'అయినా నీకిదేం బుద్ది? పెళ్ళయిన ఆడవాళ్ళను వాళ్ళ మానాన బ్రతకనీకుండా " అంది మంజుల.
"అందానికీ పెళ్ళికీ సంబంధం లేదు. నేను ఆడదాని ముఖం చూస్తానే గాని మెడను చూడను. అదీకాక ఇష్టపది స్త్రీ పురుషు లోకటయితే అందులో తప్పులేదు. నీకు నగలు నాకు నీ వగలు..." అంటూ అతనామే నింకోసారి ముద్దు పెట్టుకున్నారు.
ఆమె అతన్ని మృదువుగా విడిపించుకుని, "అడ్వాన్స్ అయిపొయింది. అసలు రాత్రి తీసుకుందువు గానీ, మరి ఇంక నా అడ్వాన్సివ్వు ' అంది.
"తీసుకో -- నీక్కావలసిన నగ తీసుకో-- ఇందులో నకిలీ వేమీ వుండవు. నీకు ఎంత ఖరీదయినది కావాలన్నా తీసుకో, నువ్వు ఎంత విలువయినా చేస్తావు-- " అన్నాడు వెంకటాచలం.
మంజుల ఒక నగ ఎరుకుంది.
"ఘటికురాలవే. దాని ఖరీదు డెబ్బయి రెండు వేలు. ఐనా నా కిష్టమే౧' అన్నాడు వెంకటాచలం.
"ఒక్క రాత్రి కోసం డెబ్బయి రెండువేలా? నువ్వు ఎక్కడా తడబడ్డం లేదు. నీలో ఏదయినా మోసముందేమో ననిపిస్తోంది --" అంది మంజుల అనుమానంగా.
"నెలకు పదిలక్షలు తక్కువ కాకుండా సంపాదిస్తాను. అప్పుడప్పుడిలా జల్సా చేయకపోతే నా సంపాదన దేనికి అడ్డమయిన వాళ్ళకి నేనిలా ఇవ్వనుగా. వందిచ్చే చోట వందిస్తాను. వెయ్యిచ్చేచోట వెయ్యిస్తాను. ఇంతవరకూ ఎవ్వరికీ అయిదొందలు తక్కువివ్వలేదు. డెబ్బయి రెండు వెల కెక్కు వివ్వలేదు. నీకు ఎంతిచ్చినా తక్కువే అవుతుంది. అయినా నా హద్దులు నాకున్నాయి -- " అన్నాడు వెంకటాచలం.
"నా హద్దులు నాకూ వున్నాయి. నీకోసం మొట్టమొదటిసారిగా హద్దులు దాటుతున్నాను. భయంగా వుంది. ఆయనకు తెలిస్తే ఏమవుతుంది?'
"తెలియదు. ఆ విషయంలో నీకేం భయం లేదు. హోటల్లో నీ పక్క రూమ్ బుక్ చేసాను నేను ఎవ్వరికీ అనుమానం రాకుండా. ఎన్నింటికి రమ్మంటావో చెప్పు !" అన్నాడు వెంకటాచలం.
"రాత్రి తోమ్మిందింటికి " అన్నాడు.
నగను పెట్టెలో పెట్టి తాళం వేసాక తాళం తీసుకున్నాడు వెంకటాచలం.
"రాత్రి తొమ్మిది దాకా నిన్ను నా ఏజంట్లు గమనిస్తూనే వుంటారు. నీమీద ఈగ వాలనివ్వరు. నిన్ను యీ వూరునించి కదలనివ్వరు. అదీ పరిస్థితీ!" అన్నాడు వెంకటాచలం.
4
సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు వెంకటాచలం మంజుల గది తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగానే చటుక్కున లోపలకు దూరి తలుపులు వేసి "హమ్మయ్య!" అన్నాడు.
"ఏమిటంత భయపడి పోతున్నారు?" అంది మంజుల.
"ఊళ్ళోని పెద్ద వ్యాపారిని. తప్పుడు పనులు చేస్తూ పట్టుబడ్డానంటే ...." అని అర్దోక్తిలో ఆగిపోయాడు వెంకటాచలం. అతను కాస్త స్థిమిత పడ్డాడు.
