తాత్కాలికంగా భయాన్ని మర్చిపోయి నడకలో వేగం పెంచారంతా.
యువరాజు మాత్రం కపాలేశ్వర్ చెప్పేదాన్ని అన్యమనస్కంగానే వింటూ పరిసరాల్ని అప్రమత్తంగా గమనిస్తూ బృందానికి వెనగ్గా నడుస్తున్నాడు. క్షణంలోనైనా మేనీటర్ వచ్చి ఎటాక్ చేయవచ్చనే అతని ఆందోళన.
అరగంట గడిచింది. యువరాజు ఒకింత ముందు నడుస్తున్నాడు. అందరికంటే వెనుక వైశాలి నడుస్తోంది. మలుపుల దారిలో ఒకరు మలుపు తిరిగితే ఇంకొకరికి కనబడడం లేదు. గులకరాళ్ళమీద విన్పిస్తున్న నడక శబ్దం తన వెనక ఎవరో, నడుస్తున్న చప్పుడు విన్పించేసరికి... వెనక్కి తిరిగి చూసింది వైశాలి చటుక్కున.
అంతే. ఆమె మరి కదలలేదు. గుండెలోంచి బయటకు రాబోయి భయోద్వేగంతో కూడిన కేక గొంతులోనే ఆగిపోయింది.
ముక్కుపుటాలకు తగిలిన ఏదో మత్తువాసనకు వైశాలి కళ్ళు తేల వెయ్యడం, ఆటవికుడి చేతిలో వాలిపోవడం, బొమ్మను ఎత్తుకున్నట్లు వైశాలిని ఎత్తుకుని ఆ ఆటవికుడు దట్టమైన డొంకల్లో కెళ్ళిపోవడం- అన్నీ కొన్ని ఘడియల్లోనే జరిగిపోయాయి.
వెనక ఏ శబ్దమూ విన్పించకపోవడంతో... చటుక్కున వెనక్కి తల తిప్పి చూసిన ఇందుమతి-
వెనగ్గా, నడుస్తున్న ఆ మహాకాయాన్ని వాడి మెడలో వేలాడుతున్న పుర్రెల్ని చూసి-
అరవబోయింది. కానీ వీలుకాలేదు. అప్పటికే ఆమె ముక్కు పుటాలకు సోకిన గాలి-
గమ్మత్తుగా, మత్తులోకి లాక్కుపోయిందామెని. పదినిమిషాలు గడిచాయి.
"మేడమ్... మనమీ కపాలకోనలో- ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యాలి... గుర్తుంచుకోండి..." అంటూ వెనక్కి తిరిగిన కపాలేశ్వర్, వెనక ఇందుమతిగానీ, వైశాలికానీ కనబడకపోవడంతో "రాజూ స్టాప్ దేర్! మేడమ్, వైశాలి కనిపించడం లేదు" అన్నాడు భయంగా. వెంటనే ముందుకెళ్ళిన యువరాజు ముత్యాలనాయుడు వెనక్కొచ్చారు వేగంగా.
"ఏమయ్యారు వీళ్ళిద్దరూ..." అంటూ నాలుగువేపులా చూస్తున్న యువరాజు తుప్పలచాటున ఏదో రాక్షస పాదాల్లాంటి పాదాలు కనబడడంతో కపాలేశ్వర్ కి సంజ్ఞ చేసి భుజమ్మీద రైఫిల్ మీద చెయ్యి వేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.
అప్పటికే వాళ్ళని పదిమంది ఆటవికులు చుట్టుముట్టేశారు. వాళ్ళు మామూలు ట్రైబల్స్ కారు. మామూలు మనుషులకి మూడింతల మనుషుల్లా వున్నారు. విశాలమయిన వక్షస్థలమ్మీద పెద్ద పెద్ద పచ్చబొట్లు... మెడలో పుర్రెల హారాలు, నుదుటన రక్తరేఖలు... నల్లగా మెరుస్తున్న చర్మం.
అందరి చేతుల్లో మంత్రదండాల్లా పొడవాటి ఎముకలు. మరో క్షణంలో వాళ్ళు ముగ్గురు తమ ముక్కుపుటాలకూ తగిలిన మత్తు వాసన వల్ల చైతన్య రహితులైపోయి తమ తమ లగేజీలతో దబ్బున కిందపడి పోయారు.
ఆ ఆటవికులు ఇకిలిస్తూ, సకిలిస్తూ వాళ్ళ భాషలో వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ముగ్గుర్నీ-
మంచాలు తీసికెళ్ళినట్లుగా అడవి లోపలికి తీసుకెళ్ళిపోయారు.
* * * *
వరసగా అటో పది, ఇటో పది గుడిసెలున్నాయి. ఆ గుడిసెలకు కొంచెం దూరంలో పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన పెద్ద ఇళ్ళు. ఆ ఇంటికి ఎడమ భాగంలో రావిచెట్టు, రావిచెట్టు కింద రాతి అరుగు. ఆ అరుగు ముందు పాతిన రాతి గుంజలకు, అడవి తీగలతో కట్టేశారు వైశాలిని, ఇందుమతిని.
