Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 4

   అసహ్యమంతా వుట్టిపడేట్టు అంది "చీ!చీ! ఏమిటి చండాలం మాటలు, ఏమిలేదండి తల నొప్పిగా వుంది . అంతే"
    "మరి ........" మాధవవేపు చూసింది రమాదేవి.
    "మనం వెడదాం పదండి"కచ్చగా అన్నాడు మాధవ్.
    ఇంకేమి ప్రశ్నించకుండా కనీసం శ్రీదేవితో నయినా చెప్పకుండా వెళ్లి రిక్షాలో కూర్చుందిరమాదేవి.
    సైకిల్ ని తీసుకునిరాబోతున్న మాధవ్ ని చూసి ఎందుకండి మళ్ళీ సైకిల్ అదో బరువు- ఎటూ మీ ఆవిడ రావటంలేదు- కలసి ఒకే రిక్షాలో నేనేడదాంరండి " అంది.
    ఓ క్షణం పాటు నీవెరపోయి బిక్క చచ్చిపోతూ సైకిల్ని యింట్లో పడేసి రిక్షాలో వెళ్ళి కూర్చున్నాడు యిబ్బందిగా.
    రిక్షా కదిలేముందు శ్రీదేవి వేపు కచ్చుగా చూశాడు మాధవ్.
    రిక్షా కదిలిపోయింది.
    అంత వరకూ అయోమయంగా చూస్తూ నిలుచున్న శ్రీదేవి కోపంగా తలుపు మూసుకుని వచ్చే ఏడుపు నిగ్రహించుకోలేక వెళ్లి మంచం పై వాలిపోయింది. "చేతులారా రిక్షాలో ఆమె ప్రక్కని కూచోబెట్టి కళ్లారా చూస్తూసాగనం పాక యిహ యిప్పుడెం చేసి ఏం లాభం" మనుకుంటు."

