ఆ దోవనేవస్తూ సోదెమ్మ అప్పుడే చూసినట్లుగా చామంత్య్ని చూసింది. చామంతి కళ్ళు తుడుచుకోకుండా తల ఎత్తడం వల్ల కన్నీళ్ళతడి బుగ్గలమీద అలాగే వుంది. నా కేందుకులే అని వెళ్ళబోతున్న సోదెమ్మ ఆ అమ్మాయి కళ్ళలో జాలువారిన నీటిని చూసినట్లు ముఖం పెట్టి అక్కడే ఆగిపోయింది.
చామంతి కంగారుతో కళ్ళు తుడుచుకుంటూ గబుక్కున లేచినుంచుంది.
చానత్య్కి పది దుగుల దూరంలో నిలబడ్డ సోదెమ్మ అది చూసి దగ్గరగా వచ్చి నిలబడింది. "ఏడుస్తున్నావా?" అంది.
"ఏడుస్తున్నానని చెపితే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది తను ఏడుపేదో తనే ఏడవాలి గాని ఆమెతో చెపితే ఆరుస్తుందా? తీరుస్తుందా? పోనీ ఏడవటంలేదని చెపుదామా అంటే తడిబారిన కళ్ళు అబద్దాన్ని దాచలేవు. ఏం చేయాలి? నీ కెందుకు వెళ్ళు అనాలా!" ఆలోచిస్తూ నిలుచుంది చామంతి.
"ఏడ్వటానికి యింతకన్నా మంచి చోటు దొరకలేదా పిల్లా!" సోదెమ్మ నవ్వుతూ అడిగింది.
"ఏడుపొస్తే ఏడుస్తారు...అంతేగాని దానికో మంచిచోటు మంచి ముహూర్తం చూడరు" కోపంగా అంది చామంతి.
"అదీ నిజమేలే పిల్లా!"
"నా పేరు పిల్లకాదు."
"మరి పిడుగా?"
"అదీ కాదు."
"మరి...?"
"చామంతి."
"గులాబి పువ్వులా వున్నా నీకు చామంతి అన్న పేరు అందంగా అతికినట్లు సరిపోయింది."
సోదెమ్మ మెచ్చుకునే సరికి చంతికి రవంత సిగ్గు వేసింది. సిగ్గు పడుతూనే కళ్ళు తుడుచుకుంది.
చామంతిని ఓ పక్క మాట్లాడిస్తూ మరో పక్క అంచనా వేస్తున్నట్లు గుచ్చి గుచ్చి చూస్తున్నది సోదెమ్మ.
"నువ్వొక్కదానివే యిక్కడికి వచ్చావా?"
"అవును...ఊహూ కాదు కాదు."
"ఎందుకు అలా భయపడతావు నేను నీలాంటిదాన్నే"
సోదెమ్మ అ ఆమాట అనంగానే చామంతి తలొంచుకుంది.
మనసుకి గాయం తగిలితేనె కన్నీళ్ళు వస్తాయి. నీ మనసు గాయపడింది అవునా! నె ఇబాద ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళూ లేకపోవటంతో కలిగిన కష్టానికి ఎవరితో చెప్పుకోవాలో తెలియక అడవి తల్లితో మొరపెట్టుకోవటానికి వచ్చావు అవునా! నీ మొర వృధా కాదు....నీ కష్టం తీరివడ్డెక్కు తావు" సోదెమ్మ రాగ యుక్తంగా అంది.
ఏదో ఆశ చామంతి కళ్ళు తళుక్కున మెరిశాయి. "న అకష్టం తీరుతుందో లేదో సోది చెపుతావా? నా దగ్గర రెండు రూపాయలు వున్నాయి....ఆ రెండూ ఇస్తాను" అడిగింది ఆతృతగా.
"సూరీడన్న దిగిపోయాడు ఈ సమయంలో సోదిచెప్పకూడదు. కాని... ..."
"కాని...అదేమిటో తొందరగా చెప్పు అమ్మీ!"
"సోదిచెప్పటమేగాక నాకు కణుపుల జోస్యం చెప్పటం కూడా వచ్చు. కావాలంటే అది చెపుతాను."
"కణుపుల జోస్యమా అంటే?"
"నీ రెండు చేతులూ ఇలా జాపు."
చామంతి వెంటనే రెండుచేతులూ జాపింది.
"వేళ్ళమీద వున్నా వీటిని కణుపులు అంటారు. కణుపుల మీద చర్మం ముడతలుగా వుంటుంది కదా ఆ ముడతలు చూసి ఏదైనా జెప్పవచ్చు."
"నిజంగానా?"
"నిజంగా."
"అయితే చెప్పు నా కష్టం ఎప్పుడు తీరుతుందో?" చేతులు రెండూ అలాగే చాపివుంచి ఆశగా ఆతృతతో అడిగింది చామంతి.
కణుపు మీద ముడతలు లెక్క పెట్టింది సోదెమ్మ. ఆ తర్వాత, తలెత్తి ఆకాశంచూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచింది.
"నీకు వచ్చింది మామూలు కష్టం కాదు చాలా పెద్ద కష్టం" అంది నిదానంగా చామంతి ముఖ కవళికలు చూస్తూ.
"కష్టం తీరదా?"
"ప్రయత్నిస్తే తీరుతుంది"
"ఆయన్ని పోలీసులు జైల్లో పెట్టారు. నేనేం ప్రయత్నం చేయగలను? పోలీసుల పేరు ఎత్తితే చాలు నా కాళ్ళూ చేతులు ఆడవు" తనకు తెలియకుండానే విషయం చెపుతూ అంది చామంతి.
ఒక్క మాటతో విషయం చాలావరకు అర్ధమైపోయింది సోదెమ్మకి....పోలీసులంటే అందరికీ భయమే. మంచి వాళ్ళని జైలులో పెడతారు. వాళ్ళది కుక్కబుద్ది. ఓసారి ఇలాగే నీ భర్తని జైలులో పెట్టినట్లు అన్యాయంగా ఒకతన్ని పోలీసులు...."
సోదెమ్మ మాటలకి అడ్డు తగిలి "నా కింకా పెళ్లి కాలేదు" అంది చామంతి సిగ్గుపడుతూ.
కనురెప్పపాటు కాలంలో సోదెమ్మ తేరుకుంది. ముఖమంతా నవ్వుపులుముకుని "భలేదానివే నీకు పెళ్ళయిందని నేను చెప్పానా! నీవు చెప్పకపోయినా నీ చేతి వేళ్ళమీద వున్నా ముడతలు ఆ విషయాన్ని తెలియజేశాయి. నీ కాబోయే భర్త పేరు నాకు తెలియదు. నీవు ప్రేమించిన వాడే నీకు భర్త అవుతాడు కాబట్టి నీ భర్త అన్నాను తప్పా? నేనేమీ అనుకోనులే చెప్పు" అంది మామూలుగా మాట్లాడుతున్నట్లు.