Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 26

సీత బర్నెస్ ముఖంలోకి చూసింది. అతని పెదవులమీద చిరునవ్వు లాస్యం చేసింది. సీత తడబడింది. ఇతను కూడా తెలివయినవాడు. తన ఆలోచనలు పసికట్టాడా? అదెలా సంభవం? అతని గురించి బ్లన్ట్ కు తెలియదు. మరెందుకిలా నవ్వుతున్నాడు? సీతకు అతనిమీద ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది. బర్నెస్ ఎన్నో అడిగి తెలుసుకోవాలని వుంది సీతకు. అంతలో సైన్యాధికారి వచ్చాడు. అతను హడావిడిగా వచ్చినట్టుగా కన్పించాడు. వళ్ళంతా చెమట పట్టింది. రొప్పుతున్నాడు.
"ఏమిటి? ఏమయింది?" బర్నెస్ అతన్ని అడిగాడు. "బజార్లో అల్లర్లు ప్రారంభం అయ్యాయి. కాప్టెన్ రోబర్ స్టన్ ప్లటూన్ తో వెళ్ళాడు. సైన్యాన్ని దింపే అవసరం వున్నట్టుగా రెసిడెంట్ భావిస్తున్నాడు" అన్నాడు రొప్పుతూ.
"అలాగా? అయితే పద! వస్తున్నాను."
బర్నెస్ పక్కగా సీత నడుస్తున్నాడు.
"అల్లర్లు జరుగుతున్నాయా? అంటే?" సీత బర్నెస్ పక్కగా నడుస్తూ అడిగింది గాభరాగా.
"హిందూ, ముస్లింళ మధ్య మతకలహాలు రేగుతూ వుంటాయి. ఇలాంటి కలహాల్లో ఇద్దర్లో ఎవరు ప్రధానకారకులో మాకు అర్థం కావటంలేదు."
"చాలా సీరియస్ విషయమా?"
సీత భయపడుతున్నట్టు గ్రహించాడు బర్నెస్.
"అంత సీరియస్ ఏమీ కాదు. ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. మతపిచ్చివాళ్ళు ఇలాంటి కలహాలను రెచ్చగొడతారు. ప్రతి అయిదుగురిలో నలుగురు హిందువులు ఉన్న ఈ ప్రాంతాన్ని ముస్లిమ్స్ పరిపాలిస్తున్నారు" బర్నెస్ ఉసిగా నడుస్తున్నాడు. సీత దాదాపు పరుగులాంటి నడకతో అతన్ని అనుసరిస్తోంది. దీనివెనక బ్లన్ట్ ప్రమేయంగాని లేదుకదా? వెంటనే సీతకు అజ్ఞాత స్నేహితుడు గుర్తొచ్చాడు. అతను మారువేషంలో వుండటానికి కారణం బ్లన్ట్ రాజనీతి కాదు కదా? ఏమో! కావచ్చు. సీతను ఆమె గది గడప దగ్గర వదిలి, బర్నెస్ ఆతృతగా వెళ్ళిపోయాడు. సీత అలా వెళ్ళిపోతున్న బర్నెస్ ను చూస్తూ ఆలోచనల్లోకి జారిపోయింది.
                                                            * * *
ఆ రాత్రి జరిగిన డిన్నర్ చాలా గొప్పగా వుంది. వైస్ రాయ్ బంగళాలో జరిగిన డిన్నర్ ఏమాత్రం తీసిపోనట్టుగా వుంది. పురుషులు చాలా నీట్ గా డ్రెస్ చేసుకున్నారు. ఇక స్త్రీల విషయం చెప్పనక్కరలేదు. ఏమాత్రం తీసిపోనట్టుగా వుంది. పురుషులు చాలా నీట్ గా డ్రెస్ చేసుకున్నారు. ఇక స్త్రీల విషయం చెప్పనక్కరలేదు. కళ్ళు జిగేల్ మనే నగలు కూడా ధరించారు. రకరకాల సెట్లు వెదజల్లుతున్న సువాసనలతో ఆ వాతావరణం గుబాళిస్తున్నది. సీత ఆరోజు దర్జీ కుట్టితెచ్చిన బట్టలు వేసుకొన్నది. అయినా ఆ స్త్రీల ముందు తను వెలవెలపోతున్నట్టుగా భావించింది. ఇంకా నయం!
ఈ డ్రెస్ కూడా లేకపోతే? తను చౌకబారు దుస్తుల్లో రాక తప్పేది కాదు. అప్పుడు తను కర్రకు వేలాడదీసిన దిష్టిబొమ్మలా వుండేది. సీత కళ్ళు పెద్దవి చేసుకొని ఆ స్త్రీ ధరించిన నగల్ని చూడసాగింది. ఆ డ్రెస్ వేసుకొని అద్దంలో ప్రతిబింబం చూసుకొన్నప్పుడు కథల్లోని రాజకుమారిలా తనకుతనే కన్పించింది. చాలా సంతోషంగా డిన్నర్ కు వచ్చింది. తెల్లని పట్టు మీద కుట్టిన జరీ పువ్వులు నక్షత్రాల్లా జిలుగులు వెదజల్లుతున్నాయి.
సీత మెడచుట్టూ తెల్లటి రిబ్బన్ కట్టుకొన్నది. చిన్న గులాబి పువ్వును అమర్చుకున్నది రిబ్బన్ ముడిమీద. సర్ హారే పక్కగా నడుస్తూ డిన్నర్ హాల్లో ప్రవేశిస్తున్నప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకొన్నది. సర్ హారే ఆమె దుస్తుల్ని గమనించలేదు. అతనికి అలాంటి విషయాలు బుర్రకు ఎక్కవు. సర్ హారే ఇండియాలో ఉండగా, గౌరవసూచకంగా పొందిన గోల్డ్ పథకాన్ని కోటుకు తగిలించుకొన్నాడు. ఆరాత్రి డిన్నర్ వచ్చినవాళ్ళు చాలామంది అలాంటి చిహ్నాలను ధరించి వుండటం చూసింది సీత.
