Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 114


   

  54. ఆత్మ అనేక రూప దేహములను దాల్చిన రీతి ఈ ఓదనము స్వర్గమందు అనేక రూపములు ధరించుచున్నది. 'కృష్ణరుశతి'ని పవిత్రము చేయుచు, నీ అరుణ వర్ణమును అగ్నియందు హోమించుచున్నాను.

    55. నిన్ను ప్రాగ్దిశకు, అగ్నికి, అధిపతియగు అసితునకు, రక్షించుటకు ధనుస్సు పట్టిన ఆదిత్యునకు అర్పించుచున్నాము. మమ్ము రక్షింపుము. మాకు వార్ధక్యము చూపుము. మృత్యువును నివారించుము. వండిన అన్నముచే మేము ఆనందింతుముగాక.

    56. నిన్ను దక్షిణ దిశకు, ఇంద్రునకు, అధిపతి తిరశ్చిరాజునకు, రక్షించుటకు ధనుస్సు పట్టిన యమునకు అర్పించుచున్నాము.

    (ఏతం పరిదద్మస్తం) నోగోపయతాస్మాకమైతోః |
    దిష్టంనో అత్ర జరసే నినే షజ్జరా మృత్యవే
    పరిణో దదాత్వథ పక్వేన సహ సంభవేమ ||


    మమ్ము రక్షింపుము. మాకు వార్ధక్యము చూపుము. మృత్యువును నివారించుము. వండిన అన్నముచే ఆనందింతుముగాక.

    57. నిన్ను పశ్చిమ దిశకు, వరుణునకు, అధిపతి పృదాకునకు, బాణ రూప అన్నమునకు అర్పించుచున్నాము.

    "ఏతం పరి ........"

    58. నిన్ను ఉత్తర దిశకు, సోమునకు, అధిపతి స్వజునకు, రక్షించుటకు ధనుస్సు పట్టిన అశనికి అర్పించుచున్నాము.

    "ఏతం పరి........"

    59. నిన్ను ధ్రువ దిశకు, విష్ణువునకు, అధిపతి కల్మాషగ్రీవునకు, రక్షించుటకు ధనుస్సు పట్టిన ఓషధులకు అర్పించుచున్నాము.

    "ఏతం పరి......."

    60. నిన్ను ఊర్థ్వ దిశకు, బృహస్పతికి, అధిపతి శివత్రునకు, రక్షించుటకు ధనుస్సు పట్టిన వర్షమునకు అర్పించుచున్నాము.


                                  నాలుగవ అనువాకము

                                      మొదటి సూక్తము - 4

    వశా విషయకం సూక్తమ్ ఏతత్ | వశా గౌర్యా గర్భం నగృహ్ణాతి - ఇది వశా విషయిక సూక్తము. గర్భము ధరించని గోవు 'వశ' యగుచున్నది.

    1. యాచించు బ్రాహ్మణునితో "దదామి - ఇచ్చుచున్నాను" అనవలెను.

    బ్రాహ్మణుడు యజమానిని 'ప్రజావంతుని' అపత్యావంతునిగ, దీవించునది.

    2. ఆర్షేయులగు యాచకులకు గోవును దానము చేయునివాడు తన ప్రజను, పశువులను అమ్ముకొనువాడు అగుచున్నాడు.

    3. వశ యొక్క 'కూటము' వలన దానము చేయనివాని పదార్థములు విశీర్ణములగుచున్నవి. శ్లోణము వలన అదాత 'కాటము' పీడితమగుచున్నది. 'ఒణ్డ' వలన అతని ఇండ్లు తగలబడుచున్నవి- 'కాణము' వలన ధనము దూరమగుచున్నది.

    4. వశయొక్క అధిష్ఠానము వలన గోపతికి 'విలోహిత శక్న' సంవిద్య లభించుచున్నది. ఏలనన వశ దుర్దిమ్న అనబడుచున్నది.

    5. దీని పాదముల వలన గోపతికి విక్లందినాయక విపత్తు కలుగుచున్నది. ముఖమును వాసన చూసినపుడు అప్రసిద్ధుడై అతని పదార్థములు విశీర్ణములు అగుచున్నవి.

