Read more!
 Previous Page Next Page 
కాలనాగు పేజి 2

    ఆదిత్య ప్రశ్నకి సంధ్య యిప్పుడూ జవాబు చెప్పలేదు.

    అతను రెట్టించి అడిగాడు

    "దితీ! నువేన్ని పర్యాయాలు ప్రశ్నించినా నా నుండి సమాధానం రాదు. మౌనమే నా జవాబు."

    "ఎప్పటికీ సమాధానం పొందలేనా?"

    నిట్టూర్చింది సంధ్య. "చెబుతాను తప్పక ఎప్పుడో ఒక పత్యాయం అంతా చెబుతాను_"

    "కనీసం మనం ఒకటయ్యే లోగా చెబ్తవా?"

    ఈ ప్రశ్నకీ ఆమె సమాధానం యివ్వలేదు.

    "సంధ్యా! మీ కుటుంబ చరిత్ర అంతా ఒక మిస్టరీలాగా వుంది. ఇక నీ మాటలు మరీ మంత్రాల్లాగా వుంటయి. నాకు యీ రహస్యాన్ని కనుక్కోవాలని లేదు, భేదించాలనీ లేదు. కానీ నా సంధ్య గురించిన రహస్యం నాకు తెలియాలి_"

    "దితీ!" ఆర్తిగా పిలిచింది ఒక కన్నేనగు మరో పాముని బుసకోట్టి పిలిచినట్టుగా పిలిచింది. ణే చెబ్తాను. అంత చెబ్తాను. అంతదాకా అగు_"

    ఉస్సురు మన్నాడు అదిత్య

    ప్రేమించి, మనసారా ఒకర్నొకరు కోరుకుని, ఒక టైపోయి జీవించాలనుకొనే నిర్ణయానికి వచ్చాక, కలసి జీవించాలంటే ఎన్ని అడ్డంకులు? వీటిని గెలవడం ఎలా?

    "అటుచూడు!" పిలిచింది చప్పున

    సంధ్య చూపు వెంట ఆదిత్య చూపులు పరిగెత్తాయి. దూరంగా వాయువేగ మనో వేగాలతో అన్నట్టుగా ఒక మోటార్ బైక్ వస్తోంది.

    దానిపై ఎవరిన్నదీ తెలియలేదు    క్రమంగా అది దగ్గరికి వ్స్తుమ్న్నది    మసక చీకట్లు కమ్ముకునే వేళ వీధి దీపాలు వెలిగేవేళ. జ్ఞానానికి అజ్ఞానానికీ, వెలుగుకి చీకటికి సంకుల సమరం జరిగే వేళ.

    రోడ్డు మీద నడుస్తోన్న జనం ఆ మోటార్ సైకిల్ రాష్  డ్రైవింగ్ కీ ఆ వేగానికి జడిసి పక్కకు తప్పుకుంటున్నారు.
అందరూ వెంట్రుకవాసిలో ప్రామాడం నుంచి బయటపడుతున్నారు. ఒక్కక్షణం అప్రమత్తు లైనా ప్రమాదం జరిగేట్టుగా వుంది.

    సైకిల్ క్రమేపీ దగ్గరవుతున్నది.

    ఇద్దరి గుండెల్లోనూ పాములు పరిగెడుతున్నాయి.

    సైకిల్ దగ్గరగా వచ్చింది.

    చిత్రం_ ఆ సైకిలుని నడుపుతున్నది నాగరాజు. అది చూసి ఇద్దరూ నివ్వెరపోయారు.
    'భయంతో సంధ్య వెన్నెముక గుండా పాము జరజర ప్రాకినట్టయింది. ఆదిత్య నిశ్చేష్టుడై నించున్నాడు మోటార్ సైకిల్ అగగుమ్డా వెళ్ళిపోయింది.

                     
                                                                     2

    ధర్మరాజుగారు ఆర్డీవోగా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగరీత్యా ఎన్ని ఊళ్ళు తిరిగినా అయన మనస్సు స్వంత వూరిమీదే నిలిచింది. దాంతో అయన కొడుకు మాటనీ, భార్యమాటనీ, కుతుల్లా,అల్లుళ్ళ మాటల్ని కాదని స్వగ్రామం వచ్చేశాడు.

