Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 26


        నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
        న చైనం క్లేదయం త్యాపః న శోషయతి మారుతః 23

    ఆత్మను కత్తులు కోయజాలవు. నిప్పు కాల్చజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పజాలదు.
        అచ్చేద్యో -య మదాహ్యో -యం అక్లేద్యో-శోష్య ఏవచ        
        నిత్య స్సర్వగతః స్థాణుః అచలో -యం సనాతనః 24

    ఆత్మ - కోతకు, కాల్చుటకు, తడుపుటకు, ఎండబెట్టుటకు సాధ్యము కానిది. ఇది నిత్యము సర్వవ్యాపి. అచలము స్థాణువు సనాతనము.
        అవ్యక్తో -య మచింత్యో-యమ అవకార్యో యముచ్చతే  

         తస్మాదేహం విధిత్వైనం నానుశోచితు మర్హసి 25
    అర్జునా! ఇదియే అవ్యక్తము. అచింత్యము. నిర్వికారము. దీనిని తెలుసుకొనుము. దీనికై శోకింపకుము. అతఃమకు జనన మరణములు వున్నవని నీవు భావించినప్పటికి శోకించరాదు.
        అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్
        తథాపి త్వం మహాబాహో నైవం శోచితు మర్హసి 26

    ఆత్మకు చావుపుట్టుకలు వున్నవనుకొన్నప్పటికి నీవు ఏడవరాదు.
        జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
        తస్మా దపరిహార్యే -ర్దే న త్వం శోచితు మర్హసి 27

    పుట్టుట - గిట్టుట, గిట్టుట - పుట్టుట తప్పనిసరి. అట్లైనను నీవు శోకించరాదు.
        అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత!
        అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా 28

    ప్రాణులు పుట్టుటకు ముందు వుండవు. చావు తర్వాత వుండవు. మధ్యకాలములోనే ప్రస్తుతములు వాటికై నీవు శోకింపనేల?
        ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేనం
        ఆశ్చర్య పద్వదతి తథైవ చాన్యః
        ఆశ్చర్య వచ్సైవ మన్యఃశృణోతి
        శ్రుత్వా-ప్యేనం వేద నచైన కశ్చిత్ 29

    ఒకడు దీనిని ఆశ్చర్యముగా చూచును. మరొకడు దీనిని ఆశ్చర్యముగా పలుకును. ఇంకొకడు ఆశ్చర్యముగా వినును. వినినవాడు అర్ధము చేసుకొనజాలడు.
    
    దీపిక:
    
