Read more!
 Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 3

    కొద్ది క్షణాల్లోనే ఉలికిపాటుతో కేక వేసింది చేతి దగ్గర 'పొక్కు'
    తల మద్యలో వున్నా ఆ కన్నుటప,టప కొట్టుకుంటుంది.
    మొదటిసారిగా భయంగా  బిడ్డవైపు చూసింది. ఆ కన్ను మెల్ల మెల్లగా మూసుకుంటోంది.
    భరద్వాజ భార్య దగ్గరకి వచ్చాడు. మోకల్లా మీద కూర్చున్నాడు. "ఏం నిర్ణయించుకున్నావు విశాలీ?" సౌమ్యంగా అడిగాడు.
    ఏం చెప్పగలదు?
    "నా బాబును నా నుండి వేరుచేస్తార?" విశాలి కంఠం సన్నగా వణికింది.
    భార్యకెలా చెప్పాలో తోచలేదు భరద్వాజకు.
    బయట వర్షం కురూస్తూనే వుంది.
    "పడుకో విశాలీ..." భార్య తల మీద చేయేసి అన్నాడు.
    భర్త చేతిని దిండుగా మార్చుకుని అలాగే కళ్ళు మూసుకుంది.
    ఒళ్లంతా అలసటగా వుంది.పచ్చి బాలింత. నిశ్చంతగా బాబుని దగ్గరకి తీసుకుని పడుకోవాల్సిన ఆమె టెన్షన్ తో భయంతో ఎదుస్తూ పడుకుంది.
    మెల్లగా లేచాడు భరద్వాజ. భార్య తలకిందులుగా తన చేతుని తీసుకున్నాడు.
    బిడ్డ పడుకున్నాడు.
    మెల్లగా అతడ్న ఎత్తుకున్నాడు.
    తెల్లటి గుడ్డలో బిడ్డని చుట్టాడు. చెప్పులు వేసుకుని హాస్పిటల్ బయటకు నడిచాడు. అలా ఓ పడి నిముషాల నడిచాడు. దూరంగా ఓ నిర్జన ప్రదేశం. చెట్లు, పొదలు.
    వర్షం ఇంకా కురూస్తూనే వుంది.అయినా అతను ఓ నిర్ణయానికి వచ్చాక ఇక మారాడు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, నిర్లక్ష్యంగా నడుస్తూనే ఉన్నాడు.
    చేతిలోని పసిగుడ్డు మాత్రం తండ్రి కిరాతకం తెలియక నిద్రలోనే నవ్వుతున్నాడు.
    వర్షం పడి నేలంతా బురద బురదగా వుండడంతో నడపటం కష్టమైపోతుంది.
    ఓ చోట ఆగాడు.
    బిడ్డని పలుచగా ఉన్నా బండమీద పడుకోబెట్టాడు. పక్కనే వున్న దొడ్డు కర్రని అందుకున్నాడు. తవ్వడం మొదలుపెట్టాడు. వర్షంతోతడిసి వుంది నెల. పైగా బురద బురదగా వుంది. అంత వర్షంలోనూ చెమట్లు పడుతున్నయతనికి.
    ఒకటి..రెండు.. మూడు..
    మట్టిని ఓ వైపు తీస్తూ తవ్వుతున్నాడు. కర్ర విరిగిపోయింది.తన మీద తనకే కోపమ్ వచ్చింది. చూట్టూ చూశాడు. తవ్వడానికి పనికొచ్చే సాధనం ఏదీ కనిపించలేదు.
    అతని దృష్టిపోద  దగ్గర పడింది. ఏదో ఇనుప వస్తువు.
    దగ్గర కెళ్ళి చూసాడు.చిన్న గునపం లాంటి సాధనం. తుప్పుపట్టి వుంది. చేతిలోకి తీసుకున్నాడు.
    మరో పావుగంటలో గొయ్యి తయారయింది. కొడుకువైపు చూశాడు.
    అతనికి దుఃఖం ముంచుకొస్తోంది.
