ముచ్చటపడడంతో వాడి ఆగడాలకుఅంతంలేకుండాపోయింది. మూడేళ్ళ వయసు వచ్చేసరికి వాడు మహాదుకువడిలా తయరయ్యాడు.
    పచ్చగా, దబ్బాపండులా ఆరోగ్యంతో మిసమిసలాడిపోతూండే బాబును చూసి ప్రసాద్, సుభద్ర అదృష్టం తమను అన్నివిధాలా కరుణించిందనుకున్నారు. కానీ బాబు ఆ వీధిలో చాలామందితల్లులులకు, పిల్లలుకు సింహస్వప్నంలా తయారయ్యాడు.
    వాడిని ఎవరింటికి తీసుకునివెళ్ళినా కొత్త, పాటఅని లేకుండా ఇల్లంతా పరుగులుతీసి చేతికందిన వస్తువు తీసుకునేవాడు. వాడి వేగంఅందుకునెందుకు కష్టంగావుండేది. జాలిలేకుండా చిన్నపిల్లలూ జాలితలచిన పెద్దపిల్లలనుకూడా బాబు తన శక్తికొలదీ కొడుతూండేవాడు.
    గూండా, రౌడీలాంటిపేర్లు వాడికి స్థిరపడ్డాయి. తల్లితండ్రులూ వాడిని ముద్దుగా ఆ పేర్లతో పిలిచినప్పటికీ __ మిగతావాళ్ళ పిలుపులతో ముద్దుకాక కసి, ద్వేషం, అసహాయత కలిపి వుండేవి.
    క్రమంగా సుభద్ర ఈ విషయం కానిపెట్టగలిగింది. ఆమె బాబును మార్చాలని సంకల్పించింది ఆమె ప్రయత్నాలు చాలావరకూ విఫలంకాగా ప్రసాద్ సాయం కోరింది. ప్రసాద్ రంగంలోకిడిగి అదెంత కష్టమైనా పనో కనిపెట్టగలిగాడు.
    బాబుకు ఒకపద్దతి అలవాటయ్యింది అదిమానుకునేందుకువాడూ సంసిద్దుడై లేడు.
    తల్లి, తండ్రి కలసి ఎదురుతిరిగేసరికి వాడు టట్టుకోలేక ఆగకుండా ఏడ్చేవాడు అతుకసారడంకానీ, ఇటులాలించడంకానీ వాడిఏడ్పును ఆపలేక పోయేవి. అలసట వచ్చేదాకా ఏడ్చేవాడు బాబు. ఆరోగ్యకరమైన పిల్లాడేమో అలసట రావడానికి వాడికి చాలాసేపు పట్టేది.
    ఇది గమనించి ప్రసాద్, సుభద్ర తమ పద్దతిని మార్చుకున్నారు.
    తల్లిదండ్రులలో ఇద్దరూ తనకు శత్రువులైపొతే పసిమనసు తట్టుకోలేదు. తను చేస్తున్నా అర్ధంచేసుకోగల వయసుకాదువాడిది. తిట్టినా కొట్టిఒనా ఏడుస్తాడు.
    అందుకని ఆఇంట్లో ప్రసాద్, సుభద్ర రెండు పార్టీలుగా, విదిపోయేవారు. బాబు ఏంతప్పుచేసినా "నాన్నగారు కొట్టేస్తారు__" అని సుభద్ర భేదిరించేది. సాయంత్రం ప్రసాద్ ఆఫీసునుంచి ఇంటికి రాగానే జరిగినతప్పుకు సుభాద్రనూ, బాబునూ కలిపి చెడామడా తిట్టేవాడు. సుభద్రను కొట్టినట్లు నటించి, బాబును కాస్త నెమ్మదిగా కొట్టేవాడు.
    ఇలా కొన్నాళ్ళుజరిగేసరికి బాబుకు తండ్రిఅంటే క్రమంగా భయం బయలుదేరింది. తప్పుదనీ తానేకాకుండా తల్లీ చేయవచ్చునానీ__ తల్లిచేసినా తప్పుకు శిక్ష తప్పదనీ వాడిచిన్నబుర్రకు అర్ధంకసాగింది.
    అయితే ఇందులో చిన్న ప్రమాదం కనబడింది.
    బాబుక్రమంగా తల్లికి చేరికై _తండ్రిని శత్రువులచూడడం ప్రారంభీంచాడు.ఆ యింట్లో తల్లిమాత్రమే. తనదనీ __ తండ్రి పరాయివాడనీ ఒక రకమైనా భావం వాడిలో పాతుకుపోసాగింది.
