Previous Page Next Page 
జనవరి 5 పేజి 38

  

      మతాల పోట్లాటలు.....
   
    ఎంత హీనమైన స్థితిలో, మరెంత అటవిక దశలో యిరుక్కుపోయి వుంది మన జాతిప్రజ?
   
    చదువు, సంధ్యా లేని మాత్రులు, తత్ సంబంధ పరిజ్ఞానంలేని కార్పొరేషన్ చైర్మన్లు, కేవలం బుక్కిష్ నాలెడ్జితో పాసయ్యే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఆఫీసర్స్, వీళ్ళు-వీళ్ళంతా దేశాన్ని బాగుచేయగలరా? ప్రగతి పథం వేపు నడిపించగలరా?
   
    బాధ్యతల్ని మరచి,అధికారాన్ని ఎంజాయ్ చేసే వీళ్ళు, నథింగ్ బట్ క్లర్క్....!
   
    వీళ్ళ మూలంగా దేశం కొత్తపుంతలు తొక్కదు. గానుగెద్దుల్లా చట్టపు యిరుసుల్లో యిరుక్కుపోయే వీళ్ళ మూలంగా ఈ దేశం బాగుపడుతుందా?
   
    ఆఫ్ట్రాల్  చిన్న క్లర్క్ పోస్ట్ కి క్వాలిఫికేషన్స్ అడిగి, అడ్డమైన వ్రాత పరీక్షల్ని, ఇంటర్వ్యూల్ని నిర్వహించేటప్పుడు కీలక పదవుల్లో, జాతికి దారి చూపగల స్థానాల్లో కూర్చునే వ్యక్తులకు అర్హతలు అక్కర్లేదా?
   
    ఓటర్స్ లిస్ట్ లో పేరుంటే చాలు ఎలక్షన్స్ లో నిలబడవచ్చా? ఖర్మ కాలి గెలిస్తే మంత్రి పదవా?
   
    ఎంత దయనీయమైన స్థితిలో ఉంది ఈ భారతం?
   
    నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. దాంతో మీకు మన దేశ ఆర్ధిక ప్రగతి ఎలాంటి మందభాగ్యుల కబంధహస్తాల్లో యిరుక్కుపోయిందో తెలుస్తుంది.
   
    "జపాన్ లో ఒక స్టీల్ కంపెనీ ఐరన్ ఓర్ కోసం కొన్ని నౌకల్ని విశాఖపట్నం పంపి దిగుమతి చేసుకుంటుంది.
   
    అలాగే నాణ్యతగల బొగ్గు కోసం మరికొన్ని నౌకల్ని ఆస్ట్రేలియా పంపించి దిగుమతి చేసుకుంటుంది.
   
    ఇది చాలా కాలంగా జరుగుతోంది.
   
    ఓసారి ఓ ఇండియన్ ఇండస్ట్రీస్ మినిస్టర్ తన డిపార్ట్ మెంట్ అధికారులతో జపాన్ ఇండస్ట్రియల్ టూర్ మీద వెళ్ళటం జరిగింది.
   
    నాన్ కమ్యూనిస్ట్ వరల్డ్ లో వరల్డ్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ జపాన్ లో వుంది. టోక్యోలో వున్న నిప్సన్ స్టీల్ కంపెనీ సంవత్సరానికి 26.27 మిలియన్ టన్స్ స్టీల్ ని వుత్పత్తి చేస్తుంది.
   
    ది పుకుమాయా వర్క్స్ ఆఫ్ నిప్సన్ కొకాన్ అనే కంపెనీ 16 లక్షల టన్స్ స్టీల్ ని ఉత్పత్తి చేస్తుంది. అందులో 76వేల మంది పనిచేస్తుంటారు.
   
    మనదేశంలో ఉన్న స్టీల్ కంపెనీలన్నీ కలిపినా ఆ రెండు కంపెనీలు ఉత్పత్తి చేసినంత స్టీల్ ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.
   
    అదలా వుంచితే నిప్సన్ స్టీల్ కంపెనీ ఇంజనీర్స్ ఓ కొత్త పథకాన్ని తయారుచేశారు. తమ కంపెనీ షిప్స్ జపాన్ నుంచి బయలుదేరి ఇండియా (విశాఖపట్నం) వెళ్ళి, అక్కడనుండి ఆస్ట్రేలియా వెళ్ళి ముడిసరుకును తీసుకు రావడంతో విపరీతమైన జాప్యం జరుగుతుందని గ్రహించి, వృధా అవుతున్న తమ నౌకల కాలాన్ని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించే ఆ పథకాన్ని తయారు చేశారు.
   