   ప్రపంచంలో ఏ తండ్రీ ఇలా కొడుకు బ్రతికి వుండగానేఖననం చేయడమో... ఏ తండ్రీ చేయని దారుణాన్ని నేను చేస్తున్నాను.ఈ ప్రపంచానికి నువ్వుసవాలుగా మారవద్దని నేను చేస్తున్నా ఇఇదారున్నాన్ని క్షమించమని వేడుకుంటున్నాను బాబూ!" భరద్వాజ కళ్ళు వర్షిస్తున్నాయి.
    'సజీవంగా నిన్ను సమాధి చేస్తున్నాను. నా.. న్ను.. క్స్జమిమ్చు... లేదా... శపించు. మళ్ళీ జన్మలో నాలాంటి వాడికి కొడుగ్గా పుట్టకు. ఇలా ప్రకృతికి శాపంగా తయారవ్వకు.
    బిడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లటి బట్టని బిడ్డా చుట్టూ చోట్టాడు.
    'బిడ్డా గిలగిల కొట్టుకుంటాడెమో" తండ్రి హృదయం విలవిల్లాడిపోయింది.
    ;కానీ రేపు తనకున్నా సూపర్ పవర్ తో దేశానికిసవాలిగా మారితే...?"
    అందుకే.. మనసుని కఠినం చేసుకున్నాడు.
    చేమరిస్తున్నా కళ్ళని గట్టిగా షార్ట్ తో తుడుచుకున్నాడు.
    గొయ్యిలో బిడ్డని పడుకోబెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. మట్టిని తిరిగి గొయ్యిలోకి తోస్తున్నాడు.
    అతను చేస్తున్నా ఆ పనికి చూట్టూ వున్నా గాలి కూడా స్తంభించిపోయింది.
    మరో పడి నిముషాల్లో ఆ పని పూర్తయింది. భారమైన హృదయంతో వెనక్కి తిరిగాడు.
    అతనికి తెలియదు ఆ క్షణం తను చేసిన ఈ పనిఎమ్తటి దారుణానికి ఓడికడుతుందో?
                                           ***
    భరద్వాజ వెనక్కి తిరిగిన ఐదు నిముషాలకే అక్కడే వున్నా పొదల్లో నుండి బయటకొచ్చాడు కరంజియా.
    "త్వరగా ఆ గొయ్యి మీదవున్న మట్టిని తీయండి" అనుచరులను అజ్ఞాపించాడు.
    అక్కడే వున్న గునపంతో మట్టి తీయసాగారు. అప్పుడే వేసింది.కావడంతో తొందరగా వచ్చేస్తోంది. లోపల తెల్ల గుడ్డలో బిడ్డ.
    "బిడ్డను బయటకు తీశారు.కరంజియా బిడ్డవైపు చూసి ఒక్కక్షణం కంగారు పడ్డాడు. తలమీద చుట్టబడ్డ గుడ్డ మెల్ల మెల్లగా కాలిపోతోంది.
    "ఏయ్  నిప్పు... నీళ్ళుపోయండి" అన్నాడు కంగారుగా.
    అనుచరులు బిత్తరపోయారు.
    అ బిడ్డని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు లల్లూరామ్. తల మధ్య ఉన్నామూడో కన్ను అప్పుడే మూసుకుటోంది.
    మనవడు చెప్పింది నిజమే..." లల్లూరామ్ కరంజియాతో అన్నాడు.
    "అచ్చా... మనం ముందు ఇక్కడినుండి వెళ్ళిపోదాం..." అంటూ వెనక్కి తిరిగాడు కరంజియా.
    రెండడుగులు వేసాక అన్నాడు " వీడికి పేరేమి పెడదాం?" అని.
    "భస్మ" అని పెడదాం చెప్పాడు లల్లూరాం.
    "భ..సమ... బావుండి. వేడు ప్రపంచాన్నే భస్మ చేయాలి..." అంటూ పెద్దపెద్ద అడుగులతో ముందుకు కదిలాడు కరంజియా.అతనిప్పుడు చేయబోయే పని గురించి ఆలోచిస్తున్నాడు.
                                               ***

 Previous Page Next Page