    ఆయన పుట్టినప్పుడు ఆ ఊరు కుగ్రామంకంటే మెరుగు కాలంతో పాటు ధర్మరాజు పెద్దవాడయ్యాడు.ఊరూ పెద్దదైంది. అయన కాలేజీలో చేరేసరికి ఆ వూరికి ఎలక్ట్రసిటీ, టెలిపోన్, బస్  సౌకర్యం, వచ్చాయి అంతకముందే వెటర్నరీ హాస్పిటల్ రూరల్  మెడికల్ ఆఫీసర్ వుండే హాస్పిటల్, హైస్కూల్ వచ్చాయి.

    అయన ఉద్యోగంలో చేరేసరికి ఆ వూరు రెవిన్యూ ఫిర్కా అయింది పుట్టిన ఊరు అన్నా అభిమానం, పెట్రుగుతున్న వురు అనే అనందం, ఆ వురి రాజకీయ నాయుకుల పట్టుదల కలసి ధర్మరాజు పట్టుబట్టి ఆ ఊరిని సబ్ తాలూకాని చేసేట్టు చేశాయి.

    ఇప్పుడు ఆ ఊరు ఇండిపెండేండ్ డిప్యూటీ తహసీల్దారు వుండే సబ్ తాలుక అవుతుంది.

    ఇప్పుడా వూళ్ళో ఓ జూనియర్ కాలేజి_ఓ ప్రయివేట్ డిగ్రీ కాలేజి,గర్ల్స్ జూనియర్ కాలేజీ వెలిసాయి.

    వందేళ్ళనాడు నిర్మించిన సార్క్ శోభాయమానంగా తయారైంది యిప్పుడు.

    నాగరికతతో పాటు పెరిగిన సినిమాహళ్ళూ కూడా అ వూరులో చోటు చేసుకున్నాయి.

    అరంధతి రెండోమారు తెచ్చిచ్చిన కాఫీ తాగుతూ హిందూ చదువుతున్నాడు అయన.

    ఫోన్ మ్రోగింది

    పేపర్ పక్కన పట్టేసి కాఫీ త్గుతూనే ఫోనేత్తాడు

    "హలో!"

    "హాలో!" ఆ మాటల వెంట ఏదో ఘాటైన వాసన్.

    "ఎవరు?" అన్నాడు ధర్మరాజు

    "ధర్మరాజూ! నీకు నలుగురు కూతుళ్ళు_ ఒక్కడే కొడుకు. వాడిని ఏమస్సీ చదివించావు. ఎలాక్రానిక్స్ లో వాడు గొప్ప వాడయ్యాడు.  ఫారిన్ పంపించవచ్చు. కాని దేశభక్తితో నువ్వు వాడిని ఇదే రాష్ట్రాలో అట్టి పెట్టావు. వాడికి రేపోమాపో హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది.

    "అయితే ఏమిటి?" అసహనంగా అన్నారాయన. అనవసరమైన విషయాలు సోదిలాగా మాట్లాడే వాళ్ళంటే ఆయనికి బొట్టుగా గిట్టదు.

    ఇప్పుది సమయంలో నీ సుపుత్రుడెం చేస్తున్నాడో తెలుసా?" క్రూరంగా నవ్వూతూ ప్రశ్నించాడు అవతలి నుంచి
 
    "ఏం చేస్తున్నాడు ఈవినింగ్ కదా! శికారుకీ వేల్లివుమ్తాడు అంతే! అవునా?" రెట్టించాడు అయన

    "ఓంతరిగానా?"

    ఆ ప్రశ్నలో హేళన ద్వానిమ్చిమ్ది

    "అవును, ఏం? ప్రెండ్స్ తో కలసి వెళ్ళాడేమో!"

    ఏ ప్రెండ్? గర్ల ప్రెండ్_ బాయ్ ప్రెండ్?"

    బి.పి పెరిగినట్లయింది ధర్మరాజుకి "యూ షటప్ అన్నారు కోపంగా ఫోన్ పెట్టెయ్యబోయారు.

 Previous Page Next Page