Previous Page Next Page 
చిలకలు పేజి 33


    "ఏమంటున్నాడు?" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "వెళ్తున్నాంగా? మాట్లాడదాం" ముభావంగా అన్నాడు నరేంద్ర.
    కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నరేంద్ర  ముఖంలోకి చూసి ఏదో అడగబోయి ఆగిపోయాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయతం.
    కాఫీ తాగడం పూర్తిచేసి "వెళదామా?" అంటూ లేచాడు నరేంద్ర,
    "శంకర్రావు వస్తే కూర్చోమని చెప్పు" అని హెడ్ కాని స్టేబుల్ ఏడుకొండలకు చెప్పి "నువ్వు  జీ ఎక్కు" అన్నాడు యాదరిగితో ఇన్స్ స్పెక్టర్.
                                     17
    సాయంత్రం ఏడు గంటలకు ఇంకా ఐదు నిముషాలుంది. మే నెల కావడంవల్ల ఇంకా చీకటి పడలేదు.
    డిటెక్టివ్ నరేంద్ర, ఇన్స్ స్పెక్టర్ అద్వయితం హిమాయత్  నగర్ లో రమణరావు ఇంటి ముందు నిలబడి ఉన్నారు.
    కానిస్టేబుల్ యాదగిరి గబగబా తలుపులు కొడ్తున్నాడు.
    నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నావాడు ఒకడు తలుపు తీశాడు. అతడి రూపం చూస్తే ఆ ఇంటి నౌకరని ఇట్టే అర్థం అయిపోతుంది.
    "ఎవరు కావాలి?" అని ఎదురుగా ఉన్నది పోలీసువాళ్ళని తట్టగానే పక్కకు తప్పుకుని. లోపలకు వెళ్లమని దారి ఇచ్చాడు నౌకరు.
    నౌకరు వెనకే ఇద్దరూ డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చున్నాడు.
    "మీ అయ్యగార్ని పిలువు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "స్నానం చేస్తున్నారు. అయిపోయిందనుకుంటాను. ఇప్పుడేనస్తారు"
    "నీ పేరేమిటి?"
    "నా పేరా బాబయ్య?"
    "నీ పేరు కాక నా పేరు చెప్పమని నిన్ను అడిగానా?" చురచురచూస్తూ అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "ప్తెడయ్య" అని చెప్పి  "అయ్యగారికి చెప్తాను" అంటూ లోపలకు వెళ్ళాడు.
    బల్లమీద పడి ఉన్న సినిమా పత్రికలు తిరగెయ్య సాగాడు ఇన్స్ స్పెక్టర్.
    సిగరెట్ తాగుతూ నరేంద్ర గోడలకు తగిలించి ఉన్న సినిమా తారల ఫోటోల చూస్తున్నాడు.
    ఐదు నిమిషాలు గడిచాయి.
    గోడ గడియారం చేస్తున్న "టిక్! టిక్!" శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
    "నమస్కారమండి."
    ఇద్దరి కళ్ళూ రమణరావు కేసి తిరిగాయి.
    అతడు స్నానం చసి లుంగీ కట్టుకుని, తెల్లటిషర్టు వేసుకొని వచ్చాడు జుట్టు ఇంకా తడితడిగా కన్పిస్తోంది.
    "ఇన్స్ స్పెక్టర్ గారూ! నాకేదో భయంగా ఉంది" అన్నాడు రమణరావు.
    "భయమా? ఎందుకూ? మిమ్మల్ని ఎవరేం చేస్తారూ?" అతడి  ముఖంలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు నరేంద్ర.
    "పోయిన శుక్రవారం మా కంపెనీలో పనిచేసే రాధారాణి హత్య జరిగింది. శనివారం రాత్రి నాచేత వీలునామా రాయించుకుని వెళ్ళిన రాత్రే, రామకృష్ణ హత్యకు గురి అయ్యాడు. రాత్రి నన్ను హత్య  చెయ్యడానికి ప్రయత్నం జరిగింది....." అన్నాడు రమణరావు.
    "ఉదయం జరిగిన  హత్య గురించి మీరు మాట్లాడలేదు."
    "ఉదయం హత్యతో నాకేం సంబంధం....?"
    "అంటే ముందు రెండు హత్యలతో మీకు సంబంధం ఉంది అనేగా?" నరేంద్ర కంఠం దృడంగా పలికింది.
    ఒక్కసారి స్విచ్ ఆఫ్ వేసినట్టు రమణరావు ముఖం నల్లబడింది.