    6. దీని కర్ణములను ఆప్రవణము చేసినవాడు దేవతల నుంచి తెగిపోవుచున్నాడు. లక్ష్మ చేయుచున్నట్లు భావించువాడు కనిష్ఠుడు అగుచున్నాడు.

    7. ఏదేని భోగము కొరకు దీని వెంట్రుకలు కత్తిరించిన వాని పుత్రులు చచ్చుచున్నారు. దూడలను తోడేలు తినుచున్నది.

    8. గోపతి సమక్షమున కాకి దాని లోమమును అవమానించినచో అతని కుమారులు మరణించుచున్నారు. 'అనామన'మున యక్ష్మ రోగము గలుగుచున్నది.

    9. దీని 'పల్చూలన' పేడను దాసి పారవేసినచో ఆ పాపము నుండి అతనికి నిష్కృతి లేకుండును. అతడు కురూపి అగుచున్నాడు.

    10. వశ దేవ, బ్రాహ్మణుల కొరకే పుట్టుచున్నది. కావున దానిని బ్రాహ్మణులకు దానము చేయుటయే అతని రక్షా కవచము అగుచున్నదని పెద్దలు చెప్పుచున్నారు.

    11. దీనిని సేవించువారలకు, దీనిని పరమ ప్రియముగా భావించువారలకు ఇది 'బ్రహ్మజ్యా' అగుచున్నదని పండితులు వచించుచున్నారు.

    12. ఆర్షేయ యాచకులకు దేవగోవును ఇవ్వనన్నవాడు దేవ బ్రాహ్మణ కోపమున ఛిన్నాభిన్నమగుచున్నాడు.

    13. వశా భోగిని వదిలి అది మరొకరి వద్దకు పోవలెను. వశను ఒకడు అడిగినపుడు ఇవ్వకున్నచో ఇవ్వని వానిని వశ సంహరించుచున్నది.

    14. వశ బ్రాహ్మణునకు అక్షయ పాత్రయగుచున్నది. వశ తన ఇష్టము వచ్చిన ఇంటికి పోవును. అప్పుడు బ్రాహ్మణుడు అభిముఖుడై యాచించుచున్నాడు.

    15. వశకు అభిముఖముగ పోవు బ్రాహ్మణుడు ధనమునకు ఎదురుగా పోవువాడు అగుచున్నాడు. దీనికి ఆటంకము కలిగించువాడు తనకే హాని కలిగించుకొనుచున్నాడు.

    16. నారదా! ఈ గోవును అవిజ్ఞాత అగదముగా భావించి మూడు సంవత్సరములు పోషించునది. తదుపరి దానిని వశయని ఎరిగి బ్రాహ్మణుని కొరకు అన్వేషించునది.

    17. వశ దేవతలకు పళ్లెము వంటిది. దానిని 'అవశ' అన్న వానిపై భవ, శర్వులు తమ పరాక్రమము చూపి వానిపై శరములు వేయుచున్నారు.

    18. వశ యొక్క స్తనములను, నూపురమును ఎరుగక దానము చేయుచున్న వానికి వశ ఆ రెంటితో ఫలములు కలిగించుచున్నది.

    19. యాచించినంత వశను దానము చేయనివానికి మహా దుర్దశ కలుగుచున్నది. దానిని తన వద్దనే ఉంచుకున్న వాని కార్యములు సఫలము కాకున్నవి.

    20. దేవతలు బ్రాహ్మణ రూపమున యాచించుచున్నారు. వారికి ఇవ్వనివాడు అందరి క్రోధమునకు పాత్రుడు అగుచున్నాడు.

    21. బ్రాహ్మణులకు వశను ఇవ్వని వాడు దేవతలకు వారి భాగధేయము ఇవ్వని వాడగుచున్నాడు. అతడు పశువుల క్రోధపాత్రుడు అగుచున్నాడు.

    22. వందమంది బ్రాహ్మణులు వశను యాచించినను వశ విద్వాంసునిదే అగుచున్నదని దేవతలు వచించుచున్నారు.

    23. వశను విద్వాంసునకు ఇవ్వక మరొకరికి ఇచ్చిన వానికి దేవతల సహితముగ భూమి దుర్గమము అగుచున్నది.

 Previous Page Next Page