అంతే ప్రొఫెసర్ కూతురికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఇదంతా మా ప్రొఫెసర్ కి తెలిసిందో లేదోగానీ గౌతమ్ మాత్రం ఆ పేపర్ ను మూడుసార్లు రాసినా ఫెయిలవుతూనే ఉన్నాడు. అదంతా గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. టింకూ, పిన్ని అంటే చాలా బోలెడంత ఇష్టమున్నా నేను అలా అననులెండి" అన్నాడు ఆదిత్య.
నేను ఏమీ మాట్లాడకుండా కిందకు వచ్చేశాను.
ఆ మరుసటిరోజు డాబా మీదకు వెళ్ళలేదు.
రెండోరోజు, మూడోరోజు కూడా నేను డాబా మీదకు వెళ్ళలేదు. సిగ్గో, బెదురో తెలియదుగానీ ఆదిత్య ఎదురుపడడం నాకు ఇష్టం లేకపోయింది.
నాలుగోరోజు సాయంకాలం యధాప్రకారం వీధి వరండాలో కూర్చుని టింకూని ఆడిస్తున్నాను.
ఆరోజు మా బావ ఊర్లోలేడు.
అక్కయ్య లోపల వంటపనిలో వుంది.
వరండా లైటు వేయాలనిపించినా బద్ధకం వల్ల లేవలేకపోయాను. భజన పక్కింటి దగ్గరికొచ్చి ఆగడంతో ఇక తప్పదని పైకి లేచాను.
ప్రతి శనివారం ఇలా ఊర్లో ప్రతి ఇంటికి భజనొస్తుంది. ఓ పదిమంది కుర్రాళ్ళు వీధిలో నిలబడి భజన చేస్తుంటారు. భజన ముందు గెరడు గొమ్ము పట్టుకుని ఓ వ్యక్తి వుంటాడు. గెరడు గొమ్మంటే పెద్ద దీపపు స్తంభం అన్నమాట. ఈ గెరడుగొమ్ము ఎత్తుకున్న వ్యక్తి ప్రతి ఇంటి వరండాలోకి వచ్చి నిలబడతాడు. అతనితోపాటు మరో వ్యక్తి పెద్ద ప్లాస్టిక్ టిన్ ఎత్తుకు వస్తాడు. ప్రతి ఇల్లాలూ కాస్తంత నూనెను ఆ టిన్ లో పోయాలి. ఈ నూనెతో గుడిలో దీపారాధన జరుగుతుందన్న మాట. ప్రతి శనివారం సాయంకాలం ఇలా భజన తప్పనిసరి.
నేను ఇంట్లోకి వెళ్ళి చెంబుతో నీళ్ళు, మరో చేతిలో నూనెగిన్నె పట్టుకొచ్చి వరండాలో నిలుచున్నాను. భజన చేసేవాళ్ళు వీధిలో నిలబడిపోగా గెరడుగొమ్ము పట్టుకున్న ఒకరూ, నూనె టిన్ పట్టుకున్న ఓ చిన్ని కుర్రాడు వరండా ముందుకొచ్చారు. ప్రహరీ గోడవల్ల భజన చేస్తున్న వాళ్ళు కనిపించడం లేదు.
గెరడుగొమ్ము పట్టుకున్న వ్యక్తిని చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
అతను ఆదిత్య ఇక తప్పుకోవడం కుదరదు కాబట్టి ఎలానో తమాయించుకుని చెంబులో నీళ్ళు పోశాను. దానిపై అతను గెరడు గొమ్ము పెట్టాడు.
నేను అందులో కొంత నూనెపోసి, మిగిలిన దానిని పక్కనున్న చిన్న కుర్రాడు పట్టుకున్న టిన్ లో పోశాను. గెరడుగొమ్ము పక్కనున్న కుంకుమను చేతితో తీసుకుంటూ వుండగా ఆదిత్య మెల్లగా చెప్పాడు.
"ఏమైపోయావు మూడురోజులుగా? డాబామీద చూసిచూసి విసిగి పోయాను. ఇక నిన్ను ఎలా చూడాలో నాకర్ధం కాలేదు. ఇంతకు ముందు అలా భజన మందిరం దగ్గరికి వెళితే ఈ ఐడియా వచ్చింది. గెరడు గొమ్ము ఎత్తుకుంటే మీ ఇంటి లోపలికి వచ్చే ఛాన్స్ దొరుకుతుందనిపించి ఎప్పుడూ ఇలా గెరడుగొమ్ము మోయని నేను నిన్ను చూడటానికి ఎత్తుకున్నాను. దీన్ని మోస్తుంటే చేతులు విపరీతంగా నొప్పెడుతున్నాయి కానీ నీ కోసం భరించాను. రేపు సాయంకాలం డాబా మీదకి వచ్చేయ్."
నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. రహస్య సమాచారాలు అందుకోవడం ఇప్పుడే ప్రారంభం చెంబు తీసుకుని లోపలికి పరుగెత్తాను.
