"వూ" అన్నాడు. అది ముగిసింది. చంద్రోదయం వెంటే చంద్రికాధవళిమాలతదనంతరం భోజనము అయింది. వెన్నెల వేళ మలయమారుతంలాగా 'మృగందం' తో కూడిన తాంబూల సేవనం.
ఆలోచిస్తూ పడుకున్నాడు.
ఆలోచనలు కొండెక్కాయి. పాలమిగడ లాటి తెల్లటి జరి చీరలో గగనంగణంలో విరసిన పారిజాత సుమంలా కోర్కెల హరివిల్లు- ఇల్లాలు- ఎదుట ప్రత్యక్షమై నిలిచింది.
దీపం కొండెక్కింది.
ఒకటి, రెండు మూడు వారం రోజులు......
మళ్ళీ శుక్రవారం వచ్చింది. జ్ఞాపకాలు- మధుమాలికలు- కాళ్ళు ప్రిన్సిపాల్ గదివైపు నడిచాయి. ఆయన క్లాసుకి వెళ్ళుతున్నాడు.
"ఫోనోస్తుందా?' అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు.
మనస్సులో తహ తహ వారం రోజులు ఎదురుచూసిన విరహం ఏడు రోజుల నాడు సంగీతం సరమేళలా వినిపించిన పదబంభరాలు- వినుల్లో ధ్వనిస్తూ వలపు వీధుల్లో నినదిస్తూ గుండెల్లో ప్రతిధనిస్తు- మనస్సు నినదిస్తూ- తల విదిల్చుకున్నాడు. అంతా కలలా ఉంది.
ఎవరా అమ్మాయి?
తనని క్షుణ్ణంగా చదివినట్టు- తన సిరలల్లో ధమనుల్లో ప్రవహించే వలపు ప్రవహాలని పరీక్షించినట్టు ఎంత చక్కగా మాట్లాడింది.
కలలో కనిపిస్తే అదో తరహ- ఇలలో ఎక్కడో తారస పడితే అదో విధం. ఇదలా కాదే! గుండె ఝల్లుమనేట్టు, కళ్ళు కలువలై పూచేట్టు, వలపు సేలయేరులై ప్రవహించెట్టు ఎన్నడూ ఎరుగని ఈ వింత అనుభూతి! ఏమిటిది? ఇన్నేళ్ళ జీవితంలో ఏనాడూ ఎరుగని కొత్త అనుభవం.
ఫోన్ రింగయ్యింది. చప్పున తీశాడు. గుండె దడదడ మంటోంది.
"హలో!
"హలో! ఎవరు మీరు? ప్రిన్సిపాల్ లేరా?" దర్పణ, అధికారం ఠీవి ప్రకటించే గొంతు. "లేరండి క్లాస్ కి వెళ్ళారు. మీరెవరు?" మెల్లిగా ప్రశ్నించాడు.
"వన్టవున్ పోలిస్ స్టేషన్ , నేను పి.సి. ని ప్రిన్సిపాల్ గారూ రాగానే రింగ్ చేయండి. ఎస్.పి గారు మాట్లాడతారట."
"అలాగే!" నీరసంగా ఫోన్ పెట్ట్టేశాడు ఆచార్య.
క్షణాలు సేకనులై, సెకనులు నిమిషాలై నిమిషాలు గంటలై, గంటలు రోజులై, రోజులు మాసాలై, మాసాలు సంవత్సరాలై , సంవత్సరాలు శతాబ్దాలై శతాబ్దాలు యుగాలైపోతాయి. కానీ ఇదేమిటి ఇలా క్షణాలే యుగాలవుతున్నాయి- ఏనాడూ ఎగురని అనుభవం ఫోన్ రింగయింది.
అతని కళ్ళలో ఆశ మెరిసింది. అంతలో నిరాశ, నీరసంగా తీశాడు.
"హలో!" వుసర క్షేత్రం పై తొలకరిచినుకు! అదే స్వరం.....అదే తీయదనం......
"హలో!" ఉత్సాహం ఉరకలు వేసింది.
"వారం వారం వందన మస్తుతే!"
"ఎంతటి చమత్కారం' అనుకున్నాడు.
"బావున్నారా! విహాయస వీధుల్లో ఎగురుతున్నట్టున్నారు అవునా! కృష్ణశాస్త్రి గుర్తుకోస్తున్నారా?నాకు గాదులు లేవు. నా కుషస్సులు లేవు."
"మీకు తెలుగు ఎంత బాగా పరిచయం?"
"కొట్టిన పిండి - ఎలా నంటారా? సావాస దోషం- అవును- అక్కడ 'దోషం' అన్నాడేమిటి మళ్ళీ సుగునోభవంతి అంటారు."
"మీరోసారి లిటరేచరే క్లాసు తీసుకోండి."
"చెబుతారా? వింటారా?"
"చెప్పటమా! వింటేనే హాయిగా ఉంటుంది. "ఫక్కుమని నవ్విన శబ్దం పాలసంద్రం పై మీగడ తారకలు కదలాడినట్టు, మార్ధంగి కుని చేయి మృదంగం పై అలా అలా అలోవోకగా కదలినట్టు........
"మీరు బాగా నవుతారు."
"మీ కాంప్లిమెంట్ కి థాంక్స్. నేను బాగా నవుతాను. మాస్టారు నేనూ బావుంటాను- అట. నేను నవుతూ ఉంటే నా పలువరుస చాలా అందంగా కనిపిస్తుందని రజని అంటారు. కొందరు కొన్ని భంగిమల్లో బావుంటారుట! అలానే నేను నవుతూ ఉంటే......"
"మీ రజని ధన్యుడు."
"థాంక్స్. రజని అంటే ఏమనుకున్నారు? వెన్నెల దొర- వలపు వసంతాల రేడు. రాగరక్తి మా మూర్తిభవించిన వాడు. " ఆచార్య ఏమి అనలేదు.
"మీకు నన్ను చూడాలనిపిస్తోందా!"
"వూ మీరెక్కడ నుంచి మాటడుతున్నారు?"
"భూమ్మిధనుంచే. అంతరిక్షం నుంచి కాదు"
"మీ ఫోన్ నెంబరు....."
"బావుంది. నవలలు చదివి మీకు ఆడపిల్లల ఫోన్ నంబరు కనుక్కోవాలని ఆరాటంగా ఉందా?"
"సారీ"
"ఏమండీ. మీరు చదివిన చదువుకి, చేస్తున్న ఉద్యోగానికి, మాటాడే తీరుకి పొంతయున లేదే. సాస్థాన వేష భాషా భినుతులుగా ఉండాలి కదా- మీకు గుర్తులేదా?"
"మీరు రసలుబ్దులు."
"బ్రతికించారు. లబ్దులు అన్లేదు."
"మీ పేరు చెప్పనేలేదు."
"ఇంకో క్లూ ఇవనా? దేశంలో నా పేరులోని ఒక అక్షరం ఉంది. ఇంకోమారు ఇంకో క్లూ."
"పోనీ , మిమ్మల్ని చూడాలంటే....." చప్పున జవాబివలేదు.
"ఏం? మీ శ్రీమతి రారా! మీరు తీసుకురారా?"
"అదేం కాదు"
"మీ ఆవిడ పేరు చెబుతారా?"