Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 7


    " నీ ఫిలాసఫీ నాకు తెలుసుకానీ ఈ వారం ఎక్కడికెళ్ళావ్? ఊటీయా? కొడైకెనలా? ఆ రాంబాబు కూడా కనిపించలేదు..... ఆ రాంబాబును తీసుకుని వెళ్ళిపోయావ్ అవునా?"


    
    "అవును! కొడైకెనాల్ చూడాలనిపించింది. వాడి దగ్గర డబ్బుంది. నా దగ్గర అందం వుంది. నీ దగ్గర నాకోసం ఖర్చుపెట్టగలిగే డబ్బుంటే రా...... ఎంజాయ్ చేద్దాం అన్నాను. తను ఎగిరి గంతేశాడు. ఆ మరుక్షణం నుంచి నిన్నటి సాయంత్రం వరకు ఆనందపు అంచుల్ని చవిచూశాం. నిన్నటి వారాన్నీ, నిన్నటి యవ్వనాన్నీ, కోరికలనీ, ఆశలనీ ఈరోజు తీర్చుకొగలమా? ఒకరోజు చచ్చిపొతేగాని మరొకరోజు మన చేతుల్లోకి రాదు. ఏ రోజునీ వృధాగా చంపుకోవటం నాకిష్టం వుండదు"  నవ్వుతూ అంది సుష్మ.

 

    'అయ్యబాబోయ్!' ఇంత డేరింగ్ గా సుష్మ వ్యక్తం చేసిన ఒపీనియన్ కి ఆశ్చర్యపోయాడు మధు.

 

    "ఇతనెవరు?" మధువైపు చూస్తూ అడిగిందామె. చెప్పి పరిచయం చేశాడు రవి.

 

    "పెదపాడు అంటే ఎకరం మూసు లక్షలుండదూ? ఎన్ని ఎకరాలుందేమిటి......?" చేపల గాలం వేస్తున్నట్టుగా మధుకేసి చూస్తూ అడిగింది సుష్మ.

 

    "ఆ ఎకరాల గోలేంటి?' అడిగాడు గుండు.

 

    "పది ఎకరాలున్నా చాలు" అంది నవ్వుతూ సుష్మ.

 

    ఆమె అన్నదేమిటో అక్కడున్న సగం మందికి అర్థం కాలేదు.

 

    స్వేచ్ఛకీ, సరదాలకీ, సంతోషానికీ, ఆనందానికి అర్థాలు చెప్పేందుకు అందుబాటులో వున్న శృంగార దేవతలా వుంది సుష్మ.

 

    "ఇక్కడున్న వాళ్ళలో 90 శాంత మందికి నా జీవన విశానం అర్థమయినట్లు లేదు..... కదా?" గలగలా నవ్వుతూ అందామె.

 

    అవునన్నట్లుగా, వెర్రివాళ్ళలా తలలూపారూ వాళ్ళు.

 

     "ఎవరో ఒకరు ఇక్కడున్న అందరికీ సమోసాలు, టీలు తెప్పిస్తే ఆధునిక వైద్యరంగంలో సెక్స్, ప్రేమ, అనుబంధం, స్నేహం మీద ఈ మధ్యనే చోటు చేసుకున్న కొత్త నిజాల్ని మీ ముందుంచుతాను....." అంది సుష్మా ఫ్రాంక్లిన్ రాజనీష్ శిష్యురాలిలా.

 

    క్షణాల్లో ఆ ఏర్పాట్లు జరిగిపోయాయి.

 

    సమోసాని నాజూగ్గా కొరుకుతూ చెప్పటం ప్రారంభించింది సుష్మా ఫ్రాంక్లిన్.

 

    "సెక్స్ అనేది కేవలం స్త్రీ, పురుషుల శారీక కలయికే కాదు -  దానికి అంతకుమించిన ప్రయోజనం చాలావుంది. సెక్స్ కి ఎలాంటి బాధనయినా తగ్గించే గుణం వుంది. ఇది చాలామందికి తెలియదు. సెక్స్ ని మించిన వ్యాయామం మరొకటి లేదు.

 

    సెక్స్ లో  పాల్గొంటే వత్తిడులు చేత్తో తీసేసినట్లు తగ్గుతాయి. సెక్స్ జీవితం మనిషి ఆయుర్ధయాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా వుంచుతుంది. శారీరానికి రక్తప్రసరణ, ఆక్సిజన్ సప్లై అవసరం. ఇది జరిగేలా చూస్తుంది. దీనివల్ల మనిషెప్పుడూ చురుగ్గా, చలాకీగా వుంటాడు సెక్స్ అనేది కేవలం స్త్రీ, పురుషుల శారీరక కలయిక అని చాలామంది భావన.

