"వద్దుసారధీ వద్దు.....మీకు అర్ధంకాదు. సార్దిపూరితమైన ఈ లోకంలో ప్రేమజీవితాలకి తావులేదు.....నాకు తెలుసు నన్ను మీరు నమ్మించలేరు.....తిరిగివచ్చాక పలువురు పలు రకాలుగా అనేమాటల్ని నేను భరించలేను.....అప్పుడు మీరు నన్ను స్వీకరించనూ లేదు. అదే జరిగేది. నాకు తెలుసు"
"మీకు తెలియదు గీతా"
మధురం ఏదో చెప్పబోయాడు.
"మీకు తెలుసునేమో కదా? మోసేవాడికి తెలుస్తుంది కావిడి బాధ......బరువూను.....పైనుండి అంటే ఏం తెలుస్తుంది?"
నవ్వువచ్చింది ఆమె ఉక్రోషం చూసి.
"నిజమే.....కాదనను.....నేనుకావిడి మోసేవాడినే.....అందుకే అర్ధం అవుతోంది. మీరు అంగీకరించాలి"
"ఊహూ"
"వినవాగీతా?"
"వద్దు సారధీ వద్దు.....నాకింతకంటే వేరు మాటలురావు.....ఇదేదోమనల్ని వేరుచేసివిడదీయటానికే వచ్చింది. తొలుత అతను కలిసిననాడే అనుకున్నాను మనస్సులో.......
"ఇదేం ఉప్పెన రాబాబూ" అని.....ఇంతవరకూ అతన్ని ఓదారుస్తూ వున్నానంటే అది కేవలం నటన"
"ఇప్పుడూ ఆ నటనే కొనసాగించు.....డ్రామా అయిపోయాక వేషం తీసివేసి ఇంటికి వచ్చి నట్టువచ్చెయ్"
"ఎంత తేలికగా చెప్పావుగా సారధీ?......వద్దు.......వద్దు......నేను నీకు దూరం కాలేను"
అతని భుజంపై తల ఆన్చి ఏడవ సాగింది. మెల్లగా తల నిమురుతూ అన్నాడు.
అతని కళ్ళల్లోనూ నీళ్ళు తిరుగుతున్నాయ్.
"పిచ్చిదానా! మనల్ని వేరుచేసే వారు ఎవరూ లేరు.
దేవుడే మనల్ని ఒకటిగా చేశాక మనల్ని వేరు చేసే వారు ఎవరు? నీ పిచ్చి ఊహలుమానుకో"
"ఊహూనన్ను దూరం చేసుకోకండి......వద్దు"
"వద్దు.......వద్దు......అనేమాటలే కానీ అర్ధం చేసుకోలేవా గీతా?"
"మీకేం తెలుసు మధురా! త్యాగం, కీర్తి అనటం మాత్రమే మీకు తెలిసింది. తుఫానులో ఓడలో చిక్కుకున్న వారికీ ఆ బాధతెలుస్తుంది కానీ ఒడ్డున కూర్చుని చూస్తూ ఏముంది అంతా మామూలేకదా ఆ పడవ అలా అలా ఊగుతుంది అంతేకదా? అనే బయటవారికి ఏం తెలుస్తుంది ప్రాణాలతో ఆటలాడుకుంటున్న సముద్రుడి కబంధహస్తాల్లో చిక్కుకుని ఇరుక్కుని బయటకురాలేక బాధపడేవారికి ఆ బాధ అర్ధమౌతుంది"
సారధి నిశ్చయంగా నిశ్చలంగా అన్నాడు.
"అపార్ధ సారధి సాక్షిగా ఈ పార్ధసారధి చెపుతున్నాడు విను గీతా నిన్ను విడిచినేను లేను.......నన్ను విడిచి నీవులేవు-తాత్కాలికమైన వియోగం సామాన్యం-వియోగంతర్వాత కలిగే సామాన్యం వియోగం తర్వాత కలిగే సంయోగాన్ని ఊహించుకుని తృప్తి పడాలి కానీ భయపడితే ప్రయోజనంశూన్యం......నా మాటవిను......అంగీకరించు"
నిష్టూరంగా అంది.