కొందరు రెండూ, మరికొందరు మూడు చిహ్నాలను కూడా తగిలించుకొని కన్పించారు. అవన్నీ వారి సేవలకు లభించిన గుర్తులు, బిరుదులు లాంటివి. రెసిడెంటు వచ్చాడు. అతను లావుగా వున్నాడు. అందంగా అలంకరించుకున్నాడు. తన ప్రత్యేకతను ప్రతి కదలికలోనూ చూపిస్తున్నాడు. ముస్లిమ్. మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. కొందరు రెసిడెన్సీ డిన్నర్ ఆహ్వానం అందుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. వారికి గర్వంగా కూడా వున్నది.
సీత ఇరుపక్కల కూర్చున్నవాళ్ళూ, ఆమెతో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆమె మౌనంగా వింటూ కూర్చుంది. ఆమెకు అందర్నీ మౌనంగా చూడాలనివుంది. ఆ ఆనందాన్ని మౌనంగా వుండి అనుభవించాలని వుంది. అందుకే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. డిన్నర్ అయ్యాక అందరూ దర్బార్ హాల్లోకి ప్రవేశించారు. హాల్లో ఎత్తుగా ఉన్న స్టేజీమీద బంగారు పూతలో ఉన్న సింహాసనాల్లాంటి కుర్చీలు ఉన్నాయి. ఆ స్టేజీకి ఎదురుగా హాల్లో వున్న కుర్చీలలో ఒక్కొక్కరే కూర్చుంటున్నారు. సీత హాలు గోడలకు వున్న ఫోటోలనూ, చిత్రాలనూ చూడసాగింది.
దర్వాజాలకు వున్నవి కూడా చాలా ఖరీదైనవి. ఆమెకు అంత పెద్ద హాల్లో ఊపిరి సలపనట్టుగా వున్నది. తను కలలో కూడా ఊహించని అందమైన లోకంలోకి విసిరేయబడినట్టుగా అన్పిస్తోంది సీతకు. స్టేజీ మీద ఇండియన్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు.
మృదంగం, నట్టువాంగం, ఫ్లూట్ (పిల్లని గ్రోవి) కూడా వున్నాయి. సీతకు ఆ మ్యూజిక్ వింటూంటే థ్రిల్లింగ్ గా వుంది. డాన్సు ప్రారంభం అయింది. ముందుగా గణపతిపూజ (నందన గణపతి) అభినయం చేసింది నర్తకి. నర్తకి ధరించిన దుస్తులు తాలూకు జిగజిగలు సీత కళ్ళల్లో ప్రతిఫలించాయి. గణపతిని భారతీయులు విఘ్నాలను దూరంచేసే భగవంతుడిగా ఆరాధిస్తారని సీత పక్కనే కూర్చున్న ఓ స్త్రీ వివరించి చెప్పింది. సీత మనసులోనే విఘ్నేశ్వరుణి తనకూ తన నేస్తానికి మధ్య ఎలాంటి అడ్డంకులు రాకూడదని ప్రార్థించింది.  
భారతీయ నృత్యం ఎంతగానో ఆకర్షించింది. అభినయం ద్వారా ఎన్నో విషయాలు చెప్పగలరు. మాటలు అవసరం లేకుండానే కథ చెప్పగలరు. ఇంగ్లీషు వాళ్ళు చాలామంది ఆవలిస్తున్నారు. సైనిక సిబ్బంది ముఖాలు విసుగ్గా పెట్టారు. వాళ్ళు ఇలాంటివి చూసి చూసి విసుగెత్తిపోయి వుంటారు. ప్రోగ్రాం ముగిసింది. ముస్లిమ్స్ వెళ్ళిపోయారు. ఇంగ్లీషువాళ్ళు బాల్ రూం డ్యాన్సు కొరకు ఏర్పాటు చేసిన చిన్న హాల్లోకి వెళ్ళారు. ఇంగ్లీషు మ్యూజి.
బాల్ రూం డ్యాన్సు ప్రారంభం అయింది. జతలు ఏర్పడ్డాయి. బ్లన్ట్ సీత దగ్గరకు వచ్చి తనతో డ్యాన్సు చెయ్యవలసిందిగా కోరాడు. ఆమె అందుకు అంగీకరించింది.
అతను అందగాడు అని అందరూ అంగీకరిస్తారు. ఇటీవల గడ్డం పెంచాడు. "గడ్డం లేకుండా ఉంటే ఇతను ఇంకా అందంగా ఉంటాడు" అని మనసులోనే అనుకున్నది సీత. సీత డ్యాన్సు చేస్తూ చేస్తూ అనుకోకుండా బ్లన్ట్ సీతను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను గార్డెన్ లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు.
"నాకు భయంగా వుంది. అక్కడ తోడేళ్ళు ఉంటాయటగా?" ముందుకు అడుగువెయ్యడం ఇష్టంలేనట్లు ఆగి అన్నది సీత.
"ఫర్వాలేదు. నేను నీపక్కన వుండగా నీకెలాంటి హానికలగదు సరేనా?" మెత్తగా అన్నాడు బ్లస్టు. అయినా ఆమె ముందుకు అడుగువెయ్యలేదు.
"నీతో మాట్లాడాలి. అలా వెళదాంరా!" అన్నాడు.
"నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడతారు? దేన్ని గురించి?" గబగబా, గాభరాగా అడిగింది సీత. అతను ఓ క్షణం ఆమె ముఖంలోకి చూశాడు.

 Previous Page Next Page