 

    అంతకు మించిన ఎన్నోరకాల అర్థాలూ, పరమార్థాలూ, లాభాలు వున్నాయని సెక్స్ కెమిస్ట్రీని అధ్యయనం చేసినవారు చెబుతున్నారు. సెక్స్  పరమైన కోరికలు తీరనివాళ్లు రొటీన్ పనిని రొటీన్ గా మాత్రమే చేయగలరట. వారిలో క్రియేటివిటీ దాదాపుగా నశించిపోతుందని, సుదీర్ఘమైన, సునిశితమైన పరిశోధనల ద్వారా రుజువయింది. 'గ్రేట్ క్రియేటర్స్' జీవన విధానాల్ని పరిశీలిస్తే ఇదే మనకు అర్థమవుతుంది.

 

    సెక్స్ లో భాగమైన స్పర్శ, ముద్దు, శారీరక కలయిక, భావప్రాప్తి వంటి ప్రతిదాని వెనుకా శరీరంలో తయారయ్యే రసాయనాల స్పందన వుంటుంది. ఇండియాలో సెక్స్ సైన్స్ ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టకపోవటం అన్యాయం! అసలు అవతలి వారిని తాకకుండానే సెక్స్ కోరిక కలగటం కూడా కొందరిలో కనిపిస్తుంది.

 

    యవ్వనంలో కలిగే ఈ భావనలు సెక్స్ రసాయనంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయని మేధావుల పరిశోధనలలో రుజువైంది. ప్రేమ అనేది మానసికపరమైన స్పందనే కాదు, దాని వెనుక రసాయనాల ఉత్పత్తి ప్రవాహం వుంటుంది!

 

    ప్రేమించిన వ్యక్తిని మనసులో తలుచుకున్నా-

 

    వారి మాట వినిపించినా, కళ్ళ ఎదురుగా కనిపించినా-

 

    శరీరం ఒక రకమైన మధురానుభూతిని పొందుతుంది.

 

    ఆ అనుభూతి అందరూ పొందినా, శరీరంలో వచ్చే మార్పు మాత్రం తెలియదు...... అది ఎవరిలోకి వారు తొంగిచూసుకొంటేనే అవగతమవుతుంది.

 

    ప్రేమభావం కలిగినప్పుడల్లామెదడులో ఫీనైల్ థయాలామిన్ అనే రసాయనం విడుదలవుతుంది.

 

    ప్రేమించిన వ్యక్తి దగ్గరై కలిసి జీవించటం మొదలుపెట్టగానే, ఆ రసాయన ప్రభావానికి క్రమంగా శరీరం అలవాటు పడుతుంది. క్రమం శరీరం ఉద్వేగానికి లోనుకావటం తగ్గిపోతుందట. ప్రేమ తగ్గినా, ప్రేమ విరిగిపొయినా మనసులు దూరమవుతాయి. ప్రేమ స్పందనలు తగ్గగానే, ఆ రసాయన ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. రసాయన ఉత్పత్తి పడిపోవడంతో వచ్చిన ఇబ్బందులు శరీరాన్ని చాలా నష్టానికి గురిచేస్తాయి.

 

    ప్రేమ వైఫల్యానికి గురయినవారూ, విడాకులు తీసుకున్న వారూ, విభేదాలతో కాపురాలు చేసే భార్యాభర్తలలో మానసిక ఇబ్బందులు ఏర్పడటానికి కారణం - మెదడులో విడుదలయ్యే రసాయనాలలో వచ్చే తేడానే!

 

    విచిత్రంగా లేదూ.....? ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికే నేను రోజూ సెక్స్ లో పాల్గొంటాను.

 

    ప్రేమికులు ఒకరినొకరు తాకాలనే ప్రయత్నం చేస్తారు. చేతివేళ్ళు తాకగానే తొలిప్రేమ చక్కని థ్రిల్ నందిస్తుంది. ఆ థ్రిల్ లేని జీవితం వృధా కాదా? ఇదెప్పుడూ మీరాలోచించారా.....?

 

    స్త్రీ, పురుషుల స్పర్శవల్ల శరీరంలో నాడులు స్పందిస్తాయి. ఆ స్పందనకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ అనుబంధాన్ని పెంచే హార్మోన్ గా రుజువైంది.

 

    ఆ హార్మోన్ ఉత్పత్తి పెరిగినకొద్దీ స్త్రీ, పురుషుల్లో దగ్గరవ్వాలనే కోరిక మరింత పెరుగుతుంది. దూరంగా కూర్చుని చేయి చేయి తగిలించుకున్న ప్రేమికులు క్రమంగా ఒకరి నొకరు  శరీరాలు తగిలేంత దగ్గరగా జరగటం, పార్కుల్లో, ఇతర ఏకాంత ప్రదేశాలలో తరచూ జరుగుతుంటుంది.