"తెలిసి కూడా తప్పుడు పనులు చేయడమెందుకు?"
"మనిద్దరికీ అంగీకారమైనప్పుడు ఇది తప్పు పనెలా గవుతుంది?' అన్నాడు వెంకటాచలం.
"నిజానికి నాకు అంగీకారం కాదు. నా మోజంతా నీ మీదనే కానీ నీపై కాదు. నువ్వుత్తినే నగ ఇస్తానంటే నేను ఆనందంగా తీసుకుంటాను" అంది మంజుల.
"ఈకబుర్లు నా దగ్గర కాదు. నీకు నిజంగా నగలపై అంత మోజుంటే ఎలాగోలా నీ భర్తను వేధించయినా అది కొనిపించుకునే దానివి. లేదా దొంగతనానికైనా పాల్పడేదానివి నువ్వలా చేయలేదు. ఒకరాత్రి నాతొ గడపడానికి ఇష్టపడ్డావు. అనుభవం మీద చెబుతున్నాను, మగవాడి కంటే ఆడదానికే వ్యభిచార భావాలెక్కువ. మన సమాజంలో వాటికి సరయిన ప్రోత్సాహం లేక ఆడది అణగి వుంది. మగాడు పైకి చెబుతాడు. ఆడది లోలోన కలిగి వుండి అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. ఏదో తప్పనిసరయి ఇందుకు తలపడ్డానని సరిపేట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. నిజానికి నాకంటే నువ్వే యీ రాత్రి కోసం ఎదురు చూస్తున్నావని నా నమ్మకం. నేనడిగినా అది నువ్వోప్పుకోవు. కానీ నీ కన్నులు నాకన్నీ చెబుతున్నాయ-- అన్నాడు వెంకటాచలం.
మంజుల అతను చెప్పినవాటికి కాదనలేదు. "నిన్నింత వరకూ రానిచ్చాక ఏమన్నా పడాలి. ముందు నగల పెట్టె తాళం ఇవ్వు --" అంది.
"నా దగ్గర ఇలాంటి మోసాలుండవు. నేను డబ్బు కక్కుర్తి పడేవాణ్ణి కాదు"అంటూ వెంకటాచలం ఆమెకు తాళం యిచ్చాడు. ఆ తాళంతో పెట్టె తెరిచి నగ తీసుకుని తన పెట్టెలో వేసుకుందామె. నగలపెట్టె ని వెంకటాచలానికి తిరిగి యిస్తూ "ఇది యిలా యెంత మంది ఆడవాళ్ళ చేతులు మారిందో . నీకిది నెక్ట్స్ కేస్ కు పనికొస్తుంది. తీసుకో" అంది.
"అదెలాగూ తీసుకుంటాను. నాకెంతో ముఖ్యమైన పెట్టె యిది. జర్మనీ నుంచి తెప్పించాను" అన్నాడు వెంకటాచలం మంజులను సమీపిస్తూ.
"ముందడుగు వెయ్యకు. నేను నిన్నిప్పుడు కాదంటే ఏం చేస్తావ్?" అంది మంజుల.
"నేను గొడవలు కోరే మనిషిని కాదు. మర్యాదస్తులతో మర్యాదగా ప్రయత్నిస్తాను. మాట కాదనేవారితో నేనెలా ప్రవర్తిస్తానో నేను నీకు చెప్పడం మంచిది కాదు. మన మిప్పుడు శృంగారం అనుభవించాలి. అందుకోసం డెబ్బై రెండు వేలు ఖర్చు చేశాన్నేను. అదేఒక్క రాత్రికి. ఆ తర్వాత మళ్ళీ నీ జోలికి రాను" అన్నాడు వెంకటాచలం.
"నీ మాట నువ్వు నిలుపుకున్నావు. నా మాట నేను నిలుపుకుంటాను"అంది మంజుల.
వెంకటాచలం ఆ గదిని తెల్లవారుజామున నాలుగింటికి వదిలిపెట్టాడు. అంతవరకూ యిద్దరూ మెలకువగానే వున్నారు.