    "ఏ....ఏమిటి మీరనేది? హత్యలతో నాకు సంబందం ఏమిటి?
    "మీరే అన్నారుగా?"
    "నేను అలా అన్నానా?"
    "హత్యకు గురి అయిన వాళ్ళిద్దరి....."
    "తో మీకు సంబంధం ఉందంటారు?" నరేంద్ర మధ్యలోనే అందుకుని అన్నాడు.
     రమణరావు తడబడ్డాడు.
    "మొదటి ఆమె మా కంపెనీలో పనిచేసే వ్యక్తి రెండో వాడు  నాచేత వీలునామా రాయించుకున్నవాడు అన్నాడు. నామీద కూడా హత్యా ప్రయత్నం జరిగిందన్నాను"
    "ఇప్పటికీ ఏం జరిగిందో చెప్పండి" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ .
    "నరేంద్ర ఏం జరిగిందో చెప్పండి" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "నరేంద్ర గారూ! మీరెంత  డిటెక్టివ్ అయినా. ఎదుటి మనిషెవరో ఆలోచించకుండా అలాంటి ప్రశ్నలు వెయ్యడం  సబబుకాదు" నోచ్చుకుంటున్నట్టు అన్నాడు రమణరావు.
    "ప్రశ్నలు వెయ్యడం మా వృత్తిలెండి" తేలిగ్గా అనేశాడు నరేంద్ర.
    "చెప్పండి. హత్యా ప్రయత్నం ఎలా జరిగింది?" ఇన్స్ స్పెక్టర్ అడిగాడు.
    "రండి చూపిస్తాను" అంటూ తన పడక గడికేసి తారి తీశాడు రమణరావు.
    ఆ గది ఆధునాతనంగా ఉంది. కిటికీ అద్దాలు పగిలి ఉన్నాయి. గ్రిల్లు స్క్రూలు కొన్ని ఊడదీసి ఉన్నాయి.
    "స్క్రూలు తిప్పుతుండగా నాకు మెలుకువ వచ్చింది. లోపల జీరో వోల్టు బ్లూ బల్భ్ వెలుగుతోంది. నేను ఒకసారిగా భయపడి కేకలు వేశాను. పక్క గదిలో నిద్రపోతున్న మా తమ్ముడు నా కేకలు విని పరిగెత్తు కొచ్చాడు. నా కేకలకే వాడు పరుగు లంకించుకొన్నాడు."
    మీకు మెలుకువ వచ్చేసరికి అతడు ఏం చేస్తున్నాడు?"
    "తల వంచి స్క్రూలు తిప్పుతున్నాడు. ఆజానుబహుడు. బొద్దుగా ఉన్నాడు. ఇటుకరాయి రంగుషర్టు వేసుకొన్నాడు."
    "ముఖం కన్పించలేదా?"
    "లేదు ముఖం మీదకు వాలేలా హేట్ పెట్టుతున్నాడు. వాడు స్క్రూలు తిప్పుతున్నప్పుడు ఒక చేయి బొటనవ్రేలుకు మరో వ్రేలు వేలాడుతూ కన్పించింది."
    "ఇవన్నీ తీరిగ్గా చూశాకే మీరు కేకలు వేశారా?" నరేంద్ర ప్రశ్నించాడు.
    "మెలుకువ రాగానే ఆ ద్భుశ్యం చూసి నాకు నోటమాట రాలేదు. ఏం జరుగుతోందో వెంటనే బుర్రకు తట్టలేదు. మంచి నిద్రలో నుంచి లేచానేమో కొద్ది క్షణాలు కళ్ళప్పగించి చూశాకే కేకలు పెట్టాను."
    "ఒక చేతికి రెండు బొటన వ్రేళ్ళున్నయ్యా? కుడి చేతికా ఎడం చేతికా?" ఇన్స్ స్పెక్టర్ సాలోచనగా అడిగాడు.
    "చెప్పలేదు. ఆ భయంలో నేను వివరాలు ఎక్కడ చూశాను?"
    "అప్పుడు టైం ఎంతైంది?"
    "అప్పుడు టైం చూడాలని  కూడా బుర్ర పనిచెయ్యలేదు. అతడు పారిపోయాక నాకు గుండెదడ కొంచెం తగ్గాక చూశాను. అప్పుడు  3-45 నిమిషాల అయింది. అంటే నాకు  మెలుకువ  2-30, 2-35, మధ్యలో వచ్చి ఉండాలి."