                                                                  2
    సినిమా వదిలేసరికి పది దాటింది. ఒకే రిక్షాలో ఆవిడతో కలిసి రాలేక అటునుంచి ఆటే ఆవిడని మరో రిక్షాలో యింటికి వచ్చేశాడు మాధవ్.
    ఇల్లు సమీపించే కొద్ది అతని మనస్సు బలహీనం కాసాగింది. సాయంత్రం ఆ సన్నివేశంలో శ్రీదేవిని అలా వదిలేసి రమాదేవి వెంట సినిమాకి వెళ్ళటం అతనికి తాత్కాలికంగా బాగే ననిపించినా కాలం గడిచే కొద్ది తనేదో తొందరపడి పెద్ద తప్పు చేసినట్టుగా భావించసాగాడు.
    సినిమాలో కూర్చున్నాఅతనికి మనశ్శాంతే లేకపోయింది. సాస్థ్యం చిక్కులేదు. సినిమా ఏదో చూశాననిపించి వచ్చేశాడు. మధ్య మధ్య రమాదేవి ఏదో సంనివీశాల్ని మెచ్చుకుంటూ అతన్ని పలకరించినా ఏదో ఫార్మల్ గా సమాధానం యిచ్చాడే కాని యింట్రెస్ట్ చూపలేకపోయాడు.
    చివరికి ఓ సారి ఆవిడ అడగనే అడిగింది. "ఏమిటండి ఏదో పరధ్యానంగా వున్నారే" అని, డానికి ఏదో అంటి అంటనట్టు సమాధానం చెప్పేడు మళ్ళీ ఆవిడ రెట్టించలేదు.
    తను శ్రీదేవికి ఏదో అన్యాయం చేశాననే భావన బాగా గాడంగా నాటుకుని పోయింది అతన్లో. తన తప్పు ఏదో స్పష్టంగా ఎదురుగా కనిపిస్తున్నట్లు తనదోషం అంతై యింతై పెరిగిపోతున్నట్టు భ్రమింపసాగాడు అతను.
    భార్యకి అన్యాయం చేసినరాయి ఆడదాని వెంటపడి తిరిగే జులాయి వెధవగా తనని ఆ వీధిలో వాళ్ళంతా అనుకుంటున్నట్టుగా అతనికి పదే తోచసాగింది.
    భార్య తెలియక తప్పుచేసినా భర్త సర్ధుకుని పోతేనే సంసార చక్రం చక్కగా తిరుగుతుంది. కానీ భర్తో వేపు భార్యో వేపు లాగితే ఆ సంసారం నవుల పాలౌతుందనే పాలసి అతనిది. అందుకేవేదన మరీ ఉదృతం అయింది.
    ఆందోళన చెందే మనస్సుతో యింటి ముందు రిక్షా ఆపి ఆగక ముందే దూకేసి రిక్షా వాడికి డబ్బు యిచ్చేసి గబగబా యింట్లోకి వెళ్ళాడు గేటుమూసేస్తూ.
    అతను యింట్లోకి వెళ్ళేసరికి యింట్లో చాలామటుకు  శూన్య వాతావరణము అంధకారము కనిపించింది.
    ఓ గదిలో ట్రాన్స్ఫార్మర్ మరో గదిలో జీరో వాల్దులు బల్బు తప్ప యింట్లో దిపాలెం వెలగటంలేదు.
    హల్లో బార్ లైట్ ని వెలిగించి, ఇల్లంతా ఒక్కసారిగా వెలుతురూ పరుచుకోవటంతో కళ్ళు చిట్లించి చూశాడు కొద్దిసేపు.
    ఎవరూ కనిపించలేదు.
    హాలు దాటి వంటింటి వద్దకి వెళ్ళి చూసి లైటు వేశాడు. ఒక్క చీకటి తొలగటం తప్ప అక్కడ మరే ప్రయోజనమూ కనిపింఛలేదతనికి. గిన్నెలన్ని మూతలు పెట్టబడి వున్నాయ్. భోజనం చేసిన జాడ కనిపించలేదు. సిచ్ ఆఫ్ చేసి వెళ్ళాడు.
    గదిముందు ఓ క్షణం ఆగి గదిలోకి వెళ్లాడు, ట్రాన్ఫార్మర్ నీలంగా వెలుగుతుంది.
    పట్టి మంచం పై అటుతిరిగి పడుకుని వుంది శ్రీదేవి. ఆమె కనిపిస్తూనే అనుకోకుండా నిట్టూర్చాడు!
    లైటు వెలిగించి, దగ్గరగా వెళ్లి పిలిచాడు.
    "శ్రీదూ"
    జవాబు రాలేదు.
    "శ్రీ"
    పలకలేదు ఆమె.
    మంచంపై కూర్చుని వీపుపై చేయి వేశాడు, ప్రేమగా నిమిరి మళ్ళీ పిలిచాడు "శ్రీధూ" అని.
    ఆమె ఉలకలేదు, పలకలేదు.
    మెల్లగా వంగి ఆమె ముఖాన్ని తనవేపు తిప్పుకోయత్నించాడు. విదిలించుకోబోయింది. అయినా బలవంతంగా తన వేపు తిప్పుకుని మళ్ళీ పిలిచాడు. పలకలేదు.
    తనకి అభిముఖంగా ఆమెని తిప్పుకుని పిలిచాడు ఆప్యాయంగా.
    అయినా మూసిన కన్ను తెరవలేదు. పెదం విప్పలేదు. కానీ వూపిరి బలంగా వదుల్తోంది. చెక్కిళ్ళు రంగు తెచ్చుకుంటున్నాయ్.
    దాదాపు ముఖం పై వాలి అన్నాడు క్షమాపణ పూరకంగా "నన్ను మన్నించు శ్రీ......నాకు ఆవేశం ఎక్కువ, నీకు పట్టుదల ఎక్కువ"
    అతని మాటలు వినిపించుకోనట్లుగా అతని బంధంలోంచి విడిపించుకుని లేచి కూర్చుంది.

    ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకో యత్నిస్తూ అన్నాడు! మళ్ళీ "ఆవిడ రమాదేవి అని మా ఆఫీసులో టైపిస్ట్. మేనేజర్ గారి బంధువు. కొత్తగా చేరింది ఆఫీసులో, అడుగక అడుగక అడిగింది గదా అని సరే అన్నాను మాడేస్టికి, జలగలా తగులుకునివచ్చింది.నా యిబ్బంది నీకు చెప్పక పోవటం నా తప్పే. నికిష్టమయిన సినిమా అందునా నీ అభిమాన నటుడి సినిమా కదా పిలుస్తూనే వచ్చేస్తావని తర్వాత చెప్పొచ్చని అనుకున్నాను, కానీ నీవు నాతో పంతం వేసుకుని వాదన వేసుకుని కూర్చున్నావు. అప్పుడే ఆమె......."

 Previous Page Next Page