Read more!
 Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 2

    సైన్స్ ను సవాలు చేస్తూ ఓ నేత్రం. మూడవ నేత్రం.
    భ..స్మ..నే..త్రం.
    కన్రేప్పలు మూసి వున్నాయి.
    ఒక్కక్షణం భయంగా కేకవేయబోయి బలవంతంగా అపుకుంది. మెల్లగా కన్రేప్పలు కదిలించాసాగాడు. మూడు.. రెండు... ఒకటి... కన్రేప్పలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా..మెల్ల మెల్లగా... కంటిమీద ఉల్లిపొర లాంటి కాగితాన్ని పెట్టాడు. ఒకటి.. రెండు...మూడు..క్షణాలు భారంగా గడుస్తున్నాయి విశాలిలో ఉద్వేగం... భయం... రెండూ... పరస్పర భావాలు. ఉల్లిపొర కాగితం కాలడం మొదలుపెట్టండి. మెల్ల మేల్లాగా కాలుతోంది. అది చూసి కెవ్వున కేకేసింది విశాలి.
    వెంటనే మిగిలిన కాగితాన్ని తీసి కింద వేశాడు. మొత్తం కాలి క్షణల్లో బూదిడిగా మారింది.
    "ఏమిటండీ... ఇదంతా..." అయోమయంగా అడిగింది. విశాలి.
    "నీ మాటల్లో చెప్పాలంటే 'శాపం'... శాపం విశాలి... లేక లేక బాబుపుడితే మనం ఆనందాన్ని పంచుకోవడం ఇష్టం లేక ఈ ప్రకృతి ఇచ్చిన శాపం.
    "అంటే...?"
    "ఒక్కోసారి సైన్స్ కు అందని అద్బుతాలు జరుగుతుంటాయి విశాలీ దాన్ని మనం చేధించేవరకూ, అది ఒక మిరాకిల్ గా వుండిపోతుంది. మన బాబుకున్నఈ మూడోవ నేత్రం మామూలు నేత్రం కాదు విశాలీ భ..స్మ..నే..త్రం.
    'భస్మనేత్రం' తనలో తనే గొణుక్కుంది.విశాలీ.
    "అవును విశాలీ. భాస్మనేత్రమే. కొన్నింటికి లాజిక్ లు,రీజినంగ్ ళ అమ్తుబత్తవు. ఐ వ్యక్తి శరీరంలో విద్యుత్ ప్రవహిస్తోంది.అతను మనల్ని తాకితే 'షాక్' తగులుతుంది. అలాంటిదే యిది. వీడి శారీరంలో అంతుబట్టని శక్తివంతమైన  విద్యుత్ ప్రవహిస్తుందని నా అనుమానం. అనిమానమే కాదు, నిజం కూడా ఈ మూడో కన్ను తెరుచుకోగానే ఆ కంటి గుడ్డా దృష్టి ప్రసరించే ప్రదేసమంతా భాస్మమవుతుంది.
    వీడిలో వయసు పెరిగే కఒద్దీ, భస్మం చేసే శక్తి వేడి కంటికి పెరగుతుంది. విద్రోహుల చేతుల్లో వీడిలాంటి వాళ్ళుంటే వాళ్ళు ప్రపంచాన్నే బస్కీ పటాలం చేస్తారు. విశాలీ. వేడి మెదడిని వశపరుచుకుని, వీడితో ఎలాంటి పనిలైనా చేయించవచ్చు. అయినా... విశాలీ వీడు పెరిగేకొద్ది మనకూ సమస్యే.
    వీడి ఉనికి బయట ప్రపంచానికి తెలియకుండా పోదు . వీడిని అనిక్షణం మనం కాపాడుకోలేమూ.
    తప్పదు విశాలీ... ఈ బిడ్డాను మనంకాపాడుకోలేము.
    తప్పదు విశాలీ... ఈ బిడ్డాను మనం వదులుకోక తప్పదు.వీడు పెద్దయ్యాక సమాజానికే కాదు, వాడికి వాడే బరువవుతాడు. వాడి ప్రమేయం లేకుమ్దాతెరుచుకునే వాడి నేత్రం ఏ క్షణం ఎవర్నీ భస్మం చేస్తుందో తెలియదు .అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను విశాలీ..." భరద్వాజ ఓ చిట్టూర్పు విడిచాడు.