 

    ఈ హార్మోన్ ప్రభావమే భార్యాభర్తలను దగ్గరకు చేరుస్తుంది. స్పర్శ కోరిక మగవారిలో కన్నా ఆడవారిలోనే అధికంగా వుంటుంది. అయితే దాన్ని వాళ్ళు బయటకు వ్యక్తం చేయరు. అందుకే భార్యలు భర్త కౌగిలిలో కరిగిపోవాలనుకుంటారు. ఎంత కోపంతో వున్న భార్యనైనా భర్త తాకితే మామూలు స్థితికి వచ్చేస్తుంది భార్య. అది కేవలం భార్యా, భర్తల్లోనే కాదు. మనలాంటి స్టూడెంట్స్ మధ్య కూడా సంభవిస్తుంది. అదే సృష్టి రహస్యం.

 

    దీనికి కారణం బంధాన్ని పెంచే గుణంగల ఆక్సిటోసిన్ అనే ఈ హార్మోన్ స్త్రీల సెక్స్ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లో కలిసి ప్రభావం చూపటమే. అయితే మగవారిలో సెక్స్ హార్మోన్ - ప్రోజిస్టరోన్ ప్రభావం వేరే విధంగా వుంటుంది.మీకివన్నీ వింతగా అనిపిస్తున్నాయి కదా..........! నమ్మశక్యంగా లేవు కదా.....? ఈ ఏలూరు లో కూర్చుని మీరు నమ్మినా, నమ్మకపోయినా , ప్రపంచ ప్రసిద్ధి పరిశోధనాలయాల్లో పుట్టుకొచ్చే కొత్త నిజాల్ని మనం తోసివేయలేం కదా.....?

 

    సెక్స్ పాల్గొనేటప్పుడు స్త్రీ పురుషులు పెదవులు కలపటమే కాదు- పాదాలను కలుపుకోని రాపిడి సృష్టిస్తుంటారు. నిజానికి పాదాలను తాకించటం అనేది సెక్స్ లో ఎందుకు భాగమయిందో ఇటీవల కాలం వరకు ఎవరికీ తెలియదు. ఈ పాదాలను తాకటం కూడా ఆక్సిటోసిన్ ప్రభావంతోనే.

 

    శరీరంలోని కొన్ని భాగాలను తాకటం మరింత ఆనందాన్నిస్తుంది. స్త్రీ తన శరీరంలోని కొన్ని భాగాలను మృదువుగా తాకేందుకు పురుషున్ని ప్రోత్సహిస్తుంది. అలా తాకిన సమయంలో అంతులేని అనుభూతి పొందుతుంది స్త్రీ. ఎవరో పరిశోధకులు పరిశోధించి చెప్పారని కాదు - నా విషయంలో అదే రుజువయింది. అవుతూనే వుంది.

 

    స్త్రీ పురుషులిరువురూ సెక్స్ సమయంలో అత్యధికంగా కోరుకునేది స్పర్శ ప్రాంతం. పెదవులు - పెదవులు రెండూ ఒకటయితే ఏర్పడే తీపి ముద్దు కేవలం స్పర్శ కోసమే కాదు -  శరీరం వాసనను ఒకరి నుంచి మరొకరు గ్రహించడానికి కూడా. ఇతర జీవుల లాగానే మనుషులలో వాసన ప్రధానమైన ఆకర్షణ అవుతుంది. ముఖ చర్మంలో వుండే ప్రత్యేక గ్రంథులు స్రవించే ఆ వాసన, స్త్రీ పురుషులను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. ముద్దు పెటుకునే సమయంలో తమకు తెలీకుండానే కళ్ళు మూసుకోవడం కాదది, అదొక తన్మయత్వం. మన మెదడు గ్రహించే అంశాలలో అధికశాతం కంటి ద్వారానే.

 

    ముద్దు పెట్టుకునే సమయంలో కళ్ళు తెరిచి వుంటే దాని దృష్టి అటూ ఇటూ పడి ఆ సమాచారం మెదడుకు చేరుతూ, చేస్తున్న పనిమీద దృష్టి తగ్గే ప్రమాదం వుంది. సెక్స్ లో మరే ఇతర అంశం మీదకీ మనసు పోవడం ఇష్టం వుండదు. అందుకే దృష్టి నాడులను ఆపివేసి, స్పర్శ, ఘ్రాణ నాడులను మాత్రం విశేషంగా పనిచేయించేందుకే కళ్ళు మూసుకుంటారు. ముద్దులో మూసుకున్న కళ్ళలో వుండే తన్మయత్వం వర్ణించడం ఎవరివల్లా సాధ్యం కాదు.