5
కాలింగ్ బెల్ మోత విని మంజుల చిరాగ్గా టైము చూసుకుంది. ఇంకా అయిదే అయింది. తనకు నిద్రపట్టి గంట కూడా కాలేదు.
మంజుల విసుక్కుంటూ కళ్ళు నులుముకుని బట్టలు సరిచేసుకుని వెళ్ళి తలుపు తీసి ఉలిక్కిపడింది.
ఎదురుగా యిద్దరు మనుషులున్నారు. వేషధారణ ను బట్టి వాళ్ళలో ఒకడు పోలీస్ ఇన్స్ పెక్టర్, ఇంకొకడు కానిస్టేబులూ అని అర్ధమవుతోంది.
"క్షమించాలి మేడమ్! చిన్న పని మీద వచ్చాం. దొంగవోకడు నగల షాపులో చోరీ చేసి పారిపోతూ -- వెనుక వైపు నుంచి ఈ రూంలో దూరాడు. మీరూం గాలించాలి" అన్నాడు ఇన్ స్పెక్టర్.
మంజులకు నిద్రమత్తు విడిపోయినది. ఆమె తల ఊసింది.
"కానిస్టేబుల్! నువ్వు తలుపులు వేసి గుమ్మం దగ్గర కాపలా కాయి. నేను లోపల చూస్తాను" అంటూ ఇన్స్ పెక్టర్ గదంతా గాలించసాగాడు. అతడి కెక్కడా వేరే మనిషన్నవాడెవడూ కనిపించలేదు.
"కళ్ళు గప్పి పారిపోయాడు బ్రూట్!' అని విసుక్కుని మంజుల వైపు తిరిగి "మేడమ్ ! మీరు అన్యధా భావించవద్దు. తను దొంగలించిన వస్తువులు వాడిక్కడ దాచి వుండే అవకాశముంది. గది సోదా చేయాలి" అని ఆమె అనుమతి కోసం ఎదురు చూడకుండా అక్కడ వెతకసాగాడు.
గదిలో పెద్ద సామాను లేదు. అతను ముందుగా సూట్ కేస్ వెతికాడు. అందులోంచి నగ బయటపడింది. డెబ్బై రెండు వేల ధరని సూచిస్తూ వున్న కాగితం కూడా యింకా ఆ నగకు వ్రేలాడుతోంది.
"వాటీజ్ దిస్!" అన్నాడు ఇన్స్ పెక్టర్.
మంజులకు జవాబు తోచలేదు.
"ఈ నగ మీరు కొన్నారా?"
మంజుల తల వూపింది.
"బిల్లుందా?"
మంజుల తల వూపింది.
"అయితే చూపించండి" అని "మీ దగ్గర బిల్లు లేకపోతే ఆ నగ మీ దగ్గరకు ఎలా వచ్చిందో కోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సుంటుంది మీరు" అన్నాడు ఇన్స్ పెక్టర్.
"నేనా ? కోర్టులో సంజాయిషీయా?' అంది మంజుల బేలగా.
ఇన్స్ పెక్టర్ ఆమెవంక జాలిగా చూసి "నాకు తెలుసు. మీకీ నగ గురించి తెలియదు. దొంగ తెలివిగా యిక్కడ దాచి వెళ్ళాడు. నేనిలా వెతుకుతానని వాడికి తోచి వుండదు. ఆల్రైట్ . నేను మీకో ఉపకారం చేయగలను. ఈ నగ దొంగదగ్గర దొరికినట్లు చెప్పి ఏ గొడవా లేకుండా నగల షాపులో అప్పజేప్పేస్తాను. మీరూ దీని గురించి మరిచి పొండి" అన్నాడు.
మంజులకు ఏం చేయాలో తోచలేదు. వెంకటాచలం యెంత తెలివిగా ప్రవర్తించాడు. తను రాత్రి తెల్లవార్లూ తనతో గడిపి వెళ్ళి పోలీసులకు తన షాపులోంచి నగను తీసుకుని దొంగ పారిపోయి యిక్కడ గదిలో దూరిన రుజువేదో తమాషాగా సృష్టించాడు. తనకా నగ ఎలా వచ్చిందో చెప్పుకోలేదు.