Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 7

                                 

 

                                 72 వేల నగ

                                                                  వసుంధర

                             
    ఒక యువకుడు , యువతి కార్లోంచి దిగారు. యువకుడికి పాతికేళ్ళు వుంటాయి. యువతికి ఇరవై ఎల్లుమ్తాయి. చూడ్డానికిద్దరూ భార్య భర్తల్లా వున్నారు. యువతి భువనైక మోహిని లాగుంది.
    ఇద్దరూ వెంకటాచలం నగల దుకాణం లో అడుగు పెట్టారు. మొత్తం షాపంతా ఆమె వైపు చూసింది. దుకాణం యజమాని వెంకటాచలం ఆమెను చూసి కళ్ళు మళ్ళీ తిప్పుకోలేక పోయాడు.
    వెంకటాచలానికి స్త్రీ వ్యవహారమున్నదనీ అందమైన ఆడవాళ్ళను చూస్తె వదిలి పెట్టడనీ చెప్పుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అది అతడి బలహీనత.
    అతను తిన్నగా వెంకటాచలం దగ్గరకే వెళ్ళి -- "నా పేరు వ్రీరేంద్ర. ఈమె నా భార్య మంజుల. మేము బెంగుళూరు నుంచి వచ్చాం. మీ షాపులో నెక్లేసు లు మంచి వెరైటీ ని వున్నాయని తెలిసింది. మంచివేమైనా వుంటే చూపించండి. మేమింకా ఈ ఊళ్ళో నాల్రోజులుంటాం. రెడీగా లేకపోతె మంచి మోడల్స్ న్నా సరే - అర్దరిస్తాం-- నేను వెళ్ళేలోగా చేసి ఇవ్వాలి. వీలవుతుందా?" అన్నాడు.
    వెంకటాచలం తన చూపులు మంజుల నుంచి వీరేంద్ర వైపు తిప్పి -- "ఎంతలో కావాలి!" అన్నాడు.
    "ఇంతా అంతా అని లేదు. మాకు నచ్చడాన్ని బట్టి వుంటుంది" అన్నాడు వీరేంద్ర.
    వెంకటాచలం ఆ దంపతులను పరీక్షగా చూసి వీళ్ళు మరీ పెద్దఖరీదు చేయరనుకున్నాడు. మామా అయితే బేరం నాలుగైదు వేలకు మించదు. అయితే వెంకటాచలం కన్ను మంజులపై పడింది.
    "స్పెషల్ రూమ్ కి రండి సార్!" అంటూ వాళ్ళను స్పెషల్ రూం లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ అతనే నెక్లేసు లు వరసగా చూపించాడు. ఒక్కటీ పాతికవేలు లోపు లేదు.
      "చాలా ఖరీదుగా వున్నాయి"అన్నాడు వీరేంద్ర.
    'అలాగంటారేమిటి సార్ !నేనైతే నాకు నచ్చిన వాళ్ళకి లాంటివి ఊరికే బహుమానంగా ఇస్తూ ఉంటారు అన్నాడు వెంకటాచలం-- ఓరగా మంజుల వైపు చూస్తూ.
మంజుల వెంకటచలం చూపుల్ని పట్టించుకున్నట్లు లేదు. ఆమె ఉత్సాహంగా హారాలు చూస్తోంది. వాటిలో ఒకటి ఆమెకు బాగా నచ్చింది.
    "ఇది చాలా బాగుంది కదూ!" అందామె భర్తతో.
    "బాగానే ఉంది. ఖరీదు కూడా ఇరవై ఎనిమిది వేలు అన్నాడు వీరేంద్ర.
    "ఎలాగో అలా ఇది కొనాలి" అంది మంజుల.
    వీరేంద్ర ఆమెను కాస్త పక్కగా తీసుకు వెళ్ళి "మీకేమయినా మతి పోయిందా -- మనం కూడా తెచ్చిన క్యాషు పాతిక వేలుండదు" అన్నాడు.
    'అవుననుకోండి. నాకింతగా నచ్చే నెక్లెస్ మళ్ళీ దొరుకుతుందనుకోను. కావాలంటే నా పాత నగలు కొన్ని అమ్మేద్దాం" అంది మంజుల.
    "పాత నగలు అమ్మడం నాకిష్టం లేదు. అవి వంశాను గతంగా వస్తున్నవి. మా అమ్మ నుంచి నీకోచ్చినట్లే నీ నుంచి నీ కోడలికి సంక్రమించాలి-- ఇంకా మనకెన్నో ఖర్చులు వున్నాయి. భూములమ్మిన డబ్బంతా ఒక్క నగకే ఖర్చు పెడితే ఎలా? అయిదారు వేలల్లో ఏదైనా చూడు"అన్నాడు వీరేంద్ర.
    "కొంటె ఇది కొనండి లేకపోతె ఈసారికి నగలే వద్దు" అంది మంజుల.
    "సరే- యీసారికి నగలు వొద్దు --" అన్నాడు వీరేంద్ర.
    వెంకటాచలం యీ సంభాషణ వింటూనే వున్నాడు. వీళ్ళు మళ్ళీ తనను సమీపించగానే -- "సార్ , అయిదారు వేలలో ఏమైనా చూపించమంటారా?" అన్నాడు.
    "వద్దు" అన్నాడు వీరేంద్ర.
    మంజుల విసవిసా బైటకు నడిచింది.
    "ఆహా - ఏమి లావణ్యం !" అనుకున్నాడు వెంకటాచలం.