 

    ఏ ప్రాంతంలో సెక్స్ స్పర్శ తగిలినా ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఆక్సిటోసిన్ విడుదల ఆగేంతవరకు ఒకరి కౌగిలి నుంచి మరొకరు విడిపోయేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. ఏదైనా కారణంవల్ల విడిపోవాల్సి వచ్చినా, బలవంతంగా విడదీసినా, వారి శరీరం కంపించిపోతుంది. ఒక్కసారిగా కోపం తన్నుకొస్తుంది- చిరాకు కూడా చోటుచేసుకుంటుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల శారీరకంగా మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. భౌతికావసరాలైన ఆకలి, సెక్స్, మానసిక స్పందన , భయం, దూకుడుతనానికి సబంధించిన కేంద్రాలన్నీ మెదడులో ఒకేచోట కేంద్రీకృతం అయివుంటాయి" సుష్మ చెప్పటం కొద్దిక్షణాలు ఆపింది.

 

    గతం తాలూకు అనుభూతులు ఉప్పెనలా ఆమెను కమ్మేశాయేమో ఆమె కన్నులు అరమోడ్పులయ్యాయి.

 

    అక్కడ గుమిగూడిన స్టూడెంట్స్ అంతా స్థాణువులైపోయి వింటున్నారు.

 

    ఒక మనిషి జీవితాన్ని స్పర్శ, సెక్స్ ఎంత ప్రభావితంచేస్తాయోనన్న దిగ్భ్రాంతితో మునిగిపోయారు. కొద్దిక్షణాలలో తేరుకున్న సుష్మ తిరిగి చెప్పటం ప్రారంభించింది.

 

    "ఒంటరిగా వున్నప్పుడు కలిగే భయం, హఠాత్తుగా మోగే టెలిఫోన్ వల్ల కలిగే దడ స్త్రీలను వత్తిడికి గురిచేస్తుంది. అయితే ఆ భయం, దడ వారి మెదడులో ఉత్పత్తి చేసే రసాయనాలే వారిలో  సెక్స్  కోర్కెలనూ పెంచుతాయి. భయం, ఆదుర్దాతో వున్న మగువలు భర్త రాకకోసం ఎదురు చూస్తారు. భర్త రాగానే అతన్ని గట్టిగా కౌగిలించుకుంటారు. వారి  ఎడమీద తలపెట్టి భద్రతా భావం పొందేవరకు తృప్తిపడరు. అలా భార్య ప్రవర్తించడం భర్తలో సెక్స్ స్పందన కలిగిస్తుంది. ఆ విధంగా ఇద్దరూ సెక్స్ లో పాల్గొంటారు. ఆ సెక్స్ లో పొందిన ఆనందం మగువలోని మానసికపరమైనటువంటి ఆదుర్దాలు, వత్తిడిని పొగిడితే బయట పనులతో శారీరకంగా అలసిపోయిన భర్తకి ఎంతో విశ్రాంతినిస్తుంది.

 

    సెక్స్ కి బాధను తగ్గించే గుణం వుంది. ఆనందం ఏదైనా బాధనుంచే పడుతుంది. ఆనందం అనుభవించాలంటే బాధ తప్పదు. అదృష్ట దేవత సొంతం కావాలంటే రిస్క్ చేయక తప్పనట్లే ఇదీను. సెక్స్ లో పాల్గొన్నప్పుడు అటూ ఇటూ దొర్లినా, ఒకరి బరువును మరొకరు మోస్తున్నా ఎటువంటి బాధ అనిపించకపోగా ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంతవరకు మీలో ఎవరికైనా అనుభవం దక్కిందా.....?

 

    ఆ సమయంలో స్త్రీలకు ఎక్కడలేని శక్తి వస్తుందని కొందరు చెబుతారు. కానీ నిజానికి ఆ సమయంలో వారికి కొత్త శక్తి ఎమీరాదు. కానీ బాధను కలిగించే రసాయనాలను నిరోధిస్తుంది శరీరం. శరీరానికి కలిగే బాధను మెదడుకు తెలియజెప్పేది ఒక రసాయన పదార్ధం. ఆ రసాయన పదార్ధ ప్రభావాన్ని నిరోధించే శక్తి స్త్రీ జననాంగం దగ్గర కలిగే స్పందనలకుంటుంది. సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు ఆ భాగం ఉత్తేజమవడంతో బాధ ఏమాత్రం తెలియని స్థితిలో స్త్రీ శరీరం వుంటుంది. ఎంతగొప్ప శారీరక నిర్మాణమో చూడండి. ఈ మానవ శరీర నిర్మాణానికి ఎవరు కారకులైనా, ఏది హేతువైనా ఆ కారకులనీ, హేతువుల్నీ మర్చిపోగలమా? మర్చిపోవచ్చా?

 Previous Page Next Page