హోటల్లోకి వెళుతున్న మైత్రేయవైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ కారు స్టార్టు చేసింది మోహిత.
కారు సర్రున ముందుకు పరుగెత్తింది.
* * *
హోటల్లో ఏ.సీ. రూమ్...
ఏ.సీ. చప్పుడు మెల్లగా విన్పిస్తోంది.
మైత్రేయ చేతిలోని క్యాసెట్ ని ప్యాకెట్ సైజు టేప్ రికార్డర్లో పెట్టి ఆన్ చేశాడు.
అతని మనసులో చాలా టెన్షన్ గా వుంది.
మోహిత తనకి ఎలాంటి మెసేజ్ పంపి వుంటుంది? తను కన్పించకుండా క్యాసెట్ మెసేజ్ ఎందుకు పంపింది.....?
వచ్చికూడా తననెందుకు కలవలేదు?
టేప్ రికార్డర్ తిరుగుతున్న మెల్లని చప్పుడు.
"హల్లో...." ఆ గొంతు మృదువుగా వుంది. ఆ గొంతులో ఏదో తెలీని ఆకర్షణ.
"నేనే..... మోహితను. మ్యాగజైన్ లో ప్రకటన చూసి హోటల్ కి ఎవరయినా వస్తారని నేనూహించలేదు. సరిగ్గా ఆరున్నర గంటలకు వచ్చాను. రెస్టారెంట్ కి ఎదురుగా వున్న రోడ్డుకి ఎడమవేపున పేవ్ మెంట్ పక్కన కారాపాను. అప్పుడు రెస్టారెంట్లో మీరు కూల్ డ్రింక్ తాగుతూ మ్యాగజైన్ చూస్తున్నారు.
మిమ్మల్ని చూడగానే మీరు నాకు నచ్చారు, నిజంగా. వెంటనే మీతో మాట్లాడాలనిపించింది. కానీ మీకు నా ఫోటో తప్ప నేనెలా వుంటానో తెలీదుగదా? దాన్ని అవకాశంగా థేసుకునిఒ మిమ్మల్ని, మీలో నన్ను చూడాలనే ఆరాటానికి చాలా థ్రిల్ ఫీలవ్వాలనుకున్నాను. ప్రస్తుతం నేను ప్యాలెస్ కి అతి దగ్గర్లోని అపార్టుమెంట్లో వున్నాను.
ఆ అపార్టుమెంట్లో ఇంకో నాలుగు గంటలే వుంటాను. మీరు నన్ను పట్టుకోగలరా? ట్రై చెయ్యండి. కరెక్ట్ గా మీరు ఆ అపార్టుమెంట్ ని ఐడింటి పై చేసి, నన్ను పట్టుకుంటే, మీరూహించని మంచి గిప్ట్ ఇస్తాను.
రేపు సాయంత్రం ఆరుగంటల వరకు మీకు టైమ్.
ట్రై యువర్ బెస్ట్.
-మోహిత..."
ఆ క్యాసెట్ ను రివైండ్ చేశాడు..... మళ్ళీ...... మళ్ళీ....
ఇలాంటి ఎక్స్ పీరియన్స్ మైత్రేయకి ఇదే ఫస్ట్ టైమ్......
థ్రిల్లింగ్ గా వుంది, గమ్మత్తుగా వుంది. ఎగ్జయిటింగ్ గా వుంది.
ఆ క్యాసెట్ ను ఎన్నిసార్లు విన్నాడో తెలీదు.
చేతివాచీ వేపు చూసుకున్నాడతను.
రాత్రి తొమ్మిదిన్నర దాటింది.
ఆ హోటల్ కి దగ్గర్లో చాలా అపార్టుమెంట్స్ వున్నాయి. ఏ అపార్టుమెంటని వెతుకుతాడు తను.....?
అర్జంట్ గా ఇప్పుడే వెళ్లి రాత్రంతా ఆ పార్టుమెంట్ కోసం వెతకాలని వుంది మైత్రేయకి.
వెంటనే బ్లూ కలర్ మారుతీ కారు గుర్తుకు వచ్చింది.
హోటల్ రెస్టారెంట్ బేరర్ కి ఆ బ్లూ కలర్ మారుతీకారు నెంబర్ తెల్సి వుంటుందేమో.....?
మరేమాత్రం ఆలస్యం చేయకుండా, హోటల్ రూమ్ లోంచి బైట పడి ఆటో ఎక్కాడు మైత్రేయ.
"ఏం సార్... మళ్ళీ వచ్చారు.....?" వెంటనే గుర్తుపట్టి అడిగాడు బేరర్.
"నాకో ఇన్ఫర్మేషన్ కావాలి...... చెప్పగలవా?"
"అడగండి సార్...."
"నాకు క్యాసెట్ ఇచ్చిన మేడమ్ ని ఇంతకు పూర్వం నువ్వు చూశావా?" ఆత్రుతగా అడిగాడు మైత్రేయ.
