Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 30

"నోరెత్తావంటే చంపేస్తాను. వెళ్ళిపో" అంది లావణ్య రౌద్రంగా.
"మాటలు జాగ్రత్తగా రానియ్. నువ్వనేది నాకర్ధం కావటం లేదు" అంది రోసి నిబ్బరంగా.
"ముందా ముక్కలు బయటికి తియ్యి" అంది లావణ్య.
రోసి నిర్లక్ష్యంగా టేబుల్ మీద నున్న డబ్బులు తీసి హండ్ బాగ్ లో వేసుకుని "ఆడితే ఆడు- లేకపోతే లేదు. డబ్బులు పోతున్నంత మాత్రాన ఎదుటివాళ్ళని అవమానించకు" అంది గౌన్ సరిచేసుకుంటూ.
అదేం మాయో! గౌన్లో దాచిన ముక్కలు ఇప్పుడు కనబడటం లేదు.
"ఐ విల్ ఫినిష్ యూ! నిన్ను చంపేస్తాను" అంది లావణ్య ఉక్రోషంగా.
"ఏం చేస్తావ్?"
"చంపేస్తాను"
నవ్వి వెళ్ళిపోయింది రోసి.
ఆ రూంలో పెద్ద గుంపు పోగాయింది. అందరూ వింతగా చూస్తున్నారు.
క్లబ్బు మేనేజరోచ్చి "టేకిట్ ఈజీ, టేకిట్ ఈజీ" అంటూ లావణ్యకి నచ్చచెబుతున్నాడు.
ఇంక అట సాగలేదు. ఒక అరగంట సేపు మేగజేన్స్ తిరగేసి, ఇంక యింటికెళ్ళబోతూ, టాయిలెట్ వైపు నడిచింది లావణ్య.
అది రోజు తన కలవాటు.
క్లబ్బు నుండి బయల్దేరే ముందు ఓసారి మొహం కడుక్కుని ఫ్రెష్ గా పౌడర్ రాసుకోవడం.
"చీ! ఎందుకిలా అయింది ఇవాళ?"
ఏదో పోరబాటున స్నేహ బావుంటుందని శ్రీహర్ష మీద కోపం తెచ్చుకుంది.
తనకి కోపం ఎందుకొచ్చిందో అతని కర్ధం కాకుండా ఎలా బతిమిలాడతాడు తనని?
ఇంతలో రోసి గోడవొకటి.
తనకి తొందరపాటు ఎక్కువ.
నిజంగా, నిజంగా తను రోసిని కొట్టిందా? అది తిరగబడి తన చెంప పగిలేలా మళ్ళీ కొట్టి ఉంటే?
ఎకసెక్కంగా నవ్వేసి వెళ్ళిపోయింది కదూ?
టాయిలెట్ దగ్గర లైట్ ఫ్యూజ్ పోయినట్లుంది. చిరుచికటిగా ఉంది.
హఠాత్తుగా ఏవో శబ్దాలు-- మనుషులు గబగబ నడుస్తున్నట్లు-
తలుపు తోసి లోపలికి ప్రవేశించింది.
ఆ మసక చీకటిలో అస్పష్టంగా ఒక స్త్రీ ఆకృతి.
"ఎక్స్యుజ్ మీ" అంటూ చటుక్కున బయటికి వచ్చేసింది.
పది నిమిషాలయినా ఆ లోపల ఉన్న స్త్రీ బయటికి రాలేదు.
అప్పుడనుమానమొచ్చింది లావణ్యకి. ఆవిడ గోడ మీద ఒరిగిపోయినట్లు వుంది. సహజంగా లేదు.
ఉన్నట్లుండి లైట్లు వచ్చాయి.
తలుపు తోసి చూసింది.
రోసి!
పాలరాతి నేల మీద రక్తం!
గుండెల్లో కత్తి!
ఆ కత్తిని రెండు చేతుల్తో పట్టుకుని ఉంది రోసీ! మొహం బాధతో వంకర్లు తిరిగిపోయి ఉంది.
పరుగున వెళ్ళి ఒళ్ళు ముట్టుకుని చూసింది లావణ్య. ఇంకా వళ్ళు వెచ్చగానే ఉంది. నాది ఆడుతోందో లేదో తెలియటం లేదు.
కళ్ళు మిరుమిట్లు గోలిపెట్లు ప్లాష్ వెలిగింది. కెమెరా క్లిక్ మంది.
మళ్ళీ లైట్లు పోయాయి. చీకటి!
"ఏమిటిది?" అని అరిచింది లావణ్య. భయంతో గొంతు సరిగా రాలేదు. తన మాట తనకే సరిగే వినబడలేదు.
"వెల్ దన్ మిస్ లావణ్యా! రోసి దొంగాట ఆడుతుందని నాకూ తెలుసు. దైర్యంగా పొడిచి పారేశావ్. వెల్ వెల్! ఈ రహస్యం నీకూ నాకూ తప్ప ఇంకెవరికి తెలియదులే. రేపు గుర్తుగా నీకు ఫోటోలు పంపిస్తాను" అంది ఓ గొంతు. గుసగుస మాట్లాడుతున్నట్లు ఉంది- స్పష్టంగా వినబడటం లేదు.
"ఎవరిది? రాసిని నేను చంపలేదు" అంది లావణ్య వణికిపోతూ.
"అబద్దాలు బతికి ఉన్న నాతో కాదు. చచ్చిపోయిన ఆ శవంతో చెప్పు. నమ్ముతుంది. రోసి! పాపం నిన్ను చంపింది లావణ్య కాదు. సాయంత్రం నీ చెంప పగిలేలా కొట్టింది లావణ్య కాదు. నిన్ను చంపుతానని బెదిరించింది లావణ్య కాదూ? అంతా ఆటలో అరటిపండు" అంటూ నవ్వుతూ దూరమయిందా గొంతు.
లావణ్యకి ముచ్చెమటలు పోశాయి. ఇదేమిటి? ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది తను? నేను హంతకురాలినినా? ఆ ఫోటోలు చూస్తే అందరూ నమ్మేయ్యరూ? అందులో అంతకు ముందే గదా తను రోసితో పోట్లాడింది.
భగవంతుడా!
త్వరత్వరగా ఇంటికెళ్ళిపోయింది లావణ్య. ఎవరితో మాట్లాడే ధైర్యం చాలలేదు.

                                               * * *

 Previous Page Next Page