ఆదిత్య కూడా మరో ఇంటికి బయల్దేరాడు.
ఆ రాత్రి నిద్రపోయుంటే ఒట్టు. జాకెట్టు లోపల బ్రా వుండడం చికాగ్గా అనిపిస్తోంది. లంగా అనీజీ ఫీలింగ్ ని తెప్పిస్తోంది. అవయవాలు అన్ని మార్పులకు గురవుతాయా అని నాకు నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఏదో తీయటి బాధ మనసును కోస్తోంది.
ఎప్పుడూ నీటిచెలమలా వుండే బొడ్డుకూడా అగ్నిగుండంలా తోస్తోంది. ఎద ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ తో ముడుచుకుపోయినట్లుండే ఎదమీది చివర్లు సైతం పోట్లగిత్తల కొమ్ములా పొటమరించాయి. మరి ఇలాంటప్పుడు నిద్రొస్తుందా?
మరుసటిరోజు డాబామీదికి వెళ్ళడమా? మానడమా? అన్న ఆలోచనలతోనే సాయంకాలం వచ్చేసింది. అయిదు గంటలకే చిన్నపిల్లలంతా వరండాలో టీవీలో వచ్చే సినిమాను చూడడానికి తయారైపోయారు. ఐదున్నారకి సినిమా మొదలైంది చుట్టుపక్కల ఆడవాళ్ళతో హాలంతా నిండిపోయింది. అక్కయ్యకూడా సినిమాలో లీనమై పోయింది.
నాకొక్క దానికే సినిమా పట్టడం లేదు. ఏవో బొమ్మలు ఆడుతున్నాయి తప్ప సినిమా జరుగుతున్నట్లు లేదు. ఆదిత్య డాబా మీద నాకోసం వెయిట్ చేస్తున్న దృశ్యమే కళ్ళ రెటీనా మీద సాగుతోంది.
ఇప్పుడైతే ఎవరూ నన్ను పట్టించుకోరని అనిపించడంతో ఇక అక్కడ వుండలేకపోయాను.
మెల్లగా లేచి, డాబా మెట్లెక్కాను.
అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్న ఆదిత్య కనిపించాడు. నేను అతన్ని చూసీ చూడనట్లు- ఎండకు ఆరబెట్టిన బట్టల్ని తీసుకుంటున్నాను. వీధుల్లో చడీ చప్పుడు లేదు. అందరూ టీవీల ముందు కూర్చుండిపోవడంతో కర్ఫ్యూ విధించినట్లుంది.
"గుడ్ ఈవెనింగ్"
ఆదిత్య పిట్టగోడ దగ్గర నిలబడి విష్ చేస్తున్నాడు.
నేను అతనివైపు తిరిగి చిరునవ్వు నవ్వాను.
"మాట ప్రకారం పైకి వచ్చినందుకు థాంక్స్"
ఈసారి నవ్వి వూరుకున్నాను.
ఏమనుకున్నాడో ఏమోగానీ ఒక్కసారిగా పిట్టగోడనెక్కి ఇవతలికి దూకాడు. కిందకు వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నా కాళ్ళు రావడం లేదు.
నా ముందర నిలబడ్డాడు.
అతని శ్వాస నా ముఖం మీద పరుచుకుంటోంది.
"నీ పేరు ఇదిగో" అని అరచెయ్యి చాచాడు. ప్రియ అన్న రెండక్షరాలు ఎర్రగా కనిపిస్తున్నాయి.
"గోరింటాకు పెట్టుకున్నాను"
ఏదో మాట్లాడాలనుంది గానీ అర్ధం కాని బెరుకు గొంతుకు అడ్డం పడుతోంది.
"ఇదిగో ఇటు చూడు" అని ఎడమచేయి చూపించాడు. అరచేతిలో గోరింటాకుతో పెట్టుకున్న "ఐ లవ్ యు" అన్న అక్షరాలు కనిపిస్తున్నాయి.
మొదటిసారి నేనో ఆడపిల్లలనన్న ఫీలింగ్ కలిగింది. ఆ మసక చీకట్లో కూడా అతని ముఖం వెలిగిపోతోంది.
"రెడీగా పూలదండ లేదుగానీ, లేకపోతే నీ మెడలో వేసేద్డును" అని, అటూ ఇటూ చూసి పూలపూల చీరను చేతుల్లోకి తీసుకుని నామెడ చుట్టూ వేశాడు.
అప్పుడు అతని కొసవేళ్ళు వీపులో జాకెట్టులేని చోట కదిలాయి. ఆకాశంలోంచి సన్నజాజుల వాన నా వీపుమీద కురుస్తున్నట్లనిపించింది. జాకెట్ వెనక భాగాన్ని మరింత తగ్గించి వుంటే అతని వేళ్ళు మరికాస్త బలంగా తగిలి వుండేవిగా అనిపించింది.