"అదే సార్ ఫస్ట్ టైమ్ చూడడం."
"ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో..."
"రెగ్యులర్ కస్టమర్స్ నాకు బాగా గుర్తే సార్...... ఆవిడ్ని చూడడం ఇదే ఫస్ట్ టైం సార్."
"పోనీ..... ఆ బ్లూ కలర్ మారుతీకారు నెంబర్ చెప్పగలవా?"
"కారు నెంబరా....!" గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు బేరర్.
"అసలు ఆ కారుకి నెంబర్ లేదు సార్.... కొత్తకారు సార్."
"నువ్వు సరిగ్గా చూశావా?" అడిగాడు మైత్రేయ.
"నెంబర్ లేదు సార్.... సార్, ఐడియా..... కొత్తకారు కదా.... అంటే కోని వారం రోజుల్లోపే అయివుంటుంది కదా! షోరూమ్స్ లో అడిగితే వెంటనే తెల్సిపోతుంది కదా."
"గుడ్ ఐడియా.... ఈ ఊళ్ళో మారుతి షోరూమ్స్ ఎన్ని వున్నాయి, ఎక్కడున్నాయో తెలుసా?"
"దేవరాజ్ అడ్స్ రోడ్ లో వున్నట్టు జ్ఞాపకం సార్."
చేతి వాచీవేపు చూసుకుని, బేరర్ కి థాంక్స్ చెప్పి, ఆటోలో పదినిమిషాల్లో దేవరాజ్ అడ్స్ జంక్షన్ కి వెళ్ళాడు మైత్రేయ.
మరో పావుగంట తర్వాత షోరూమ్ అడ్రస్ దొరికింది. కాని అప్పటికే షోరూమ్ క్లోజ్ చేసి వుంది.
ఒక్కసారిగా డీలా పడిపోయాడు మైత్రేయ.
అప్పటికి రాత్రి పదకొండు గంటలు దాటింది.
హోటల్ కి దగ్గరలో వున్న అపార్ట్ మెంట్స్ దగ్గరికి వెళితే..... ఆ ఆలోచన రాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు.
హోటల్ కి ఎదురుగా వరుసగా వున్న అపార్ట్ మెంట్స్ నన్నింటినీ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు.
పోర్టికోల్లో పార్క్ చేసున్న కార్లవేపు చూస్తున్నాడు పరిశీలనగా.
చీకట్లో అపార్టుమెంట్స్ అన్నీ నిద్రపోతున్న నగిషీలు చెక్కిన కొండల్లా వున్నాయి..... నెమ్మదిగా జయమార్తాండ గేట్ వరకు వెళ్ళాడు.
ఈ అర్థరాత్రి సమయంలో ఎలా వెతగ్గలడం తను?
తను వుంటున్న హోటల్ కి అయిదు నిమిషాల నడక దూరంలోనే వున్న అపార్టుమెంట్స్ లోనే మోహిత వుందనే విషయం అతనికి తెలీదు.
అప్పుడు సమయం రాత్రి 11- 45 నిమిషాలు.
ఆ సమయంలో మోహిత, మైత్రేయతో మాట్లాడ్డానికి హోటల్ కి ఫోన్ చేస్తోంది.
* * *
హోటల్ రూమ్ కొచ్చి , బెడ్ మీద వాలిపోయాడు మైత్రేయ.
"సార్, మీకోసం ఎవరో అమ్మాయి మూడుసార్లు ఫోన్ చేశారు." రిసెప్షనిస్టు మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. మోహితదే అయివుంటుంది. మళ్ళీ చేస్తుందా? చేస్తే బావుణ్ణు.
"రేపు సాయంత్రం ఆరుగంటల లోపల తను మోహిత అడ్రసును పట్టుకుంటాడు. మోహితను కలుస్తాడు."
"డ్రెస్ ఛేంజ్ చేసుకుని అనుకుంటుండగా, ఫోం మోగింది. వెంటనే రిసీవర్ అందుకున్నాడు.
"హాలో....." మోహిత గొంతు విన్పించగానే ఒక్కక్షణం తత్తరపాటుకు గురయ్యాడు మైత్రేయ.
"హాలో... మైత్రేయ..... మీ పేరు బావుంది.
"నా పేరు మీకెలా తెలుసు?"
"తెల్సుకుంటే అన్నీ తెలుస్తాయి..... హోటల్ రూమ్ లో వుంటున్నప్పుడు ఆ మాత్రం పేరు తెల్సుకోలేనా?" నవ్వు....
.
"మీరు కన్పించి మాట్లాడుతారనుకొన్నాను..... క్యాసెట్ లెటర్ పంపారెంమిటి? అయినా మీ వాయిస్ చాలా బావుంది" పొగుడుతూ అన్నాడు మైత్రేయ.
"నేను బాగాలేనా....?" స్త్రీ సహజమయిన ఆసక్తితో అడిగింది మోహిత.
