"చూద్దాం... లే" నీళ్ళల్లోంచే జవాబిచ్చింది ఇందుమతి.
పదినిమిషాలు గడిచాక నీళ్ళల్లోంచి ఒడ్డుకొచ్చి చెట్టుచాటున దుస్తులు మార్చుకుని వైశాలి చేతిలోని టార్చిలైటుని అందుకుంది ఇందుమతి.
"నాకేం భయంలేదు నేను స్నానం చేసి వస్తాన్లే నువ్వెళ్ళు" అంది వైశాలి.
"ఉంటాన్లే" అంది ఇందుమతి.
"నెమ్మదిగా స్నానంచేసి నేనొస్తాను నువ్వెల్దూ"
"జాగ్రత్త... ఏదయినా అవసరమొస్తే కేకెయ్యి" అంటూ ఇందుమతి టెంట్ వేపు అడుగులువేసింది. ఇరవై ఐదేళ్ళ వైశాలి గ్రానైట్ స్టోన్ తో చేసిన శిల్పంలా వుంటుంది. ఐదడుగుల ఐదంగుళాల పొడవు... విశాలమైన కళ్ళు... ఉంగరం వేలంత ముక్కు... మెరిసే పల్చటి పెదిమలు- వైశాలి అందానికి పరాకాష్ట యౌవన విలాసంతో ఎగసిపడే ఆమె కుచాలు... ఎవరి చూపుల్నయినా ఇట్టే ఆకట్టుకొనే స్టన్నింగ్ బ్యూటీ.
నీళ్ళల్లోకి దిగి-
ఒక్కొక్కటి విప్పి ఒడ్డుకి విసిరేస్తోంది.
కొంతసేపటికి ఆమె నీళ్ళల్లో పూర్తి నగ్నంగా వుంది.
వెన్నెల వెలుగులో ఆమె శరీరంలోని వంపుల్ని ప్రకృతి చూస్తోంది.
ప్రకృతేకాదు-
మరో రెండు కళ్ళు-
చెట్టు వెలుగులో ఆమె శరీరంలోని వంపుల్ని చూస్తోంది.
ప్రకృతేకాదు-
మరో రెండు కళ్ళు-
చెట్టు చాటునుంచి ఆమె యౌవనాన్ని ఆబగా చూస్తున్నాయి.
ఇరవై నిమిషాలు గడిచాయి- ఏదో పాటను హమ్ చేస్తూ బడలిక తీరా స్నానం చేసిన వైశాలి-
అటూ ఇటూ చూసి ఎవరూ లేరనే ధైర్యంతో అలాగే నగ్నంగా నీళ్ళలోంచి ఒడ్డుకొచ్చింది.
జలపాతం ఒడ్డున నిలబెట్టిన నగ్నశిల్పంలా వుంది వైశాలి ఆ సమయంలో.
అక్కడికి...
అయిదడుగుల దూరంలో చెట్టుచాటున వున్న ఆ కళ్ళు కసి, కసిగా ఆమెను చూస్తున్నాయి. ఆ కళ్ళు తాలూకు వ్యక్తి గుండెల్లో ఉచ్చ్వాస నిశ్వాసలు పెరిగాయి.
వంటిని తీరుబడిగా తుడుచుకుని దుస్తులు వేసుకుంటున్న వైశాలి ఎండుటాకుల మీద కదలిన అడుగుల చప్పుడికి కంగారుగా అటూ ఇటూ చూసింది.
ఎదురుగా దట్టమైన అడవి... అడుగుల స్పర్శకో, గాలి స్పర్శకో ఎండుటాకులు గలగలమని శబ్దం చేస్తున్నాయి ఉన్నట్టుండి.
ఎండుటాకులు విరుగుతున్న చప్పుడు మరింత ఎక్కువయింది. ఎవరివో అడుగులు దగ్గరౌతున్నాయి, బాగా దగ్గరౌతున్నాయి. ఆ అడుగులు... ఒకరవి కావు... ఇద్దరివి కావు... ఇంకా ఎక్కువమందివి.
సరిగ్గా ఆ సమయంలో... ఎవరో విసిరిన రాయి ఇంకెవరికో తగిలింది.
"అబ్బా" వైశాలి నగ్నత్వాన్ని తనివిదీరా ఆస్వాదిస్తున్న వ్యక్తి బాధగా మూల్గాడు.
మరొకరాయి...
వైశాలికి తగిలింది. ఆ రాయి నుదుటిన తగలగానే వైశాలి...
భయంతో కేకేసింది. వెంటనే తేరుకుని పరుగుతీస్తూ...
అప్పుడు చూసింది స్పష్టంగా...
చెట్టు చాటునుంచి అయిదుగురు గిరిజన యువకులు విచిత్రా లంకరణతో నవ్వుతూ కనిపించారు.
వైశాలిమీద... కొంచెం ముందున్న చెట్టు దగ్గర కుప్ప కూలిపోయిన కపాలేశ్వర్ మీద-
రాళ్ళు రువ్వుతూ ఏదో అరుస్తున్నారు. డప్పులు మోగిస్తున్నారు- కీచురాళ్ళతో చప్పుడు చేస్తున్నారు.
