Previous Page Next Page 
హైజాక్ పేజి 29

ఇంత వేగంతో విమానం నేలని తాకితే, ఎన్ని వేల శకలాలవుతుంది? అనిపించింది శతృఘ్నకి. బలవంతంగా ఆ ఆలోచన మీద మనస్సు మరల్చుకోవాలని ప్రయత్నం చేశాడు.
లాభం లేకపోయింది.
ఇంకెన్ని సెకెండ్లు విమానం పేలిపోవడానికి? కౌంట్ డవున్ కి ఇంకెంత వ్యవధి ఉంది?
తనకు తెలియకుండానే లెక్కించడం మొదలెట్టాడు. ఒకటి... రెండు... మూడు... నాలుగు... పది... ఇరవై... ముప్ఫయ్...  నలభై...
అందరూ భయంతో బిగుసుకుపోయి చావు కోసం ఎదురుచూస్తున్నారు.
అప్పుడు ఉన్నట్లుండి వినబడింది ఒక గొంతు. అదృశ్య, అశరీరవాణిలా.
"రాజేందర్!"
ఉలిక్కిపడ్డాడు రాజేందర్.
"రాజేందర్! రాజేందర్!" అంటూ పిలుస్తున్నాడు మెహతా. ఎయిర్ పోర్టుతో రేడియో కాంటాక్టు ఎంత హఠాత్తుగా పోయిందో, అంత హఠాత్తుగానూ తిరిగి వచ్చింది.
"యస్! యస్! అన్నాడు రాజేందర్ ఉద్వేగంతో. "రాజేందర్ నే నేను! విమానం కూలిపోతోంది."
"ఫర్ హెవెన్స్ సేక్! ఆల్టిట్యూడ్ పెంచు! విమానాన్ని పైకి తీసుకెళ్ళు."
"ఎలా?"
ఏం చెయ్యాలో గబగబా చెప్పాడు మెహతా. క్షణం ఆలస్యం చెయ్యకుండా కంట్రోల్స్ వైపు చెయ్యిజాపాడు రాజేందర్.
ప్రచండమైన వేగంతో ఏటవాలుగా జారిపోతున్న ఆ ఎయిర్ బస్ జెట్ విమానం అతను కంట్రోల్స్ మార్చగానే విశ్వప్రయత్నం మీద వేగాన్ని అదుపులోకి తెచ్చుకుని, భూమికి తాకించెయ్య బోతున్న ముక్కుని అతి కష్టంమీద పైకి ఎత్తి మళ్ళీ గాల్లోకి లేవబోయింది.
'థాంక్ గాడ్?" అనుకున్నాడు రాజేందర్.
కానీ అతనికి తెలియదు. విమానం ముక్కు పైకెత్తి గాల్లోకి లేచింది గానీ, మరో క్షణంలో దానితోక భూమిని తాకబోతుందని.
ఆ మాత్రం తాకిడి చాలు. విమానం రెండుగా విరగడానికీ, ఫ్యూయెల్ టాంకు అంటుకుని భగ్గుమని టపాకాయలా పేలిపోవడానికీను.
విమానం ముక్కును పైకెత్తి మళ్ళీ ఆకాశంలోకి లేచే ప్రయత్నం మొదలెట్టింది.
అప్పుడు భూమిని తాకింది దాని తోక కాస్త సుతారంగా.
ఇంకో సమయంలో అయితే, ఆ కాస్త రాపిడికే ఎయిర్ క్రాఫ్టు తోక డామేజ్ అయి ఉండేదేమో!
కానీ -
అప్పటిదాకా అక్కడ ప్రళయ తాండవం చేసి అప్పుడప్పుడే శాంతిస్తున్న ప్రకృతే ఆ విమానాన్ని రక్షించింది. ఏనుగు తొండాల వంటి ధారలతో నిరంతరంగా రెండురోజులపాటు వర్షం కురిసింది అక్కడ. దానివల్ల నేల అంతా రెండడుగుల లోతున మెత్తటి బురదగా మారిపోయింది. దానికి తోడుగా అక్కడ నాలుగైదు అడుగుల ఎత్తు పెరిగే జాతిగడ్డి దట్టంగా మొలిచి ఉంది.
ఈ కారణాలన్నిటివల్లా ఫోంబెడ్ లా ఉంది ఆ స్థలం. ఎయిర్ బస్ కొన సుతారంగా గడ్డిని ఒరుసుకుంటూ పోయినా పెద్ద ప్రమాదమేమీ జరగలేదు.
క్రమక్రమంగా వేగం పుంజుకుంటూ పైకి లేచింది విమానం.
ఆ చుట్టుపక్కల చెట్లమీద వున్న పక్షులన్నీ, బ్రహ్మాండమైన వింత పక్షిలా ఉన్న ఈ విమానాన్ని చూడగానే బెదిరిపోయి అరుస్తూ ఒక్కసారిగా పైకి లేచాయి. విమానం ఆకాశంలోకి వెళ్ళిపోయి, ఇంజన్ల రొద దూరమైపోయిన తర్వాత అవి తేరుకుని, నెమ్మదిగా మళ్ళీ కొమ్మలమీద సర్దుకున్నాయి.
"రాజేందర్! రాజేందర్! ఏమయింది?" అన్నాడు ఎయిరుపోర్టు నుంచ్ మెహతా.
రాజేందర్ షాక్ లో ఉండి మాట్లాడలేకపోయాడు.
మెల్లిగా అతన్ని ఎవరో తట్టినట్లయింది. ఉలిక్కిపడి చూశాడు.
సవ్యసాచి! పైలట్ సవ్యసాచి! అప్పటిదాకా స్పృహ లేకుండా పడిఉన్న సవ్యసాచి!
సాక్షాత్తూ దేముడే ప్రత్యక్షమైనట్లు అనిపించింది రాజేందర్ కి.
చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా యోగాసనాలు చేసిన శరీరం సవ్యసాచిది. అతనికి ఊహ తెలిశాక ఒక్కసారి కూడా జ్వరం రాలేదు. చివరికి జలుబు కూడా చెయ్యలేదు. అలాంటి ఆరోగ్యం కనకనే స్వల్పంగా విషం కలిసిన డ్రింకు త్రాగి తాత్కాలికంగా అప్ సెట్ అయిపోయినా కూడా త్వరలోనే కోలుకో గలిగాడు. కో పైలట్ వినోద్ రవీ, మూర్తీ ఇంకా స్పృహ లేకుండా పడిపోయే ఉన్నారు.
"గెటప్ బడ్డీ?" అన్నాడు సవ్యసాచి ఒక్కసారి తల విదిలించి నిలబడుతూ.

వెంటనే తను సీట్లోనుంచి తప్పుకుని సవ్యసాచికి ప్లేస్ ఇచ్చాడు రాజేందర్.
హెడ్ సెట్ పెట్టుకున్నాడు సవ్యసాచి.
"రాజేందర్! రాజేందర్!" అని పిలుస్తున్నాడు మెహతా.
"రాజేందర్ కాదు! సవ్యసాచిని నేను!"