Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 35



    ఆమె అలా తన వేలు నోట్లో పెట్టుకుని రక్తం పీలుస్తూ వుంటే రిషికి ఒళ్ళు జిల్లుమనడం ప్రారంభించింది. నెమ్మది.... నెమ్మదిగా ఆమె దగ్గరగా జరిగాడు. అయస్కాంతం ఆకర్షణ భరించలేని ఇనపముక్కలా ఆమె గబుక్కున అతని కరుచుకుపోయింది.

    కోరికల తెరచాపల నెత్తి ఆశల తీరంవైపు పయనిద్దాం రా రమ్మని ఆమె వళ్ళు విరుచుకుంటూ ఆహ్వానం పలికింది. ఆ అలల తాకిడికి తట్టుకోలేక నడిసముద్రంలో మునిగిపోతున్నట్లుగా అతను ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆధారంగా అతి బలహీనంగా వున్న ఆమె నడుముని వాటేసుకున్నాడు. బంగారు రంగుతో మెరిసిపోతున్న మేనికి జిలుగుపనిలా వున్న నాభిని చూసి సుడిగుండంలోపడి గిరికీలు కొడుతున్నట్లు ముద్దులతో ముంచెత్తాడు. నెమ్మదిగా తల ఎత్తి ఆ మహోన్నతాలని చూసి రెప్పవాల్చక అలాగే ఉండిపోయాడు. సన్నని లేనడుము పైన పొంగులకూ, క్రింది బరువులకూ తాళలేనట్లు కలవరపడింది. సరయిన సరంగులేక మునిగిపోతున్న నావని, తీరం చేర్చే బాధ్యత నీదే అన్నట్లు అతనిని తన ఎదకు హత్తుకుంది ఆమె.

    కోరికల కళ్ళెం విప్పి ఆమె జిలుగుపైట జీనుని తప్పించి పొగరుబోతు గుర్రాన్ని స్వారీ చెయ్య సిద్ధమైన వీరుడిలా అతను ముందుకి జరిగాడు.

                                                                *    *    *    *

    లింగం సిగరెట్ అంటించుకుని తాపీగా పొగపీల్చి వదుల్తుండగా ఎవరో భుజంమీద చెయ్యివేసారు. లింగం వెంటనే సిగరెట్ తిని వెనకాల దాచేస్తూ "సార్" అన్నాడు.

    "నేను సాబ్" అన్నాడు వాచ్ మెన్.

    లింగం విసుగ్గా "చంపావు కదరా. అయ్యగారనుకున్నాను. ఏవిటీ?" అన్నాడు.

    "అయ్యగారు ఊళ్ళో లేరుగా. లోపం ఏమౌతోంది సాబ్?" అని అడిగాడు.

    లింగం సిగరెట్ నోట్లో పెట్టుకుని ముసిముసిగా నవ్వుతూ "ఏక్సిడెంట్" అన్నాడు.

    "ఫైర్ ఏక్సిడెంట్ నా సాబ్?" అడిగాడు కంగారుగా వాచ్ మెన్. లింగం మనసులో నవ్వుకుని
"అలాంటిదే" అన్నాడు.

    "ప్రమాదం ఏం లేదు కదా" భయంగా అడిగాడు వాచ్ మెన్.

    "ప్రమాదమా?" అంటూ నవ్వబోతున్న లింగం నోరు అలాగే బిగుసుకుపోయింది. కళ్ళు భయంతో పెద్దవయిపోయాయి. "చచ్చాం!" అన్నాడు.

    "ఏమైంది సాబ్?" వాచ్ మెన్ కూడా కంగారు పడ్డాడు. లింగం భయంగానే గేటువైపు చూపించాడు.

    లోకనాధం తాపీగా నడుచుకుంటూ గేట్లోంచి లోనికి వస్తున్నాడు.

    లింగం కీచుగా "లోపల అమ్మాయిగార్నీ ఆ అబ్బాయినీ ఆ పరిస్థితుల్లో ఈయనగారు కానీ చూస్తే ఇంకేమయినా వుందా?" అంటూ గుండెలు బాదుకున్నాడు.

