Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 26


    గోపాలకృష్ణ నుంచి కబురు వచ్చినప్పటినుంచీ ఆమెకు మనసు మనసులో లేదు. తన శరీరమంతా విచ్చుకున్నట్టు ఆమె ఫీలవుతోంది.

 

    మధ్నాహ్నం భోజనం కూడా తినబుద్ధి కాలేదు విలాసినికి. ఎప్పుడో సంవత్సరం క్రితం..... తన భర్త స్పర్శ తప్ప  మరో మగాడి స్పర్శ ఎరగదు. ఇప్పుడు గోపాలకృష్ణ నుంచి పిలుపు రావడంతో ఒళ్ళంతా వేడెక్కి పోతోంది. జరగబోయే తంతు గురించి తలచుకుంటూ వుంటే తనువంతా మత్తుగా మూల్గుతోంది.

 

    నిజానికి ఆమె తనకు రాబోయే అదృష్టం ఆలోచించడంలేదు. ఇప్పుడు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ పులకించిపోతోంది.

 

    సాయంకాలం నాలుగుగంటల ప్రాంతాన పడకమీద  నుంచి లేచి తయారవడం ప్రారంభించింది. భర్త చనిపోయిన దగ్గర్నుంచి అలంకరణ గురించి అంతగా పట్టించుకోవడం లేదు. చాలారోజుల తరువాత తీరుబడిగా, అంతకంటే శ్రద్ధగా అలంకరించుకోవడం ప్రారంభించింది.

 

    వెంట్రుకలకు లైట్ గా నూనె రాసి జడ వేసుకుంటున్నప్పుడు ఏవో మధుర  సంచలనంతో వేళ్ళు వణికాయి. ముఖానికి పౌడర్ రాసుకుంటున్నప్పుడు ఒళ్ళంతా మూర్ఛనలు పోతున్నట్టు అనిపించింది. నుదుట నల్లబొట్టు పెట్టుకుంటున్నప్పుడు మనసు పట్టు తప్పింది. కళ్ళకి కాటుక రాసుకుంటున్నప్పుడు శరీరం త్రొటు పాటుతో అదిరింది.

 

    ఒంటరిగా గదిలో దూరి తలుపులన్నీ బిడాయించుకుని బ్రా తొడుక్కుంటునప్పుడు వక్షస్థలమంతా పొంగింది. దాంతో బ్రా హుక్ పట్టక చాలాసేపే తంటాలు పడింది. చీర కట్టుకుంటున్నప్పుడు మనసు లగ్నం కాక కుచ్చిళ్ళు సరిగా రాలేదు. ఎంతో బలవంతంమీద చేతులను అదుపులో పెట్టుకుని కుచ్చిళ్ళు పోసుకుంది. కాళ్ళకు గజ్జెలు కట్టుకోవాలనిపించినా అవి ఆ సమయంలో కాన్ సన్ ట్రేషన్ ని దెబ్బతీస్తాయేమోనన్న అనుమానంతో చివరికి ఆ ప్రయత్నాన్ని మానుకుంది.

 

    ఇదంతా పూర్తయ్యేసరికి సాయంకాలం ఆరుగంటలైంది. సూర్యుడుపశ్చిమాన కుంగిపోతున్నాడు.

 

    ఏడుగంటలప్పుడు నరుడు వచ్చి క్యారియన్ తీసుకెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే, అన్నం ముందు కూర్చుని ఏదో తిన్నాననిపించి లేచింది.

 

    కొన్ని అవయవాలు బరువుగా తయారై మొత్తం శరీరమంతా తిమ్మిరిగా వుండడం ఆమె ఉదయం నుంచీ గమనిస్తూనే వుంది. ఇప్పుడు ఆ బరువు మరింతగా ఎక్కువైందనేదే కొత్త విషయం.

 

    ఇక ఒక్కక్షణం ఆలస్యం భరించలేననిపించి మంచంమీద నుంచి ఒక్క ఉదుటున లేచింది.

 

    అమ్మకు చెప్పి వీధిలోకి వచ్చింది.

 

    
                                        *    *    *

 

    వెలుతురు కాలువలా వుంది వీధి. తను అందులో ప్రయాణిస్తున్న పూలపడవలా అనిపించి తనకేసి తనే  చూసుకుంది. ఏదో తెలియని సిగ్గు, కాళ్ళను తడబడేట్టు చేస్తూ వుండగా కొండ దగ్గరికి చేరుకుంది.

 

    పైకెక్కడానికి ప్రిపేర్ అయి రెండు అడుగులు వేసింది.

 

    ఎవరో వెనుకనుంచి తన కళ్ళను మూయడంతో ఠక్కున ఆగింది. ఎప్పుడో చవిచూసిన మగవాడి స్పర్శను ఆమె ఈజీగానే గుర్తుపట్ట గలిగింది. అతను గోపాలకృష్ణేనని స్పష్టంగా తెలిసినా పేరు చెప్పగానే అతని చేతులు తప్పిస్తాడని అనిపించి ఎవరో తెలియనట్లు చేతులంతా నిమురుతూ "ఎవరదీ?" అంది.

