Read more!
Next Page 
ఈడూ జోడూ పేజి 1

                                 

                                  ఈడూ జోడూ

                                                  వసుంధర

 

 

                                                    

 


    ఆ గదిలో అద్దంముందు నిలబడి __
    నిరంజనరావు తలదువ్వుకుంటున్నాడు!
    అలా అతడు చాలాసేపునుంచి తల దువ్వుతున్నాడు.
    చిత్రకారుడు తనకుంచెతో ఒకేఒక్కగీతగిసి మనిషి ముఖంలోని అందచందాలు మార్చివేయగలడు.
    చిత్రకారుడు బొమ్మలకు చేసేపనిని సామాన్యమానవుడు తన ముఖానికి చేస్తే దాన్ని మేకఫ్ అంటారు.
    ప్రస్తుతం నిరంజనరావు మేకఫ్ అవుతున్నాడు.
    అతడు చాలాచాలా సామాన్యుడు. ఎందుకంటే బియ్యేప్యాసయ్యాడు. ఇంకా ఉద్యోగం లేదు.
    ఆ వీధిలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకుని రోజూ ఉద్యోగం కోసం తిరిగివస్తూంటాడు. ప్రయివెట్లమీద అతడికి నేలకు మూడువందలు పైనవస్తుంది. ఇంటి అద్దేకూ పైఖర్చులకూ అతడికా డబ్బు సరిపోతోంది.
    నిరంజనరావు ఆ వీధిలో రెండిళ్ళల్లో ప్రైవైటుచెబుతున్నాడు. రెండిళ్ళలోనూ టే౦త్ క్లాసు కుర్రాళ్ళేఉన్నారు. అతడు ఇద్దరికీకలిపి ఒకేయింట్లో ప్రైవైటు చెబుతాడు. ఓ శిష్యుడిపేరు శివరావు రేండో శిష్యుడు రవి. అతడిప్రయివేటు ఒకరోజు శివరావు ఇంట్లోనూ, రెండోరోజు రవి ఇంట్లోనూ కొనసాగుతుంది.
    ఈ రోజు ఇప్పుడు నిరంజనరావు రవి ఇంటికి వెళ్ళడానికి సిద్దపడుతున్నాడు. తలదువ్వడమే ఎప్పటికీ పూర్తీకావడంలేదు.
    రవి ఇంటికి వెళ్ళినా శివరావు ఇంటికి వెళ్ళిన నిరంజనరావు. తన అందానికి మెరుగులు దిద్దడానికి ప్రయత్నిస్తూనేవుంటాడు. అందుకు కారణం రెండిళ్ళలోనూ  పెళ్ళికాని కన్నెపిల్లలున్నారు. శివరావు అక్క వసంతలక్ష్మిదీ, రవి అక్క ఉదయ దీ, ఇంచుమించు ఒకటేవయసు. ఇద్దరూ ఇంటర్మీడియేట్ ప్యాసైచదువుకు స్వస్తిచెప్పి పెళ్ళికోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ అందంగా వుంటారు. ఇద్దరూ అమరికలు లేకుండా నిరంజనరావుతో కబుర్లు చెబుతారు.
    నిరంజనరావుది రమారమి పాతికెళ్ళవయసు. కానీ బాగా కుర్రాడిలా కనబడుతాడు. అతడికుద్యోగం లేకపోవడంవలన ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రుల దృష్టి అతడిపైన పడలేదు.
    కట్నం ఇవ్వకుండా ఆడపిల్లకు, ఉద్యోగం లేకుండా మగవాడికి__ పెళ్ళికాదని నిరంజనరావుకి తెలుసు. అయినా అతడి వయసు పెళ్ళిగురించి కలలు కంటున్నది. వసంతలక్ష్మి తోటీ, ఉదయతోటీ అతడెక్కువగా పెళ్ళిగురించే మాట్లాడేవాడు. వాళ్ళకూ పెళ్ళిమాటలు ఆసక్తిగానే ఉండేవి.
    పెళ్ళిచేసుకోమని ఇంటివద్దనుంచి ఒకటే ఒత్తిడి. కానీ ఉద్యోగం లేనిదే పెళ్ళిచేసుకోవడం అవివేకం __" అని నిరంజనరావు ఆ కన్యలకు చెప్పేవాడు. కానీ అతడి తండ్రి ఎ ఉత్తరంలోనూ నిరంజనరావు పెళ్ళిగురించి రాసేవాడు కాదు.  త్వరగా ఉద్యోగం సంపాదించుకోమనీ __ తనకు ఆర్ధికంగా సాయపడమనీ కోరడంతప్ప అయన ఉత్తరాల్లో మరో విశేషముండేదికాదు.