    "ఏ నిర్ణయమండి" నూతిలో నుంచి వచ్చినట్టుందామె గొంతు.
    ఓ చెడు నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతూంది.
    "మనకు... మనకు బాబు పుట్టలేదనుకుందాం విశాలీ..."
    "అంటే..?" పిచ్చిదానిలా అడిగింది విశాలి.
    కళ్ళు మూసుకున్నాడు భరద్వాజ. అతనికి తెలియకుండానే రెండు కన్నీటి చుక్కలు అతని కనుకొలకుల్లో నుండి నేలమీద రాలాయి.
    "బాబును పాతి పెట్టేద్దాం.."
    "నో... అని అరుపు గది గోడల మధ్య ప్రతిద్వనించింది. వెంటనే పరుగున వెళ్ళి బిడ్డాను తన పొత్తిళ్ళలో కి తీసుకుంది.
    "వీల్లేదు... వీల్లేదు...నా బిడ్డను చంపెయడానికి నేను ఒప్పుకోను.ఏమండీ!మీరు ఇంత పెద్ద సైంటిస్ట్! నా బిడ్డకున్న చిన్న లోపాన్ని సారి చేయలేరా?" ఏడుస్తూ అంది సమాజానికి హెచ్చారిక అవుతూంది.సైన్స్ ను సవాలుగా స్వీకరించే ఆ సైంసిస్ట్ బిడ్డా విషయంలో మాత్రం ధైర్యం చేయలేక పోతున్నాడు.
    అక్కడ కొన్ని కధనాలు శ్మశాన నిశ్శబ్దం.
    తుపానుకు ముందు ఉండే ప్రశాంతత.
    బిడ్డను ఒళ్ళో పడుకోపెట్టుకుని ఏడుస్తోంది విశాలి.
    భరద్వాజ మాత్రం మౌనంగా స్తబ్దుగా వుండిపోయాడు.
    అప్పటికే ఆయనో నిర్ణయానికి వచ్చాడు.
    భరద్వాజకు తెలియదు వీళ్ళా సంభాషణ అంతా మూడో వ్యక్తి విన్న విషయం.
                                                ***
    "సాబ్..." వగరిస్తూ వచ్చాడో అనుచరుడు.
    "క్యాబే... ఏమయింది?" కరంజిమా కంఠం కరుగ్గా వుంది.
    "ఆ సైమ్సిస్ట్ ఎక్కడున్నాడో తెలిసింది..." ఆ అనుచరుడు సంతోషంతో చెప్పాడు.
    "అచ్చా... ఎక్కడున్నడు?" కరంజియా తాపీగా అడిగాడు.
    చెప్పాడు అనుచరుడు.
    "ఏం చేస్తున్నాడు?"
    "అతడికో కొడుకు పుట్టాడు" అంటూ భరద్వాజ, విశాలి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాడు.
    "శాభాష్... మంచి పని చేశావు." కరంజియా మెచ్చుకోలుగా అన్నాడు.
    "పినిష్ చేద్దామా?"అడిగాడు కుడిభుజమైన లల్లూరామ్ .
    "వద్దు... అక్కడేం జరుగుతుందో అనుక్షణం గమనించండి. ఇప్పుడు మనకు భరద్వాజతో పనిలేదు. వాడి బిడ్డతో పని" వికృతంగా నవ్వాడు కరంజియా.
    లల్లూరామ్ ఏదో మాట్లడబోయి ఆగిపోయాడు.కరంజియా ఒక నిర్ణయానికి వచ్చాడంటే అతనికి ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయరు.
    "వాడిచ్చే ఆ ఫార్ములాకన్నా, వీడి కొడుకే మనకుపెద్ద ఫార్ములా" పెద్ద గొంతుతో అన్నాడు.
    లల్లూరామ్ విన్నట్టుగా తలాడించాడు.   
                                                 ***
    ఎక్కడో పిడుగు పడింది.
    ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు భరద్వాజ. చాలా రాత్రియింది.విశాలి బిడ్డని గట్టిగా పట్టుకుని పడుకుంది.పొత్తిళ్ళలోని బిడ్డని తనకితెలియకుమ్డా భర్త తల దగ్గర జరిగింది.

 Previous Page Next Page