    "మరి మీ నౌకరు పైడయ్య అతడ్ని చూడలేదా?"
    "వాడిది మొద్దు నిద్ర ఆరు బయట చాప వెసుకొని పడుకున్నాడు. ఆ పరిగెత్తిన వాడు పొరపాటుగా వాడి కాలు తొక్కాడు. వెంటనే  అరుస్తూ లేచి పరుగెత్తుతున్న  వ్యక్తి కేసి పరుగుతీశాడట. వాడు గేటు దూకి పారిపోతున్నప్పుడు పైడయ్య  కూడా అతడి చేతికి ఆరు వ్రేళ్ళు ఉండటం చూశాడట."
    "అలాగా?" ఎవర్నో గుర్తు వేసుకుంటున్నట్టుగా ఇన్స్ స్పెక్టర్ అన్నాడు.
    "అంటే అతడు గేటు దూకుతున్నప్పుడు పైడయ్య పట్టుకోలేక పోయాడా?" నరేంద్ర అడిగాడు.
    "వాడు గేటు  దగ్గరకు పరుగు తీసే సరికే అతడు గేటు  దూకేశాడనా, వెనక నుండి చూస్తే తెలిసిన వ్యక్తిలా  ఉన్నాడంటాడు పైడయ్య వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు కూడా."
    "అవును. చాలా సార్లు చేశారని  చెప్పారు. తెల్లవారుజామున కుమార్ చేశారు. మా కానిస్టేబుల్ చెప్పాడు. నేను రాత్రంతా  సరూర్  నగర్ లోనే ఉండిపోయాను" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "మీ తమ్ముడు లేడా?" నరేంద్ర ప్రశ్నించాడు.
    "తన గదిలో ఉన్నాడు: వాడికి పుస్తకాల పిచ్చి. పుస్తకంలో తలదూఏస్తే చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్పిపోతాడు."
    "గుడ్ టెస్ట్! అన్నాడు నరేంద్ర.
    అందరూ హాల్లోకి వచ్చారు.
    "పైడయ్యా! సన్యాసమ్మకు కాఫీ తెమ్మని చెప్పు" అన్నాడు రమణరావు.
    "అయ్యా!" అంటూ పైడయ్య లోపలకు వెళ్ళాడు.
    "సన్యాసమ్మ ఎవరూ?" నరేంద్ర ప్రశ్నించాడు.
    "మా పైడయ్య పెళ్ళాం ఇంటిపనీ. వంటపనీ ఆమె చూసుకుంటుంది. చాలా నమ్మకమైన వాళ్ళు."
    "రామకృష్ణ హత్య గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వెయ్యాలనుకుంటున్నాను."
    "అడగవయ్యా నరేంద్రా! మన పని అదేగా?" అన్నాడు అద్వయితం అదోలా చూస్తూ.
    "వ్వాట్!" ఇంతెత్తున ఎగిరిపడి అడిగాడు రమణరావు. అతడి ముఖం తెల్ల కాగితంలా వెలావెలా పోయింది.
    "భయపడకండి. ఎందర్నో ప్రశ్నిస్తేగాని మాకు అసలు హంతకుడు దొరకడు. ఆ ఎందర్లో మీరొకరనుకొండి" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.
    రమణరావు రిలీఫ్ గా కుర్చీలో వెనక్కు వాలాడు.
    అంతలో  నల్లగా, నిగనిగలాడుతూ వయసులో ఉన్న ఓ పాతికెళ్ళా యువతి ట్రేలో కాఫీ కప్పులు పట్టుకొని వచ్చింది. ఇన్స్ స్పెక్టర్ ను చూసి బెదిరిపోయినట్టు అల్లంత దూరంలోనే ఉండిపోయింది.
    "పర్వాలేదు సన్యాసమ్మా.రా! కాఫీ ఇవ్వు మీడ్రెస్ చూస్తేనే ప్రజలు బెదిరిపోతారు" అన్నాడు రమణరావు ఇన్స్ స్పెక్టర్ ను ఉద్దేశించి.
    "మా డ్రెస్ చూసి ప్రజలు కాదు, అపకాథం చేసిన వాళ్ళే భయపడ్తారు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    సన్యాసమ్మ ట్రేను పట్టుకుని నరేంద్ర ముందు నిల్చుంది.