"హెల్ప్... హెల్ప్..." భయంతో అరిచాడు కపాలేశ్వర్.
తనని తాను కంట్రోల్ చేసుకుని పరిగెడుతోంది వైశాలి.
దూరం నించి...
ఆ అరుపులు వినగానే ముందుగా ఎలర్ట్ అయింది యువరాజు. ఆ మరుక్షణం జలపాతం వేపు దూసుకుపోయాడు యువరాజు. ఆటోమేటిగ్గా అతని కుడిచేయి కుడిజేబులోని పిస్టల్ మీద పడింది. అతని వెనుక ఇందుమతి. ముత్యాలనాయుడు, గార్డు భీముడు... ప్రమాదాన్ని శంకిస్తూ యువరాజును ఫాలో అయ్యారు.
రాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక కిందపడ్డ కపాలేశ్వర్ పరిగెత్తడం ప్రారంభించాడు- కపాలేశ్వర్ ని, వైశాలిని వెంట తరుముతున్న ఆ గిరిజన యువకులు క్షణక్షణానికి దగ్గరవుతున్నారు... గిరిజన యువకులు, వైశాలి, కపాలేశ్వర్ ల మీదే కాకుండా ఎదురుగా వస్తున్న యువరాజు, ఇందుమతి మీద కూడా రాళ్ళు రువ్వడం ప్రారంభించారు.
వాళ్ళల్లో వాళ్ళు అరుస్తున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు.
యువరాజు పిస్టల్ ని తీసి వాళ్ళవేపు గురి చేయబోయాడు. అదే సమయంలో, గార్డు కురవభీముడు వేగంగా ఆ పిస్టల్ని లాక్కున్నాడు. గార్డు కురవభీముడ్ని చూడగానే, గిరిజన యువకులు రాళ్లు రువ్వడం ఆపేసి... కోయభాషలో అతన్ని పలకరించారు. వైశాలి వణికిపోతూ వచ్చి ఇందుమతి చేతుల్లో వాలిపోయింది. కపాలేశ్వర్ పరుగు తగ్గించి నిల్చున్నాడు.
"వాళ్ళు... రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు" ఏడుపు గొంతుతో అంది వైశాలి.
కురవభీముడు వెంటనే తేరుకుని తనతో వచ్చినవారు శత్రువులు కారని అడవిని చూడడానికొచ్చిన అధికారులని ఆ గిరిజనులకు చెప్పి అసలు సంగతి అడిగాడు.
వాళ్ళలా మనుషుల్ని రాళ్ళతో కొట్టడం కురవభీముడు కూడా ఎప్పుడు తన సర్వీసులో చూడలేదు. అదే ఆశ్చర్యంగా వుందతనికి. ఆ గిరిజన యువకుల్లో ఒక యువకుడు ముందుకొచ్చి వైశాలి, కపాలేశ్వర్ లని చూపెడుతూ-
"వాళ్ళిద్దరు ప్రేమికులుగారా... ప్రేమికులనుకొని కొట్టాం" అని వాళ్ళ భాషలో ఏదో చెప్పి, తాము చేసిందానికి సిగ్గుపడి మరో క్షణంలో ఉయ... ఉయమని అరుచుకుంటూ అక్కడ నుంచి క్షణంలో అదృశ్యమై పోయారు.
"ఏమిటిదంతా? వాళ్ళేం చెప్పారు నీకు?" అడిగింది ఇందుమతి.
"ఏం లేదమ్మా చిన్న ప్రేమకథ... ఒకప్పుడు ఈ ప్రాంతంలోని ఈ గ్రామానికి చెందిన అమ్మాయిని, ఇంకో గ్రామానికి చెందిన అబ్బాయి ప్రేమించాడు. ఆ అబ్బాయిని ఇష్టపడని అమ్మాయి గ్రామానికి చెందినవాళ్ళు... మా అమ్మాయిని... పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదంటూ ఓ రాత్రి దాడిచేసి రాళ్ళవాన కురిపించారు. దానికి సమాధానంగా వీళ్ళూ రాళ్ళదాడి జరిపారు. ఆ రాళ్ళ దాడిని, గాయాల్ని తప్పించుకుని, ఆ అబ్బాయి, అమ్మాయిని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాళ్ళేమయ్యారో తెలీదుగానీ మొట్టమొదటి రాళ్ళదాడి జరిపిన పున్నమి రోజుల్లో వీళ్ళు, ఆ పేరున పండుగ చేసుకుంటారట. అలాగే పెళ్ళికాని యువతీ యువకుల కోసం ఆ రోజు రాత్రి అడవంతా గాలించి వాళ్ళమీద రాళ్ళేసి రాళ్ళ ప్రేమ పండుగను జరుపుకుంటారట. ఈ పండగను గోల్ మార్ అంటారు. ఈ పండగను మధ్యప్రదేశ్ అడవి ప్రాంతంలో ఎక్కువగా జరుపుకుంటారు. దీనికి నూట యాభై సంవత్సరాల చరిత్ర వుందట. మన వైశాలి, కపాలేశ్వర్ గార్ని చూసి ప్రేమించుకుంటున్నారని భ్రమపడి రాళ్ళేసారు... అంతే!"