    తండ్రి ఊళ్ళోలేకపోతె వాడికి సంతోషంగావుండేది. ఊళ్ళోవున్నప్పుడు కూడా తండ్రి ఇంతలో వున్నంతసేపూ వాడికి ముళ్ళమీదున్నట్ట్లే వుండేది.
    "అమ్మా _ నాన్నేప్పుడు నిద్రపోతారే? నాన్నేప్పుడు ఆఫీసుకు వేడతారే? నన్నెప్పుడు ఊరికి వెడతారే?"
    తండ్రి గురించి బాబు ఎక్కువగా అడిగే ప్రశ్నలవి!
    ప్రసాద్ కిది బాధ అనిపించేది.
    "బాబును దారిలో పెట్టడం నాకిష్టమే! కానీ అందుకోసం నేను వాడిని రాయివాణ్ణి చేసుకోలేను..." అన్నాడతను భార్యవద్ద వాపోతూ.
    కానీ __ వాడి బాగుకోసం తప్పదు!" అన్నది సుభద్ర.
    "న బాధ అర్ధంచేసుకోవాలంటే నువ్వోసారి న స్థానంలోకిరా!" అన్నాడు ప్రసాద్ ఉక్రోషంగా.
    అప్పుడే సుభద్ర బుర్రలో ఏదో మెరిసింది.
    "కొంతకాలం మీరు, కొంతకాలం నేను.... ఇద్దరం వంతులవారీగా వాడినిభయపెడదా౦__" అన్నదామె.
    ప్రసాద్ ది నచ్చింది.
    ఆ తర్వాతనుంచి అంతా ఒక పథకం ప్రకారం నడిచిపోయింది.
    ఒకోసారి సుభద్ర భద్రకాళీ అయ్యేది. అప్పుడు ప్రసాద్ బాబు లలిమ్చేవాడు ప్రసాద్ ప్రళయరుద్రుడై నప్పుడు సుభద్ర వాడిని లాలించే అందువల్ల ఆ యింట్లో తనకు ఫలానావారే శత్రువులన్న భావన బాబులోనశించి౦ది అ యింట్లో వాడెప్పుడూ ఏకాకిగా ఫేలవలేదు. వాడిలో క్రమంగా మంచి మార్పులూ రాసాగాయి.
    అప్పుడు ప్రసాద్ ఒకరోజున భార్యతో __" బిడ్డలకు తల్లిదండ్రులిద్దరూ వుండడం ఎంత ముఖ్యమో నాకిప్పుడర్ధమవుతొంది. __" అన్నాడు.
    "అవునండీ __ వయసులో వున్న స్త్రీ పురుశాలకు ఒకరినొకరు ఎంత అవసరమో  , ఒక వయసు వచ్చేవరకూ పిల్లలకు తల్లిదండ్రులిద్దరూ ఆ అవసరం ...." అంది సుభద్ర.
    "అదీనిజమే __ కానీ పిల్లలకు తోడుగా పిల్లలు మరింతబాగుంటారేమో అన్నాడు ప్రసాద్.
    సుభద్ర బుగ్గలు, ఎరుపెక్కాయి. __"ముందువీడినో దారినపడనివ్వండి తర్వాత వీడికి తోడుగురించి ఆలోచిద్దాం __"
    బాబు దారిన పడ్డాడు. వాడికితోడు గురించి అలోచించగానే ఆమె ప్రసాద్ కు తోడు లేకుండా చేసి వెళ్ళిపోయింది.
    ప్రసాద్ అలాగే సముద్రంవంక చూస్తూ __":సుభద్రా! నేనున్నాలేకుండా ఇంటివద్దబాబు ఒంటరివాడు. వాడి ఇమ్తరితనాన్నేలా పొగొట్టను?" అనుకున్నాడు.
    అతడు రోజూ సాయంత్రం ఆఫీసునుంచి తిన్నగా భీచికివస్తాడు. అక్కడ సుభద్రను గుర్తుచేసుకుంటూ ఏడుస్తాడు.
    టెలిక చేసుకుందామనుకున్న మనసు మరింత బరువెక్కుతుంది
    ఇల్లు చేరతాడు.
    అక్కడ బాబు వుంటాడు.
    అతడికి మళ్ళీ ఏడుపు వస్తుంది. అతన్నిచూసి బాబుకూడా ఏడుస్తాడు.
    వాళ్ళిద్దర్నీ చూసి పనివాడు శీనయ్య కళ్ళోత్తుకుంటాడు.

 Previous Page Next Page