"సరే! కత్తికి లేని దురద కందకెందుకు?"
"గీతా"
గది అంతా దద్దరిల్లింది.
"అలాంటిమాటలనకు......నాగుండె చీల్చేమాటలు ఎప్పుడూ ఉపయోగించకు"
అతని అరచేతుల్లో ముఖందాచుకుని మెల్లిగా రోదిస్తూ అంది.
"మీరునన్ను అర్ధం చేసుకోలేదు.......పోనివ్వండి.....మీమాట కాదని మీ మనసునొప్పించలేను. మీ మాటకన్నా నాకు కావలసిందీ ఆచరించ తగ్గదీలేదు ఏదీ......మానాన్నా వాళ్ళని వప్పిద్దాంలేవండి"
గదిలో గడియారం ఎనిమిది గంటలుకొట్టింది.
"బావా!"
ఎప్పుడూ ఏకాంతాన్ని కోరి వచ్చే సారధి ఏకాంతానికి ఏ కాంతో అడ్డొస్తూనే ఉంటుంది.
మరదలిపిలుపు వినిపించుకోకుండా ఆషాఢ మేఘాల్ని, అందంగా అల్లుకుంటున్న గగన కాంతావలోకనంలో మునిగిపోయాడు అతను.
"బావా!"
మరదలిపిలుపు వినిపించని సుదూరభావనాకాశంలో చక్కని చుక్కలకోసం పరిగెడుతున్నాడు సారధి.
"బావా......."
ఉలిక్కిపడి అన్నాడు.
"ఏమిటి సరోజ అది"
అతని కంఠంలో ధ్వనించేకోపానికి ఆమె శరీరం జలదరించింది. మౌనంగా కొద్దిసేపైనా వుండలేని స్వభావం సరోజది.
సదామౌనంగా శాంతంగా హృదయోల్లనజకమైనన భావకవితలలో మునిగిపోయే స్వభావం సారధిది.
రెండువిరుద్ద ప్రకృతులు.
"అదికాదుబావా?"
"ఏదికాదు?"
"ఫోనే చెప్పను అలా గేళీ చేస్తే"
"మరీ మంచిది"
"బావా......"
"ఏంకోవా?"
ఒకరు బుద్దితో ఊహిస్తున్నారు.
మరొకరు మనసుతో ఆలోచిస్తున్నారు. లంగరందని భావాలతో మనసులు మనువులు తనువులు కలియాలనుకోవటం భ్రమకాక మరేవుతుంది?
"ఛీ! ఒట్టి కోతి!"
"అదిగో అదే దెబ్బలు తినే లక్షణం అనేది!"
"ఏది?"
"అదే!"
"అయితేకొట్టు"
తలపై ఓ మొట్టికాయ వేశాడు.
చిలిపిగా నవ్వుతూ అంది.
"మాబావా మంచివాడు.....బహుమంచివాడు"
"అంటే మంచివాడు కాదనిఅర్ధం"
అతను తనతో సరసంగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషించింది.
బావా-మరదలు అనే మధురమైన బంధాన్ని సంబంధాన్ని సదా మనసులో ప్రతిష్టించుకుని తీయతీయని భావాలలో ఎగిరిపోతూ బావకి మరదలికి మధ్య మధురమైన సన్నివేశాలు మనస్సులో కల్పించుకుంటూ పగటికలలు కంటూ సంతోషంతో పరశురాం చెందే ప్రకృతి సరోజది.
అలాంటి స్వల్ప సంతోషాలు తాముకోరుకున్నవారి దగ్గర్నుండే ఎంత చిన్నదైనాసరే-ఆ కోరుకున్న కోరిక తీరితే అదే పదివేలు- కానీవిధి ఎప్పుడూ వక్రంగానే నడుస్తుంది.