    1. స్వామీ! నీవు సర్వజ్ఞుడవు. మేము అజ్ఞులము. నీవు సర్వశక్తివంతుడవు. మేము అశక్తులము. నీ భాష  సమున్నతము. మాకు అర్ధమగునది కాదు. అందువలననే సంశయములు.
    i.     పరిణామయోగముపదేశించినాడు. బాల్య యవ్వన వార్ధక్యముల వంటిదే మృత్యువని బోధించినాడు.
      అనుబంధములు దుఃఖము కల్గించుచున్నవి. దశాబ్దమూలా సహచరులు, మరణించినపుడు దుఃఖించుట అతి సహజము అగుచున్నది. మా చిన్నతనమున గ్రామములో మరణము సంభవించిన, ఊరంతా నిప్పు రాజునది కాదు. దహన సంస్కారము తర్వాతనే గ్రామములో పొయ్యి మండునది.
        ఈ అత్యాధునిక కాలమున బంధుమిత్రుల శవములను దర్శించుటకు విదేశమూలా నుండి వ్యయప్రయాసల కోర్చి  వచ్చుచున్నారు. నీవు ఏర్పరచిన కర్మకాండ జరుపుచున్నారు. ఇది  నివార్యమగునా?
    ii.  ఆత్మను గురించి బోధించినావు. ఆత్మ అను పదము వాడినావు కావు. ఇది అది అని మాత్రమే వాడినావు.
    iii. వేదమున ఆత్మ పదమునకు, వ్యక్తి లేక మనసు అనే అర్ధంలో వాడబడింది.
   vi. రామాయణములో, 'ఆత్మానం మానుషంమన్యే'నేను మానవుడను అగుదును అని చెప్పుచున్నాడు. అట్లు  అగుటచే    'నేను లేక నా' అను అర్ధములో వాడబడింది.
    v.   ఈ కాలములో గూడ ఆత్మవిశ్వాసము తన విశ్వాసము అని వాడబడుచున్నది.
    vi.  ఉపనిషత్తులలో గూడా
          తదేజతి తన్న్హైజతి తత్ దూరే తద్వన్తికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్యజాహ్యతః
                (ఈ శావాస్యం5)
               అది చలం. అది అచలం, అది బహుదూరం. బహూదగ్గర. అది అన్నింటి బాహిరం. అది ఇది అను అర్ధము చేసుకొను ఎట్లు. నేను సౌకర్యార్ధము 'ఆత్మ' అని వాడుచున్నాను. ఒక్కొక్క చోట దేహి అని వాడినారు. అట్లనిన దేహముగలది, లేక ప్రాణము గలది. 'దేహి అనిన ప్రాణము' అని అర్ధమా?
     2. స్వామీ ఆత్మ లేదనుకొనుము అన్నావు. అట్లు అయినను, జనన మరణములు నిశ్చయములు గదా! అని చెప్పినావు.
    i.   జనన మరణములకు, ఆత్మకు గల సంబంధము ఎట్టిది. యీ రెండు సమానార్ధకములు అగునా?
    ii.  దానిని గురించి పలుకువాడు లేడు.
                చూచువాడు లేడు, వినువాడు లేడు. వినినను గ్రహించువాడు లేడు. అట్లయిన ఆత్మ వ్యవస్థ ఎట్టిది?
    
        దేహీ నిత్య మవధ్యో - యం దేహే సర్వస్య భారత!
        తాస్మత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి 30

    ప్రతి ప్రాణి దేహమందునను, ఆత్మ వున్నది. అది వధింపరానిది. కావున నీవు దుఃఖింపరాదు.
        స్వధర్మ మపి చాపేక్ష్య న వికంపితు మర్హసి
        ధర్మ్యాద్ది యుద్దాచ్చ్రేయో -న్యత్ క్షత్రియస్య న విద్యతే 31

    స్వధర్మమును గురించి తలచినను, నీవు బాధపడరాదు. నీవు క్షత్రియుడవు. ధర్మ యుద్దమును గూర్చిన కర్తవ్యము మరియొకటి లేదు.
        యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వార మపావృతమ్
        సుఖినః క్షత్రియాః పార్ధ! లభంతే యుద్ద మీదృశమ్ 32

    ఈ యుద్దము నీవు అనుకొన్నది కాదు. ప్రాప్తించినది. క్షత్రియునకు, ఇటువంటి యుద్దము కన్న అదృష్టమేమున్నది? స్వర్గ ద్వారములు తెరచియున్నవి.
        అథ చేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
        తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్య సి 33

    యుద్దము నీ స్వధర్మము. చేయకున్న పిరికివాడవగుదువు. నీ కీర్తి పోవును. పాపమూ కలుగును.
        అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే -వ్యయామ్
        సమభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్చతే|| 34

    లోకము చాలా కాలము నీ అపకీర్తిని గురించి నిందించును. కథలు కథలుగా చెప్పుకొందురు. మాన్యుడైనవానికి అపకీర్తి మరణమును మించినది.
        భయాద్రణా దుపరతం మంస్యంతే త్వాం మహారథాః
        యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవమ్|| 35

    రథులు, మహారథులు నిన్ను గొప్పవానిగా భావించుచున్నారు.
    యుద్దమును చేయకున్న నీవు వారికి చులకన అగుదువు. నిన్ను పిరికిపందగా భావింతురు.

 Previous Page Next Page