                                     2
    కారు హోటల్ గౌరవ్ ముందు ఆగింది. "నువ్వు రూంకి వెళ్ళు-- నేను కొన్ని పనులు చూసుకు వస్తాను" అన్నాడు వీరేంద్ర . మంజుల కారు దిగింది. కారు వెళ్ళి పోయింది.
    మంజుల లోపలికి వెళ్ళబోతుండగా అక్కడికో యువతి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి మంజులను విష్ చేసింది.
    "ఎవరు మీరు?' అంది మంజుల.
    "నన్ను మీరని మన్నించక్కర్లేదు. మీ రూమ్ కి వస్తాను. చిన్న మాట చెప్పాలి!"అంది.
    "ఏమిటా మాట!"అంది మంజుల.
    "నా మెడలోని హారం చూశావా?" అందామె.
    మంజుల కళ్ళు మెరిశాయి. ఆ హారం చాలా ఖరీదైనది బాగుంది. 'చూశాను బాగుంది ?"
    "దీని ఖరీదు నలబై వేలు. అయితే నేను చాలా చౌకగా దీన్ని సంపాదించాను. ఆ ఉపాయం కావాలంటే నేను నీకు చెబుతాను. అందుకే నీగదికి వస్తానంటున్నాను"అందామె.
    మంజుల ఆమెను తన గదికి తీసుకుని వెళ్ళింది.
    "నాపేరు రత్న. ఈ హారాన్ని నేను వెంకటాచలం దగ్గర్నుంచి సంపాదించాను. ఇంచుమించు ఉత్తినే!"
    'అంటే --ఎలా?"
    "మగాడు తను చెడు తిరుగుళ్ళు తిరుగుతూ- ఆడదాన్ని వంటింటి కుందేల్ని చేయడం కోసం పవిత్రత అనే పదాన్ని సృష్టించాడు. ఈ మోసాన్ని అర్ధం చేసుకుంటే నేను చెప్పే ఉపాయం చాలా సింపుల్ ...ఒక్క రాత్రి.... వెంకటాచలం తో గడిపితే -- రహస్యం మూడో కంటి వాడికి తెలియదు. నువ్వు కోరిన హారం నీదవుతుంది--" అంది.
    మంజుల ముందు కాస్త ఆవేశపడి రత్నను తిట్టింది కానీ రత్న చలించకుండా -- "నీ మెదడింకా మగాడి ప్రభావానికి మొద్దు బారి వుంది. నువ్వు నన్ను తిట్టడంలో ఆశ్చర్యమేముంది?"అంది.
    "అసలు నువ్వెవరు? నా సంగతి నీకెలా తెలుసు అంది మంజుల.
    "వెంకటాచలం నాకు ఫోన్ చేసి చెప్పాడు-- తన సందేశాన్ని నీకు అందించమని!' అంది రత్న.
    "ఇదే నిజమైతే ఆ షాపు పరువు బయటపెడతాను ....అంది మంజుల కోపంగా.
    "అది నీవల్ల కాదు. వెంకటాచలం తనకేమీ తెలీదని అంటాడు. నేను నీకు మళ్ళీ దొరకను. దొరికినా నిజం ఒప్పుకోను" అంది రత్న.
    "అయినా నా దగ్గర కొచ్చి ఇలా అడగటానికి నీకెంత ధైర్యం?' అంది మంజుల ఇంకా కోపంగానే.
    రత్న నవ్వి -- 'ఇంతవరకూ నేను పది కేసులు పట్టాను. అంతా ముందు నీలాగే కోప్పడ్డారు. కానీ తర్వాత నా మాట విని వేల ఖరీదు చేసే హారాలు దక్కించుకున్నారు. ఒక్కసారి నేను ఫెయిల్ కాలేదు. నీది పదకొండో కేసు" అంది.
    మంజుల వెంటనే ఏమీ మాట్లాడలేక పోయింది. అప్రయత్నంగానే ఆమె ఆలోచనలో పడి మంచి చెడ్డలుబెరీజు వేస్తున్నట్లు కనబడింది.
    రత్న ఆమె మౌనాన్నీ అంగీకారంగా తీసుకుని చెప్పుకు పోసాగింది- "రేపు నీ భర్తకు బెంగుళూర్ నించి టెలిగ్రాం వస్తుంది. అర్జంటుగా వచ్చి వెళ్ళమని. అయన నిన్నిక్కడే వదిలి వెడతాడు. వదిలి వెళ్ళేలా నువ్వు చూసుకోవాలి. రాత్రికి వెంకటాచలం వచ్చి నీతో గడిపి వెడతాడు."
    "నగ యిస్తాడన్న నమ్మకమేమిటి?' అంది మంజుల.
    రత్న విజయసూచాకంగా నవ్వి -- 'అలా అడిగావు బాగుంది" అంది.
    ఆమె తన వానిటీ బ్యాగులోంచి ఓ చిన్న పెట్టి తీసి మంజుల కిచ్చింది. దానికి తాళం కూడా వుంది. ఆ తాళం లేకుంటే అటంబాంబు వేసినా ఆ పెట్టె తెరవబడదట. రేపు మంజుల ఆ పెట్టె తీసుకుని వెంకటాచలం షాపుకు వెళ్ళాలి. తనకు తోచిన నగ ఎన్నుకోవాలి. అది ఈ పెట్టిలో పెట్టుకొని తాళం వెంకటాచలాని కివ్వాలి. రాత్రి హోటల్ గదికి వచ్చినపుడు వెంకటాచలం ఆ తాళం మంజుల కిస్తాడు. ఇందులో మోసమేమీ వుండదు.
    ఏర్పాట్లు పకడ్బందీగానే వున్నాయని పించింది. మంజులకు. ఆమె మనసిప్పుడు మంచి చేడ్డలకు మధ్య  వ్రేలాడుతోంది.

