Previous Page Next Page 
రీవెంజ్ పేజి 3

                                              
                                                               రివెంజ్

    చినుకు

    నిర్మలాకాశాన్ని చేధించిన రెండు నీటి బిందువులు గాలిలో కలిసి ధరణి పెదవుల్ని     సుతారంగా

చుంబిస్తున్నాయ్. ధరణి ఆ చినుకుల స్పర్శకి పులకించి వెచ్చటి     శ్వాసను వదులుతుంది...

    ఆ రెండు నీటి బిందువులు చీలి నాలుగుగా మారాయ్.

    నాలుగు ఆరుగా.

    ఆరు ఎనిమిది, ఎనిమిది....?

    చినుకులుగా,

    చినుకులు.

    టప్.

    టప్..

    టప్...

    వర్షం కురుస్తుంది హోరున.


                               *    *    *


    యూనివర్సిటీలేడీస్ హాస్టల్

    ఆ హాస్టల్ అమ్మాయిలతో అందంగా వుంది.

    వర్షానికి తడవటం వలన విచ్చుకోబోయే గులాబి మొగ్గలా ముడుచుకొని వుంది.

    రెండు పదులు దాటిన పరువాల్ని నిశ్శబ్దంగా తనలో దాచుకోవటం వలన గంభీరంగా వుంది.

    ఎక్కడినుంచో వచ్చిన మలయమారుతం నీటి తుంపరలతో కలసి ఆమె అందమైన పాదాన్ని సుతారంగా
తాకింది.
    ఆమె అన్విత.

    ఇంద్రధనస్సులోని చిన్న ఒంపు.
 
    ఆ ఒంపుపైన తెల్లగా మెరుస్తూ కిందకి జారుతున్న వెండిపట్టీ

    దిగువున ఎర్రగా మెరుస్తున్న కాలి గోళ్ళు.

    ఆమె తన కుడికాలిని వర్షంలో వుంచింది. వేసుకున్న పట్టు రంగు నీలం పోవడా మోకాలి వరకు పైకి జరిగింది.

పాలరాతి శిల్పానికి బంగారపు పూత పూసినట్లు తెల్లగా మెరుస్తుంది ఆమె దేహం.

    ఆమె పాదాన్ని తాకిన చినుకు నేస్తం నీ పాదస్పర్శ సోకిన ణా జన్మధన్యమైంది. నిన్నంటిపెట్టుకొనే అదృష్టానికి

ఈర్ష్య చెందిన గాలి నీ నుంచి దూరం చేస్తుందని చెబుతున్నట్లు ఆమె పాదంపై బడిన చినుకులు మంచు ముత్యాల్లా జలజలా

రాలిపోతున్నాయ్.

    ఒకవైపు చల్లని గాలి, దానికి తోడు వర్షం, వర్షపు చినుకులు తన పాదాల్ని ముద్దాడుతుంటే...

    అమృతం కురుసిన రాత్రి.

    అందరూ నిద్రపోతున్నారు.

    నేను మాత్రం

    తలుపు తెరిచి ఇల్లు విడిచి

    ఎక్కడికో దూరంగా

    కొండదాటి కోనదాటి

    వెన్నెల మైదానంలోకి

    వెళ్ళి నిలుచున్నాను   

    తిలక్ గుర్తుకొచ్చి నవ్వుకుందామె.

    వర్షానికి పులకించటం, వెన్నెల రాత్రుళ్ళు కీట్స్ పోయిట్రీని చదవటం, సాయంత్రపు నీరెండలో సన్నజాజులు

ఏరుకోవడం...

    ఏమిటి జీవితాన్ని ఇంతగా ఎంజాయ్ చేయగలుగుతోంది... ?


    ఆమెకు సమాధానం వెంటనే స్పురించలేదు.


    ఈ ఆనందాలంతటిని ఎవడో అజ్ఞాత వ్యక్తి హరిస్తాడు.


    పెళ్ళనే పేరుతో జీవితాన్ని శాసిస్తాడు.

    తన విషయంలోనూ అలా జరగొచ్చా.... తనలో తాను ప్రశ్నించుకొంది. అలా జరిగితే తనూ అందరిలాంటి ఆడదే

అవుతుంది. మనసులోని సున్నితపు పొరల్ని కదిలించి రెండు హృదయాల స్పందన ఒక కావ్యంగా మారితే ... ? ఆ కావ్యానికి

తాను నాయిక కావాలి ...  తనని స్పందింపజేసే హృదయం కావాలి.

    ఎక్కడ ... ?

    ఎక్కడ ... ?

    ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకుంది.
    ఆనందం మనసులో మయూర బవ్వంలా విప్పుకుంది.
    ఆలోచనలెందుకు జవ్వనీ ! విలోకించు వర్ష స్పందని
    సందేహం వదలి నా సందిటిని నిలిచి కళ్ళెత్తి చూడు.
 

 Previous Page Next Page