    మీ రన్నది నిజం సంసార జీవితానికి  డబ్బు చాలా అవసరం" అనే వారా అతివలిద్దరూ.
    వాళ్ళు తనను లేనివాడిగా జమకడుతున్నారేమోనన్న భయంతో __ "డబ్బుదేముందీ__ ఒకాయన నాకు ముప్ఫైవేలు కట్నం ఇస్తానన్నాడు. కట్నం తీసుకోవడం నా మనసుకు నచ్చనిపని. మరోకాయన తన వ్యాపారంలో భాగామిస్తానన్నాడు. మానగారి సాయంతోకాక నా కళ్ళ మీద నేను నాకై నేనుగా నిలబడాలి. అదీ నా ఆశయం. అందుకే ఆ సంభందమూ కాదన్నాను__" అని గర్వంగా చెప్పాడు. నిరంజనరావు.
    అందులో కొంత నిజముంది. అలాంటి సంబంధాలు రెండు నిరంజన రావుదాకా వచ్చి__ అతడికంటె మంచి వరుడు దొరకగా చేజారిపోయాయి. అప్పుడు నిరంజనరావు తన దురుదృష్టానికి మనసులోనే ఏడ్చాడు.
    ముప్ఫివేలు కట్నమూ, వ్యాపారంలో భాగమూ అనగానే ఆ కన్నెపిల్లలు గతుక్కుమన్నారు. వారు నిరంజనరావును పెళ్ళిచేసుకోవాలని కళలు గనడంలేదు. కానీ నిరంజనరావు మాటల్లో వారికి తమకు కాబోయే వరుడి కనేసపు కోర్కెలు వినబడుతున్నాయి. ఆ కోర్కెలు తమ వివాహానికి ప్రతి బంధకాలు.
     ఆ కన్నెపిల్లల కళ్ళలోనిభయాన్ని నిరంజనరావు చదివాడు. వెంటనే __"నేను ఆదర్శవాదిని నా కాబోయే భార్యనుంచి కానీకట్నం ఆశించను. సింపుల్ గా ఏ ఖర్చులూలేకుండా పెళ్ళిచేసుకుంటాను. ఆ తర్వాత కట్నంతేలేదని భార్యను భాధించను. నేను తన భర్తకావడం జన్మజన్మల పుణ్యఫలమన్న భావన ఆమెకు కలికేలా మసలుకుంటాను__" అని చెప్పాడు.
    తక్షణం ఆ మగువలిద్దరికీ అతడంటే ఆరాధనాభావం కలిగింది. అదెక్కడ పోతుందన్న భయంకొద్దీ నిరంజనరావు __"న కాబోయే భార్య న అభిరుచలను అనుగుణంగా ఉండాలి. కులమతాలతోకానీ, ఆమె గతచరిత్రలో కానీ నాకు సంబంధంలేదు. __" అంటూ తన ఊహసుందరిని వర్ణించారు. ఆ వర్ణనలో కొంత వసంతలక్ష్మి కీ, కొంత ఉదయకూ వర్తిస్తుంది.
    ఆ భావాలిద్దరూ తన గురించి కలలుకంటూ తనకోసం ఒకరితో ఒకరు పోటీపడాలి. ఈ నాటి తెలుగు సినిమాల్లో జయసుధ, జయప్రద లేదా శ్రీదేవి __ అక్కినేనికోసమో, శోభన్ బాబు కోసమో, కృష్ణకోసమో, చిరంజీవికొసమో పోటీపడ్డట్లు వాళ్ళు తనకోసం పోటీపడాలి. వాళ్ళలో పోటీభావాలు తలెత్తడం కోసం అందుకు అనువైనమాటలు తను చెప్పాలి.
    తను చేస్తున్నది తప్పో ఒప్పో నిరంజనరావుకు తెలియదు. తను చెబుతున్నది నిజమోకాదో అతడికి తెలియదు. తను వసంతలక్ష్మి, ఉదయంలో ఏ ఒక్కరినైనా ప్రేమిస్తున్నాడో లేదో అతడికి తెలియదు. తనకుద్యోగంవస్తే  వారిద్దరిలో ఎవరినైనా పెళ్ళికి ఎన్నుకుంటాడోలేదోకూడా అతడాలోచించలేదు.
    అతడికి ప్రస్తుతం ఉద్యోగంలేదు. కోరికలు కలలరూపంలో ఉండిపోతున్నాయి. ఆ కలలల్ను అతడు మరో ఇద్దరు కన్నెపిల్లలతో పంచుకుని ఆనందిస్తున్నాడు.
    ఇప్పుడతాడు రవిఇంటికి వెడుతున్నాడు అక్కడ ఉదయ ఉంటుంది. ఉదయవంక పెట్టికుని వసంతలక్ష్మి వస్తుంది. ప్రయివేట్ కాగానే వారిద్దరూ తనతో బాతాఖానీ మొదలు పెడతారు.
    నిరంజనరావు తలదువ్వడం ఆపాడు. చిన్నకత్తేరతీసి మీసాలచివర సన్నగా కత్తిరించాడు. అతడిముఖంలో ఇప్పుడు ఒక చిన్న గీతలో తనబొమ్మకు అందాలుతెచ్చిన చిత్రకారుడి తృప్తి కనబడుతున్నది.