 

    అతను చేతులను మరింత బిగించాడు. ఆమెలో ఆ స్పర్శ మహేంద్ర జలాన్ని సృష్టిస్తోంది. రక్తం ఎక్కడెక్కడికో ఉధృతంగా ప్రవహిస్తోంది. శరీరం మీద పూలతో రాస్తున్న అనుభూతి.

 

    "ఎవరూ?" ఈసారి మరింత ఆశ్చర్యాన్ని గొంతులో కలబోసి అడిగింది.

 

    మళ్ళీ జవాబులేదు.

 

    చేతుల పట్టు మరింత బిగుసుకుంది.

 

    ఇక  తప్పదనిపించి "గోపాలకృష్ణ" అంది.

 

    వెంటనే పట్టు సడలింది. గిర్రున వెనక్కి తిరిగి నవ్వుతూ నిలబడింది.

 

    "ఏమిటి విశేషాలు? ఎప్పుడూ పెళ్ళి కాకముందు చూశాను. తిరిగి ఈ మధ్య ఓరోజు చూశాను. చుట్టం చూపుగా వచ్చావేమో అనుకున్నాను. కానీ భర్త చనిపోవడం వల్ల పుట్టింటికి చేరావని కస్తూరి చెప్పింది."

 

    "అవును. అత్తింటికి ఎంత తొందరగా పోయానో అంత త్వరగా ఇంటికి వచ్చేశాను."

 

    "ఏమైంది నీ భర్తకి?"

 

    "పాము కాటుకు చనిపోయాడు."

 

    "అయ్యయ్యో"

 

    ఇద్దరూ కొండ ఎక్కుతున్నారు.

 

    "పామెక్కడ కరిచింది?"

 

    "అదంతా పెద్ద కథ" అని ఓ క్షణం ఆగి "ఎలానూ నేను ఇంతవరకూ ఎవరికీ చెప్పని సంఘటన గురించి చెప్పాలికదూ. మొత్తం అది కూడా కలిపి చెప్పేస్తాను" అంది.

 

    మరోసారి దాని గురించి టైమ్ వేస్టు కావడం ఆమెకు ఇష్టంలేక పోయింది.

 

    "ఊఁ చెప్పు" అన్నాడు.

 

    ఆమె ప్రారంభించింది.

 

    "అదృష్టమో, దురదృష్టమో తెలియదుగానీ మొదటి పెళ్ళి సంబంధమే ఖాయమై పోయింది. పెళ్ళి కొడుకుది రేణిగుంటకు దగ్గరున్న పల్లెటూరు. రైల్వేలో ఏదో చిన్న ఉద్యోగం. ఒక్కడే కొడుకు.

 

    పెళ్ళి జరిగిపోయింది. అత్తవారింటికి వెళ్ళాను. అంతవరకు ఏమీ  తెలియని వ్యక్తితో కలిసి సహజీవనం అంతా కొత్త. భర్త, ఇరుగుపొరుగు, ఊరి జనం అంతా అర్థమయ్యేసరికి అన్నీ బాగానే వున్నాయిగానీ భర్తే బాగా లేడని బోధపడింది.

 

    నా భర్తకు వున్న జబ్బు ఇన్ఫీయారిటీ కాంప్లెక్స్. తనకంటే అందరూ  ఏదో ఒకరకంగా గొప్ప వాళ్ళే ననుకునే మనస్తత్వం. ఇలాంటి జబ్బున్న వాళ్ళు తన కాంప్లెక్సును దాచుకోవడానికి రెండు పద్ధతులు అవలంభిస్తారు. ఒకటి...... తమను  తాము గొప్పగా చిత్రీకరించడం, రెండు- అవతలివాళ్ళు ఎందుకూ పనికిరారని చెప్పడం..... నా భర్తది రెండో పద్ధతి.

 

    ఎవడికైతే ఇన్ఫీయారిటీ కాంప్లెక్స్  వుంటుందో వాడికి భార్యమీద అనుమానం కూడా వుంటుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా  భర్త కాస్తంత తెలివైనవాడు గనుక తనకు అనుమాన పిశాచం వుందని బహాటంగా  చెప్పక, డొంక తిరుగుడుగా నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నించేవాడు. మొదట్లో ఇదంతా నాకు అర్థమయ్యేది కాదు.

 

    ఎవరైనా ఒక మగవాడు ఇంటికి వచ్చిపోతే ఇక నన్ను తీరిగ్గా కూర్చోపెట్టుకుని ఆ వచ్చినవాడు ఎంత దుర్మార్గుడో చెప్పేవాడు. ఇవన్నీ విని అందరి  మీదా ఒక వ్యతిరేకతను ఏర్పరచుకుంటానని, అందువల్ల నేను ఎవరి  పట్లా ఆకర్షితురాలిని కాననీ అతని నమ్మకం. అందుకే ఒక పథకం ప్రకారం అందరిమీదా దాడి ప్రారంభించేవాడు. మా ఎదురింటి ఆనంద్ మీదైతే ఇక చెప్పక్కర్లేదు.

 Previous Page Next Page