ఆ అరుగుకి కొంచెం దూరంలో దేవతా విగ్రహం. ఆ విగ్రహానికి కట్టిన ఎర్రరంగు చీర ఎర్రటి ఎండలో మండుతున్న అగ్నిగుండంలా ఉంది. రాళ్ళతో కట్టిన ఇంటి ముందు అంతెత్తు పెద్ద కర్ర కుర్చీ మీద ఆజానుబాహుడైన వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తికి ఎడమ కాలు సగభాగం మాత్రమే ఉంది. మెడలో పుర్రెల దండ, గుండెలమీద భుజాల మీద పచ్చబొట్లు... నుదుట రక్తరేఖలు, పెద్ద ముక్కు, ముక్కుకి పెద్ద ప్లేటులాంటి ఆరణం, బండ పెదాలు, తమలపాకుల్లా పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్ళతో- రాతిగుంజలకు కట్టిన వైశాలి, ఇందుమతి వేపు చూశాడతను. వాళ్ళింకా మత్తులోంచి లేవలేదు. వాళ్ళిద్దరివేపూ ఒకసారి చూసి తనకు అటూ ఇటూ నుంచున్న ఆడా మగా వ్యక్తులవైపు చూశాడతను. ఆ స్త్రీలకు, పైనుంచి నడుం భాగం వరకూ ఏ ఆచ్చాదనా లేదు. కటి ప్రదేశం దగ్గర మాత్రం రకరకాల ఆకుల్నీ, లతల్నీ చుట్టుకున్నారు. మెడలో దగ్గర మాత్రం రకరకాల ఆకుల్నీ, లతల్నీ చుట్టుకున్నారు. మెడలో పుర్రెల దండ పూలదండలున్నాయి. మగవారి అలంకరణ కూడా అలాగే ఉంది. కానీ వారిలో ప్రత్యేకత మామూలు గిరిజనులకు, మనుషులకు మూడురెట్లు బలంగానూ, దృఢంగానూ ఉండడం!
వాళ్ళ భాష సంస్కృత భాషకు కొంచెం దగ్గరలో వుంది. ఆ గిరిజన నాయకుడి పేరు పగడం దొర! పగడం దొర తల పక్కకు తిప్పి కొంచెం దూరంలో నిల్చున్న స్త్రీవేపు చూశాడు. ఆ స్త్రీ తన చేతిలోనున్న బంగారు పాత్రను దొరకు అందించింది. అది వాళ్ళు మాత్రమే తయారు చేసుకునే మడ్డి కల్లు. ఆ కల్లును తాగేసి, తేన్చి ఆ పాత్రను ఆమెకిచ్చేసి- "ఎవరు వీళ్ళు" అడిగాడు వాళ్ళ భాషలో.
వైశాలిని, ఇందుమతిని అక్కడకు తీసుకొచ్చిన ఆ ఆటవికులు... "శత్రువులు. ఇంకో ముగ్గురు మగ శత్రువుల్ని గుహలో ఉంచాం" చెప్పారు వాళ్ళు.
"మగ శత్రువులు?" పగడం దొర వికటంగా నవ్వి-
"వీళ్ళిక్కడ నుంచి, బయటికెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆడ శత్రువుల వంటికి బట్టలేవిటి... అనాగరికంగా... ఆ దుస్తుల్ని విప్పెయండి. మన పద్ధతిలో బహిరంగ స్నానం చేయించండి... రక్తశుద్ధి చేయించండి. పెళ్ళి కాని మన గిరిజన యువకులందరూ రాత్రికి మన అలంకరణతో సిద్ధంగా ఉండండి... కన్యపూజ జరిపిద్దాం" ఆజ్ఞ జారీచేసి, గిరిజన యువకులవేపు చూసాడు పగడం దొర. పెళ్ళి కాని గిరిజన యువకులు సంతోషంతో కేకలు వేసారు.
"అలాగే... మగశత్రువుల్ని పెళ్ళికాని యువతులందరూ సిద్ధం చెయ్యండి..." ఆ మాట వినగానే యువతులందరూ రొమ్ము మీద చరుచుకుంటూ సంతోషంతో కేకలు వేసారు.
"మగ శత్రువుల్లో... ఒక వ్యక్తి ముసిలాడున్నాడు" చెప్పారెవరో-
"వాణ్ని చెట్టుకి వేలాడదీసి కింద మంట పెట్టండి" చెప్పాడు ఠీవిగా పగడం దొర.
తన మీద భళ్ళున నీళ్ళు పడడంతో కళ్ళిప్పింది వైశాలి. ఇద్దరు గిరిజన స్త్రీలు కుండలతో నీళ్ళు పోస్తున్నారు. వైశాలి కళ్ళిప్పడంతో వాళ్ళు ఆనందంగా గుండెలమీద కొట్టుకుని వైశాలి చీరను గబగబా విప్పేసారు.
ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తోంది... కానీ కుదరడం లేదు. నరనరంలో నిండిపోయిన మత్తు...