                                    3
    "వెధవ టెలిగ్రాం. నేను వెళ్ళను" అన్నాడు వీరేంద్ర.
    'అలాగంటే ఎలాగండీ - ఆఫీసు పని నిర్లక్ష్యం చేస్తే ఎలా?" అన్నది మంజుల.
    వీళ్ళ సంభాషణ -- టెలిగ్రాం తెచ్చి ఇచ్చిన మేసంజర్  వింటూనే వున్నాడు.
    "మనం పెద్ద ప్రోగ్రాం మీద వచ్చాం. అ పనులకి పూర్తీ కాకుండానే ఎలా వెడతాం?" అన్నాడు వీరేంద్ర.    
    "నేనిక్కడ వుండిపోతాను . పనులు చూసుకుని ఒక్కర్తీనీ వచ్చేస్తాను" అంది మంజుల.
    వీరేంద్ర కాసేపు అందు కిష్టపడలేదు. తర్వాత అతడు అంగీకరించాడు.
    "సార్ -- కాఫీ తెచ్చేదా?" అన్నాడు మెసంజర్, ...
    "కాఫీ వద్దు . బెంగుళూర్ కి టికెట్ కావాలి" అన్నాడు వీరేంద్ర.
    "టికెట్ కి పది రూపాయలు కమిషన్. రిజర్వేషన్ గ్యారంటీ ---" అన్నాడు మెసంజర్.
    కాసేపట్లో వీరేంద్ర ట్రయిన్ ఎక్కి వెళ్ళిపోయాడు. మంజుల తిన్నగా వెంకటాచలం షాపుకి వెళ్ళింది.
    వెంకటాచలం ఆమెను స్వయంగా స్పెషల్ రూమ్ లోకి ఆహ్వానించాడు.
    "నా ఏజెంట్ రత్న మిమ్మల్ని కలిసిందా?" అడిగాడతను ఆతృతగా.
    "కలిసింది. ఈ పెట్టె ఇచ్చింది. నేనిక్కడికి వచ్చాను నగ కోసం--" అంది రత్న.
    నేను కోరితే నీ వళ్ళంతా బంగారంతో నింపేస్తాను ." అన్నాడు వెంకటాచలం.
    "నగ ఒక్కటి చాల్లెండి --" అంది మంజుల ముక్తసరిగా.
    "అన్నింటికీ ఒప్పుకున్నట్లేగా " అన్నాడు వెంకటాచలం.
    అతడి చూపులు మంజులకు నచ్చలేదు. "ఊ" అంది ముక్తసరిగా.
    'అయితే శాంపిల్ చూసేదా?" అన్నాడు వెంకటాచలం.
    "శాంపిల్ అంటే?"
    "అడ్వాన్స్ తీసుకునేదా అని"
    "అడ్వాన్స్ అంటే?" అంది మంజుల.
    "అడ్వాన్స్ అంటేనా?" అని అతడు చటుక్కున ఆమెను కౌగలించుకుని పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.
    ఆమె అతడ్ని అతి కష్టం మీద విడిపించుకుని "ఇదేమిటి?" అంది.
    "శాంపిల్ అన్నా, అడ్వాన్స్ అన్నా ఇదే!" అన్నాడు వెంకటాచలం-- "చాలా బాగుంది" అని కూడా అన్నాడు మళ్ళీ.
    "ఎవరయినా చూస్తె ?" అంది మంజుల.
    "ఈ గదిలోకి నా అనుమతి లేనిదే గాలి కూడా ప్రవేశించదు. నీకేం భయం లేదు" అన్నాడు వెంకటాచలం. చనువుగా మరోసారి ఆమెను దగ్గరగా తీసుకుంటూ.

 Previous Page Next Page