    "ఆ అబ్బాయిని" అంటున్న వాచ్ మెన్ నోరు మూసి "ఇదిగో యీ పదిరూపాయలూ తీసుకో. ఆ అబ్బాయి సంగతి ఎత్తకు" అన్నాడు లింగం.

    లోకనాధం మెట్లదగ్గరికి వచ్చి "ఏంట్రా కరెంట్ షాక్ తిన్నవాడిలా ఆ వాలకం?" అన్నాడు.

    లోకనాధం తడబడుతూ "మీరు .... మీరు.... ఇప్పుడేనా రావడం?" అన్నాడు.

    "అబ్బే! ప్రొద్దుటే వచ్చి గేటు బయటున్న చెత్తకుండీలో రెస్టు తీసుకున్నా" అన్నాడు లోకనాధం.

    "చిత్తం .... నేనూ అదే అనుకున్నాను" అన్నాడు కంగారుగా లింగం.

    "ఏమిటీ?" కయ్యమన్నాడు లోకనాధం. "ఒరే రాంసింగ్ ఈడికి నేను లేనప్పుడు పిచ్చి కుక్కేదన్నా కరిచిందేట్రా?" అని అడిగాడు.

    "లేదండీ. ఊరికే జోకేశాను అంతే" అంటూ రాని నవ్వు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు లింగం.

    "నీ జోకులు తగలడా! కళ్ళారా మనిషి గేట్లోంచి రావడం చూస్తూ కూడా ఏంట్రా ఆ ప్రశ్న?" విసుక్కున్నాడు లోకనాధం.

    లింగం మనసంతా వ్యాకులంగా వుంది. లోపల ఆశ్రితా, రిషిలు ప్రణయసాగరంలో మునిగి తేలుతున్నారన్న విషయం అతనికి తెలుసు. ఆ దృశ్యం చూస్తే లోకనాధం అగ్గిమీద గుగ్గిలమైపోతాడనీ, కోపం వస్తే అతనంత కర్కోటకుడు యింకోడు వుండడని కూడా అతనికి తెలుసు.

    "అయ్యగారూ, ఆ రైసుమిల్లులో ఏదో గొడవగా వుందట. ఓసారి వెళ్ళొద్దామా?" అడిగాడు లోకనాధానికి అడ్డంపడ్తూ లింగం.

    "వీడెవడ్రా బాబూ! ఇంతసేపు రైల్లో ప్రయాణం చేసొచ్చినోడిని పట్టుకుని రైసుమిల్లు కెళదాం, ఎగ్జిబిషన్ కి వెళదాం అంటున్నాడు. నేను గొడ్డులా కనిపిస్తున్నాన్రా?" అడిగాడు.

    "చిత్తం" నసిగాడు లింగం.

    "ఆ! గొడ్డులా కనిపిస్తున్నానా?"

    "అబ్బే కాదండీ! రైల్లో ఎక్కి వచ్చారా పాపం?"

    "కాదు. రైలుపట్టాలమీద పాకుతూ వచ్చాను."

    "అది కాదండీ నా ఉద్దేశం"

    "నాకు అర్ధమయింది లేరా! నేను ఇంట్లో లేకపోయేటప్పటికి ఆ పాడు నోరు కట్టుకోలేక అడ్డూ ఆపూ లేకుండా తినేసుంటావు. దాంతో అజీర్తి పట్టుకుని అరగక తన్నుకుంటున్నావు. పోయి కాస్త ఆ పచ్చగడ్డి నములు" లోకనాధం అరుస్తూ లోపలికి పోబోయాడు.

    లింగం కెవ్వుమని కేక వేశాడు.

    లోకనాధం ఆగి లింగంవైపు అనుమానంగా చూస్తూ బాగా ముదిరి పోయినట్టే వుందిరోయ్ యిక లాభంలేదు. లోపలికెళ్ళి పిచ్చి ఆసుపత్రి వాళ్ళకి ఫోన్ చేస్తాను" అన్నాడు.

 Previous Page Next Page