అప్పుడు వైశాలి పాలరాతితో చేసిన శిల్పంలా ఉంది. ఇంకొక ఆటవిక స్త్రీ ఒక కుండతో రక్తాన్ని తెచ్చి వైశాలి మీద కుమ్మరించింది. "ఛీ" తుపుక్కున ఉమ్మేసింది వైశాలి.
తమ నాయకుడు అనుభవించే స్త్రీలకు మొదట రక్తస్నానం పేరిట రక్తశుద్ధి చెయ్యడం ఆ తెగ ఆచారం. మొదట వైశాలి దొరికింది కాబట్టి మొదట నాయకుడు వైశాలిని అనుభవిస్తాడు. ఆ తర్వాత రోజుకొక గిరిజన యువకుడు అలాగే... ఇందుమతినైనా... ఇంకో స్త్రీనైనా...
అలాగే...
పురుష శత్రువుల్ని స్త్రీలు కూడా...
అందుకోసమే, మొదట వైశాలిని సిద్ధం చేస్తున్నారు పరమ పవిత్రంగా.
* * * *
కళ్ళిప్పి చూసాడు యువరాజు. తనెక్కడున్నాడో తెలుసుకోడానికి అతనికో అయిదు నిమిషాలు పట్టింది. పక్కకు తిరిగి చూసాడు, కపాలేశ్వర్, ముత్యాల నాయుడు శాపగ్రస్తుల్లా నిద్రపోతున్నారు. ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు యువరాజు.
లేచి కూర్చుని చుట్టూ చూశాడు- దూరంలో గోడ దగ్గర, నిలువెత్తుని అమ్మవారి విగ్రహం... అమ్మవారికి నమస్కరించి, ఆ గుహలోంచి బయటికొచ్చాడు.
ఆ గుహ సరిగ్గా, పగడం దొర నివాసానికి వెనుక భాగంలో వుంది. అందరూ వైశాలికి స్నానం చేయిస్తున్న సంబరంలో ఉన్నారు. పూర్తిగా మత్తు వీడిపోయిన వైశాలి తన చుట్టూ చేరిన వాళ్ళని ఇష్టమొచ్చినట్టుగా ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ తిడుతోంది. ఆ తిట్లకు వాళ్ళు ఆనందిస్తున్నారు.
వైశాలి "యూ బిచ్" అని తిడితే వాళ్ళు కూడా "యూ బిచ్చూ" అని అనుకరిస్తూ వెటకారం చేస్తున్నారు.
ఆ తతంగాన్నంతా చెట్టుచాటు నుంచి గమనిస్తున్న యువరాజు పిస్టల్ని తీసి పట్టుకుని, ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు.
"ఈ సమయంలో మనం ముందుకెళితే మరింత రసాభాస జరుగుతుంది. వీళ్ళే జువాంగులనుకుంటారు" ఆ మాటలకు తల తిప్పాడు యువరాజు. పక్కన నిలబడి ఉన్నాడు కపాలేశ్వర్.
నెమ్మదిగా వెలుతురు మాయమైపోతోంటే- చీకటి, ఉప్పెనలా కమ్ముకొస్తోంది.
స్నాన కార్యక్రమం పూర్తయ్యాక వైశాలిని దేవీ విగ్రహం ముందు మఠం వేసి కూర్చోపెట్టారు.
దేవీ విగ్రహం ముందున్న రాత్రి ప్రమిదలో ఆముదం వేసి, దీపం వెలిగించారు.
వెయ్యి ఓల్టుల బల్బు కాంతి ఉందా వెలుగు... కొంతమంది ఆటవికులు కాగడాలు వెలిగించి పట్టుకున్నారు. దొర ఆనతితో ఆటవిక స్త్రీలు ఇందుమతి వైపు కదిలారు.
అప్పటికే మేల్కొన్న-
ఇందుమతి వైశాలికి జరిగిన తతంగానికి బెదిరిపోయింది. ఆ పరిస్థితి తనకు రాకుండా కాపాడమని ఇలవేల్పుని ప్రార్ధిస్తోంది.
* * * *
"ఇప్పుడేం చేద్దాం" అడిగాడు యువరాజు.
ఏం చెప్పాలో కపాలేశ్వర్ కి కూడా తెలియడం లేదు.
"ఆ గిరిజన నాయకుడ్ని లేపేస్తే"
"లేపేస్తే అందరూ కలిసి మనల్ని చంపేస్తారు"
"మరి" ఏం చెయ్యాలో, తోచక యువరాజు విలవిల్లాడిపోతున్నాడు.
* * * *
ఇందుమతి కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.
ఒక ఆటవిక మహిళ ఇందుమతి చీరను విప్పేసింది. ఇంకొక ఆటవిక స్త్రీ ఆమె దుస్తుల్ని విప్పేస్తోంది.
చుట్టూ స్త్రీలు నిలబడి వుండడం వల్ల ఇందుమతి నగ్నత్వం బయటపడటం లేదు. ఆ ఆటవిక స్త్రీల మధ్య ఇందుమతి నగ్నశిల్పంలా వుంది.