"ఫోటో చూసి ఎలా చెప్తాను."
"ఫోటో చూసి అంచనా వెయ్యలేరా?"
"మీలాంటివాళ్ళ విషయంలో కొంచెం కష్టం" ఆ మాటకు నవ్వింది మోహిత.
"మీరిప్పటివరకూ ఏ అమ్మాయి ప్రేమలోనూ పడలేదా?" మళ్ళీ అడిగిందామె.
"ఏం అలా అడుగుతున్నారు?"
"ఏంలేదు..... కొంచెం బిడియంగా మాట్లాడుతుంటేనూ.... బైదిబై మీ హాబీలేంటి?"
"ప్రత్యేకంగా హాబీలంటూ ఏంలేవు."
"నెన్నమ్మను."
పోనీ మీ హాబీలు చెప్పొచ్చు గదా.... హుషారుగా అడిగాడు మైత్రేయ.
"నేను చాలా బావుంటాను. ఆ విషయం ఓపెన్ సీక్రెట్.... షవర్ కింద నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు ఇంకా బావుంటాను" ఆ మాటకు ఒక్కక్షణం షాక్ తిన్నాడు మైత్రేయ.
"షాక్ తిన్నారా మైత్రేయా! ఇష్టమయిన వ్యక్తులతో ఓపెన్ గా మాట్లాడడం నాకిష్టం."
"ఇంకా మీ ఇష్టాలేమిటో?" అడిగాడతను.
"చాలావున్నాయి..... వెన్నెల్లో సముద్రపు ఒడ్డున ఒంటిమీద ఒక్క గుడ్డపీలికైనా లేకుండా పరుగెత్తడం, స్నానం చేశాక డాబామీద లేత ఎండలో దిగంబరంగా గంటల తరబడి కూర్చోవడం, ఇంకా..... వింటున్నారా?"
'ఈమెకు నగ్నత్వం అంటే ఇష్టమా? ఈవిడ కేరక్టర్ ఎలాంటిది' ఆలోచిస్తున్నాడతను.
"ఏవిటీ ఆలోచిస్తున్నారు... నా కేరక్టర్ గురించా?" ఆమె వెంటనే తన మనసులోని ఊహను పట్టేసినందుకు ఆశ్చర్యపోయాడతను.
"అభిరుచుల్ని చెప్పినంత మాత్రాన, వాటిని బట్టి కేరక్టర్ ను అంచనా వేయడం తప్పు మైత్రేయ...." చెప్పి సడన్ గా టాపిక్ ను మార్చేసింది మోహిత.
"ఇంతకీ రేపు సాయంత్రంలోగా నన్ను పట్టుకుంటారా?"
"మీరే దొరికిపోయారుగా" అన్నాడు మైత్రేయ.
"ఎలా?" అడిగిందామె.
"ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ దొరికినట్టే గదా.... దీనిబట్టి మీ అడ్రస్ కనుక్కోవడం చాలా ఈజీ."
"మీకు ఇలాంటి తెలివితేటలుంటాయని నాకు తెల్సు....అంచేత నా అపార్టుమెంట్ ఫోన్ లోంచి కాకుండా, ప్యాలెస్ కి పడమర వేపునున్న శ్రీ దగ్గరున్న పబ్లిక్ టెలీఫోన్ దగ్గరనుంచి మాట్లాడుతున్నాను."
"అయినా ఫర్వాలేదు... అయ్ కెన్ క్యాచ్ యూ."
"ఆల్ ద బెస్ట్....సీ యూ.... టూమరో.... గుడ్ నైట్....." రిసీవర్ని క్రెడిల్ చేసిన చప్పుడు.
వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
మోహిత వుంటున్న అపార్టుమెంట్స్ పక్కన పబ్లిక్ టెలీఫోన్ బూత్ వుంది.
దానిని ట్రేస్ చేస్తే.....అలాంటి పబ్లిక్ టెలీఫోన్ బూత్స్ చాలా వుంటాయి.
ఉల్లిపాయల రసాన్ని తేనెలో కలుపుకుని ఎందుకు తాగమంది?
ఫోన్లో మాటలద్వారా ఆమె కేరక్టర్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడతను.
ఇప్పటివరకూ తనకు ఆడపిల్లతో సంపర్కం అంటే ఏమిటో తెలీదు.
మొహితతో సెక్స్ చాలా బావుంటుందా? మోహిత తనను ఇష్టపడి, సెక్స్ లో పాల్గొనమంటే తను ఒప్పుకుంటాడా?
మైత్రేయలో రకరకాల పచ్చి, పచ్చి ఆలోచనలు. మోహిత వెచ్ఛదనం లేని గుండెలమీద తలపెట్టుకుని తను సేద దీరుతున్నాడు....ఆ స్పర్శ వేడిగా వుంది. ఆమెను ముద్దుపెట్టుకుంటున్నప్పుడు నరనరాల ప్రవహిస్తున్న తియ్యదనం....