    అలాంటి ఐడియాలు జపనీస్ కి ఎలా వస్తాయని ప్రపంచం, ప్రజ విస్తుపోయింది.
   
    వారి పథకం ఏమిటంటే షిప్ లోనే మినీ ప్లాంట్ ని నిర్మించడం. అది విశాఖపట్నం వెళ్ళి ఐరన్ ఓర్ ని నింపుకుంటుంది. అక్కడి నుండి ఆస్ట్రేలియాలో బొగ్గును లోడ్ చేసుకుని తిరిగి బయలుదేరుతుంది. అక్కడి నుంచే స్టీల్ తయారీ ప్రారంభమవుతుంది. ఆ షిప్ జపాన్ వచ్చి ఉత్పత్తి అయిన స్టీల్ ని అప్ లోడ్ చేస్తుంది.
   
    ఒక్కోసారి మార్గ మద్యంలోనే షిప్స్ లోని మినీ స్టీల్ ప్లాంట్స్ లో ఉత్పత్తి అయిన స్టీల్ ని మలేషియా మక్కావ్, థాయ్ లాండ్, హాంకాంగ్ దేశాలకు అమ్మి వ్యాపారం చేసుకుంటుంది.
   
    సముద్రం మీద తేలియాడే ఫ్యాక్టరీలు....
   
    నౌకలే కర్మాగారాలు.....బిజినెస్ ఇన్ ది సీ....
   
    ఎంత అద్భుతమైన ప్రయోగం?!
   
    ఒక దేశం నుండి ఐరన్ ఓర్, మరో దేశం నుంచి బొగ్గు, ప్రయాణంలో ఉత్పత్తి మార్గమధ్యంలో తారసపడే దేశాలతో మార్కెటింగ్....
   
    విమల్, మేఖల జపనీస్ తెలివితేటల్ని తలుచుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. అనే స్లోగన్ వాళ్ళకు నిత్య పారాయణమేమో!! ఫెంటాబ్యులస్ జీనియస్ లు.
   
    "కేవలం మనకు 6,651 కిలోమీటర్ల ఎయిర్ డిస్టెన్స్ లో వున్న జపాన్ సాధించిన ఘన విజయం అది. ఇదే విషయాన్ని ఇండియా నుంచి జపాన్ వెళ్ళిన ఇండియన్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కి చెబితే ఫక్కున నవ్వాడట. అదంతా ఒక భ్రమ. ఒక కల అని తేలిగ్గా తీసిపారేశాడట. ఆయనతో వెళ్ళిన అధికారులు మంత్రి మంద భాగ్యానికి తలలు పట్టుకున్నారట. ఇదేదో కాశీమజిలీ కథలా, అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా వుందని అందర్నీ హేళన చేస్తూ, మందు తాగడంలో మునిగిపోయాడట.
   
    ఆయనతో వెళ్ళిన అధికారులంతా జపాన్ లోని పరిశ్రమల్ని స్టడీ చేస్తూ తిరుగుతుంటే మన మంత్రి వర్యులు మాత్రం మందు కొట్టి మత్తుగా పడుకుండిపోయారట. ఆఖరిలో ఇండియా వచ్చేముందు తన కుటుంబ సభ్యులకు రెండు లక్షలకు సరిపడ జపాన్ మేడ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ షాపింగ్ చేసుకునేందుకు మాత్రం బయటకు వెళ్ళాడట. చిన్న పిల్లల్లా క్రేజీగా సాప్స్ వెంట తిరుగుతూ, తన కొడుకులకు, కూతుర్లకు, మనవళ్ళకు, రడీమేడ్ బట్టలు కొంటూ బేరం చేశాడట. ఒక్క డాలర్ రేటు తగ్గించమని ఒక రెడీమేడ్ డ్రస్ షాప్ లో బేరం చేశాడట. వాళ్ళు ఒప్పుకోక పోవడంతో తాను భారతదేశంలో కేబినేట్ రేంక్ చేశాడట. వాళ్ళు ఒప్పుకోక పోవడంతో తాను భారతదేశంలో కేబినెట్ రేంక్ మినిస్టర్ నని చెప్పి దాన్ని రుజువు చేసే ఐడెంటిటీ కార్డుని తీసి చూపించాడట.
   