    కాఫీ కప్పు తీసుకుంటున్న నరేంద్ర దృష్టి సన్యాసమ్మ చేతి గాజులమీద పడింది. పచ్చగాజులు. చేతులకు గాట్లు. ముఖంలోకి చూశాడు. ముఖం నిండా, మెడమీదా  గాట్లున్నాయి. నరేంద్ర బుర్రలోకి మెరుపులాంటి ఆలోచన ప్రవేశించింది.
    "ఒకటి అడగాలని  ఉందయ్యా!" కాఫీ కప్పు అందుకుంటూ రమణరావు కేసి చూశాడు అద్వయితం.
    "అడగండి. మీరు వచ్చిన పనే అది కదా" వ్యంగ్యంగా అన్నాడు రమణరావు.
    "అది కాదయ్యా అది కేవలం నీ వ్యక్తిగత విషయం అంతే!"
    "ఆడగండి చెప్తాను. మీకు అడ్డేమిటి?" కసికసిగా అన్నాడు రమణరావు.
    నీకు ముప్పయ్ ఏళ్ళులేవు?"
    కాఫీ సీవ్ లేసి "ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేడూ?" అని కుతూహలంగా అడిగాడు అద్వయితం.
    "నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. త్వరలోనే చేసుకోబోతున్నాను" కాఫీ తాగి ఖాలీ కప్పు బల్లమీద పెట్టాడు రమణరావు.
    "లావణ్యను చేసుకోబోతున్నారా? ఆమె మీకు  నచ్చిన అమ్మాయా? కాని ఆ పిల్లకు మీరు నచ్చలేదనుకుంటాను. ఆమె కృష్ణమూర్తిని ప్రేమిస్తుందని విన్నాను" అన్నాడు నరేంద్ర.
    "ఎందుకలా అడుగుతున్నారు? ఎవరు చెప్పారు? నా పెళ్ళి గురించి ఆరాలు తియ్యాల్సిన అవసరం మీకే మొచ్చింది?" కోపంగా అడిగాడు రమణరావు.
    "అవసరం ఉంది కనుకనే తెలుసుకొన్నాం." ఇన్స్ స్పెక్టర్ కటువుగా అన్నాడు. నరేంద్ర కేసి "తర్వాత ప్రశ్నవేయి" అన్నట్టుగా చూశాడు.
    "రామాకృష్ణ విల్లు మీచేత రాయించడం జరిగింది. ఆ విల్లులో అతడికున్న ఆస్తి మొత్తం కమలాంబ పేరా రాసినట్టు ఉంది"
    రమణరావుకు ఎవరో గూబమీద ఈడ్చి కొట్టినట్టుగా అయింది.
    "ఏది ఏమైనా ఆస్తి అంతా ఆమెకే  దక్కేలా చెయ్యగలిగారు. అందుకే కూతుర్ని మీకిచ్చి పెళ్ళి చెయ్యడానికి సిద్దపడింది."
    "మిస్టర్ నరేంద్రా! మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నానను కొంటున్నారు. మీ మాటల్లోని అంతరార్థం గ్రహించలేనంతటి మూర్కుడ్నికాను."
    "ఆ సంగతి నాకు తెలుసు. అందుకే సూటిగా ప్రశ్నించలేదు."
    "తమ్ముడు అక్కకు రాయక ఆస్తి ఇంకెవరికి రాస్తాడు? చేసుకొన్నా భార్య మోసం చేసింది. ప్రాణ స్నేహితుడు  దగా చేశాడు. ఎంతకాదన్నా రక్తసంబంధం ఈ ప్రపంచంమీదే రోతపుట్టిన వాడు ఆశ్రమంలోనే శేష జీవితం గడపాలనుకొన్నాడు. అందుకే వాళ్ళ అక్క పేరా ఆస్తిరాశాడు, మీరు అనవసరంగా ఏదేదో ఊహిస్తూ అసలు హంతకుడ్ని వదిలేస్తున్నారు."
    "అసలు హంతకుడెవరు?" అంతవరకూ రమణరావును గమనిస్తూ కూర్చున్న ఇన్స్ స్పెక్టర్ ప్రశ్నించాడు.
    "నాకేం తెలుసు? అతడు చనిపోతే ఆస్తి వస్తుందని ఆశించే వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ వెంటబడండి" విసురుగా అన్నాడు రమణరావు.
    "ఎవరి వెంటబడాలో మాకు తెలుసులేవయ్యా" అన్నాడు ఇన్స్ స్పెక్టర్ చిరాకుపడ్తూ.

 Previous Page Next Page