    నిరంజనరావు చెప్పులు వేసుకుని గాడికి తాళ్ళవేసి బయటకువచ్చాడు. నెమ్మదిగా రవిఇల్లు చేరుకున్నాడు.
    వీదిగదిలో అతడి ప్రయివేటు.
    గదిలో రవిలేదు. ఉదయఉన్నది.
    నిరంజనరావు ఓసారి క్రాపుసరిచేసుకోబోయి ఆగాడు.
    ఉదయ అక్కడ ఒంటరిగాలేదు. ఆమెతోపాటుఅక్కడ సుమారు అయిదారెండ్లబాబు ఒకడున్నాడు వాడుచాలాముద్దుగా ఉన్నాడు.
    "నువ్వునన్ను అమ్మా! అనిపిలు, " అంటున్నది ఉదయ.  
    "నువ్వు అమ్మవుకాడు....." అంటున్నాడుబాబు.
    "పిలిచిచూడు నేనేంచేసానో __" అంటున్నది ఉదయ,
    "నేను పిలవను __" నిష్కర్షంగా చెప్పాడు బాబు.
    ఉదయ నిస్సహాయరాలై నట్లు అంటూయిటూచూసింది. అప్పుడామేకు నిరంజనరావు కనిపించాడు.
    ఉదయ తెల్లబోయి అబాబును ఎత్తుకుని అక్కణ్ణుంచి బయటకువస్తూ __"రవిని పంపిస్తానండండి." అనివెంటనే వెళ్ళిపోయింది.
    తననుచూడగానే ఎప్పుడూ కనిపించే మెరుపు ఈరోజు ఉదయ కలలలో కనబడలేదు. ఆ విషయం నిరంజనరావు గుర్తించాడు. అంతకుమించి అతడిని భాదిస్తున్నసమస్య ఆ బాబు ఎవరా అని!
    నాలుగు రోజులుగా అతడూళ్ళోలేడు. ఏదో ఇంటర్వ్యూకెళ్ళివచ్చాడు. అందుకే ఉదయనూ, వసంతలక్ష్మి నీ చూడాలని అత్రతపడి మరీమరీ ఆలంకరించుకుని కాస్తముందుగానే ప్రయివేటుకు వచ్చాడు.
    అబాబు ఎవరు? వాదిని ఉదయ అమ్మాఅని ఎందుకుపిలవ మంటున్నది?
    ఈ ప్రశ్నలు నిరంజనరావు బుర్రలో గిరగిరాతిరుగుతూన్నాయి.
    సమాధానం దొరికేలోగానే అతడిశిష్యులిద్దరూ వచ్చారు. నిరంజనరావు కళ్ళు వసంతలక్ష్మికోసం వెతికాయి.
    ఆరోజు అక్కడికి ఆమెకూడా రాలేదు.
                                                                       2
    ప్రసాద్ బీచివడ్డ కుఉర్చుని సముద్రపుటలను చూస్తున్నాడు. కానీ తడికళ్ళు శూన్యంలోకి చూస్తున్నట్లే ఉన్నాయి.
    అతడికి ఎదురుగా కూర్చుని సుభద్ర నవ్వుతున్నది.
    ఆమె నవ్వుఎంత మనోహరంగా ఉన్నది?
    గాలికి కదలోడుతున్న ఆమె ముంగురులు ఆవేసముద్రపుటలన్ని కాంతిని కలుగజేస్తున్నాయి. ఆమెనునుదుటనున్న ఎర్రని తిలకం సముద్రమందలి అరుణోదయాన్ని గుర్తుచేస్తున్నది.
    ఆడది ఒక మహాసముద్రం ఆమె ప్రళయాన్ని సృష్టించగలదు. ఎందరిలో ఆశ్రయమిచ్చి కాపాడగలదు. ఆమె సముద్రంలా లోతైనది, గంభేరనది!
    "సుభద్రా!" అన్నాడు ప్రసాద్.
    బదులుగా అతడికి సముద్రఘోషవినిపించింది. అతడిపిలుపు ఆ బాషలో కలసిపోయింది.
    సుభద్రా! మళ్ళీ అన్నాడు ప్రసాద్.
    అతడి ఎదురుగా కూర్చున్న సుభద్ర ముఖంలోకి నవ్వు మాయమయింది. అప్పుడే వువ్వెత్తున లేచిన కెరటంఒకటి ముందుకువచ్చి సుభద్రనుముంచింది.
    కెరటం వెనక్కు వెళ్ళిపోయింది. అక్కడ సుభద్రలేడు.
    ప్రసాద్ రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని __"సుభద్రా! సముద్ర గంభీరురాలివైన నిన్ను సముద్రం తనలో కలుపుతుంది. నేనిప్పుడెం చేయనినవ్వులేక నేను బ్రతకలేను __ అన్నాడు.

Next Page