    అప్పుడా షాప్ యజమాని పగలబడి నవ్వాడట.
   
    మన మంత్రి వేపు చీత్కారంగా చూశాడట.
   
    కొన్ని లక్షలు ఖర్చుపెట్టి నీ దేశ ప్రజలు నిన్ను పరిశ్రమల్ని స్టడీ చేయమని మా దేశం పంపిస్తే, మీరిలా చీప్ గా షాప్స్ వెంట తిరుగుతూ కాలాన్ని వృధా చేస్తున్నారే?
   
    ఎలా మిమ్మల్ని మంత్రిగా చేశారయ్యా మీ దేశ ప్రజలు అని అడిగితే మన మంత్రిశేఖరుల మొఖం కత్తివెతుకు నెత్తురుచుక్క లేనంతగా పాలిపోయిందట.
   
    ఆయన వెంటవచ్చిన సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారులు సిగ్గుతో తలలు వంచుకున్నారట.
   
    ఆ మంత్రికి ఇంగ్లీషు రాదు.
   
    జపాన్ వెళ్ళవలసి వస్తుందని ఆయనకు ఆరునెలల ముందే తెలుసు. ఓ రోజు ఓ అధికారి వచ్చి మీరు ఆరునెలల్లో జపాన్ వెళ్ళవలసి వుంది. అందుకుగాను కొన్ని జపాన్ మాటలు నేర్పేందుకు నేను వచ్చాను. అక్కడ జపాన్ అధికారుల్ని, వ్యాపార వేత్తల్ని మంచి చేసుకునేందుకు మీరు కొంత జపాన్ భాష నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? ఎప్పుడు టైమిస్తారు మీకు నేర్పేందుకు అని అడిగితే....ఆయన చిరాకుపడ్డారట. కనీసం మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా వుంది.
   
    మీ దేశం రావటం మాకు గొప్ప అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుంది. మా దేశ ప్రజలందరి తరపున మీకు మా అభినందనలు. మాదేశానికి మీ సహకారం కావాలి అనే వాక్యాలైనా జపనీస్ భాషలో అనగలిగితే దేశ భక్తి పరులైన జపాన్ దేశస్తులు ఎంతో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేవారు.
   
    పాపం ఈ మంత్రిగారికి అటు ఆంగ్లమూ రాదు. ఇటు జపాన్ భాషా నేర్చుకోలేదు.
   
    ఇలాంటి మందభాగ్యులైన మంత్రుల మూలంగా దేశానికి మేలు జరుగుతుందా?
   
    ఆ తరువాత ఆ మంత్రి టోక్యో ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ ఎక్కుతుంటే ఆయన వెనుక బయలుదేరిన లగేజీని చూసి ఎయిర్ పోర్టు అధికారులు ఖిన్నులయ్యారట. ఫ్లయిట్ బయలుదేరాక ఆయన అడిగిన మొదటి మాటేమిటో తెలుసా? నేను కొన్న వస్తువులన్నీ ఫ్లయిట్ లోకి వచ్చాయా అని.....
   
    రెండో మాటేమిటో తెలుసా?
   
    ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే ఆ లగేజీ అంతా మంత్రిగారిదని చెప్పి కస్టమ్స్ డ్యూటీ లేకుండా చేయండని.
   
    మూడో మాటేమిటో తెలుసా?
   
    అవునూ-ఇంతకీ నేను ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలిసే రిపోర్టర్స్ కి జపాన్ లో నేను ఏం చేశానని చెప్పాలి? అని.
   
    హతోస్మి.....! హరి.....హరి.....రామ.....రామ.... అంటూ ఎన్ని పదాలు ఉచ్చరిస్తూ వాపోవాలి!
   
    మరికొన్నాళ్ళకు ఒక అంతర్జాతీయ పత్రికను బొమ్మలు బావున్నాయని ఆ మంత్రి తాపీగా తిరగేస్తుంటే నౌకలే మినీ స్టీల్ ప్లాంట్స్ అనే ఆర్టికల్ ఛాయా చిత్రాలతో కనిపించిందట.
   
    అప్పుడన్నాడట ఆ మంత్రి "హమ్మా.....లంబ్డీ కొడకల్లారా....? మీకెన్ని తెలివితేటలురా.....?!?" అని.

 Previous Page Next Page