నవ్వుతూ చెప్పాడు కురవభీముడు.
వైశాలికి, కపాలేశ్వర్ గాయాలకు ఇందుమతి మందులేసి బేండేజ్ కట్టింది.
కపాలేశ్వర్ ఆ జలపాతం దగ్గరికి ఎప్పుడెళ్ళాడు... ఎందుకెళ్లాడు? ఆలోచనలో పడ్డాడు యువరాజు.
అదే ప్రశ్నను వేసుకుని ఆలోచిస్తోంది ఇందుమతి.
భోజనాలయ్యాక- వంతులవారీగా కాపలాకు ఏర్పాట్లు జరిగాక, నిద్రకు ఉపక్రమించే ముందు వైశాలిని అడిగింది ఇందుమతి.
"నువ్వు స్నానం చేస్తున్న సమయంలో కపాలేశ్వర్ వచ్చాడా?"
"లేదే... స్నానం అయిపోయాక అతనెందుకో అటు పక్కకి వచ్చి వుంటాడు. అంతే... హి... ఈజ్... నైస్ జంటిల్ మేన్..." అంది వైశాలి. ఇందుమతికి ఆ మాటలు నమ్మబుద్ధికాలేదు.
-అడవంతా నిశి నిశ్శబ్దంలో నిద్రపోతోంది.
వరస ప్రకారం యువరాజు మొదట కాపలా కాస్తున్నాడు. ముత్యాలనాయుడు తెచ్చిన కుక్క నెమ్మదిగా మత్తు నుంచి బయటపడి శరీరాన్ని దులుపుకుని లేచి నిలబడింది కాపలాకి. చిరుతపులి సైజులో ఉన్న దాని పేరు రాఖీ.
* * * *
రుద్రనేత్రుడి తాండవానికి అలిసిపోయినట్టుగా వుంది ప్రకృతి. దూరంగా జలపాతం శివుని జటాజూటంలా వుంది.
టెంట్ లో పక్కమీద వత్తిగిల్లిన ఇందుమతి చేతికేదో చల్లగా తగలడంతో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది.
చాపకు కుడిపక్కగా మెల్లగా పాకుతున్న చల్లదనం- కుడిచేతి వేళ్ళతో తడిమి వేళ్ళకు అంటుకున్న చలదనాన్ని స్పర్శించి- కంగారుగా లేచి కూర్చుంది. వెంటనే కొంచెం దూరంలో వున్న కిరోసిన్ లాంతర్ని అందుకుని వత్తిని పైకి లేపింది- చుట్టూ పరుచుకుంది వెలుగు... ఆ వెలుగులో నేలవేపు చూసిన ఇందుమతి భయంతో బిక్క చచ్చిపోయింది. రక్తం... ధారలుగా పారుతున్న రక్తం.
కెవ్వున అరిచింది ఇందుమతి.
ఆ అరుపుకి దూరంగా శిబిరానికి తన వంతు కాపలా కాస్తున్న కపాలేశ్వర్ తోపాటు మగత నిద్రలోంచి మేల్కొన్న యువరాజు పరుగు పరుగున వచ్చారు.
* * * *
పూర్తిగా తెల్లవారింది. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. టెంట్ ల్నీ, టార్పాలిన్లనీ జీపులో పడేసి కొంచెం దూరంలో దూదిపింజల్లా పడున్న కుందేళ్ళ వేపు చూసాడు యువరాజు.
మూడు కుందేళ్ళు వరసగా చచ్చిపడున్నాయి.
"సరిగ్గా తల దగ్గరే చచ్చిపడున్నాయి... అందుకే భయమేసింది" గిల్టీగా అంది ఇందుమతి యువరాజువేపు చూస్తూ. నవ్వాడతను "ఎవరు చంపుంటారు?" తిరిగి అడిగింది ఇందుమతి.
దూరంగా పొడవాటి నాలికతో శరీరాన్ని తుడుచుకుంటున్న రాకీవేపు చెయ్యి చూపించాడు యువరాజు.
"ఎలా పట్టింది వాటిని" ప్రశ్నించింది వైశాలి ఆ ప్రశ్నకు అక్కడెవరి దగ్గరా జవాబు లేదు.
"ఇంకెవరు రావాలి..." స్టీరింగ్ ముందు కూర్చుంటూ అడిగాడు యువరాజు.
"కపాలేశ్వర్" జవాబు చెప్పాడు ముత్యాలనాయుడు.
మరికొద్ది నిమిషాలకు కపాలేశ్వర్ వాగు పక్కనుంచి పరుగు పరుగున వచ్చాడు.