ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. మంచం మీద పడుకుని ఆలోచనలో మునిగి ఉన్నాను.
ఎప్పుడొచ్చారో తెలీదు. మా బావగారు పిల్లిలా గదిలో కడుగుపెడుతూ ఉండటం చూసి, ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను.
"ఫర్వాలేదు పడుకో. ఈ ఫార్మాలిటీస్ మనిద్దరి మధ్యా ఏం వద్దులే" అంటూ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూచున్నాడు.
ఆయన మాటలు పట్టించుకోకుండా మంచం అంచున కూచుని ఉన్నాను.
"నేనంతా గమనిస్తూనే ఉన్నాను" అన్నారు.
తలెత్తి ఆయన ముఖంలోకి చూసి, అంతలోనే కళ్ళు వాల్చేశాను.
"ఆ చవట గురించి నాకు మొదట్నుంచి తెలుసు. ఒట్టి అప్రయోజకుడని, నపుంసక వెధవనీ...."
నా రక్తనాళాల్లో రక్తం జివ్వుమని ప్రవహించినట్లయింది. కోపంగా అతని ముఖంలోకి మళ్ళీ చూశాను.
"చవట వెధవని తెలిసినప్పుడు పెళ్ళెందుకు చేశారు? నా జీవితం నాశనం చెయ్యటానికా?"
"వద్దని చెప్పాను. మా అమ్మ మొండిఘటం. ఇలాంటి విషయాల్లో తల్లితండ్రులు మూర్ఖంగా, మొండిగా ప్రవర్తిస్తుంటారు. ప్రపంచమంతా ఆ సత్యాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ ఉంటారు. పుత్ర ప్రేమ వాళ్ళ కళ్ళని మూయించేస్తూ ఉంటుంది.
ఈ పాయింటు బాగానే ఉందనిపించింది. కొంత అనుభవజ్ఞుడిలానే మాట్లాడుతున్నాడు.
"మరిప్పుడేం చేయాలంటారు?" అన్నాను.
"డాక్టర్లకి చూపించి ప్రయోజనం లేదు. ఇలాంటి కేసులు డాక్టర్ల చుట్టూ తిరగటమేగాని ఉపయోగముండదు. ఈ సెక్స్ వీక్ నెస్ అనేది కేవలం సైకలాజికల్ అని కొట్టి పారేస్తారు. సమస్య సమస్యగానే వుండి పోతుంది. నే చెబుతున్నాగా ఇలాంటి కేసులెన్నో చూశాను."
"మరయితే...."
"సొల్యూషనేమిటని అడుగుతున్నావు" అంటూ చిద్విలాసంగా నవ్వాడు. "పిచ్చిదానా, నేనుండగా నీ జీవితం పాడు కానిస్తానా? ఆ చవట వెధవ విషయం వదిలేయ్. వాణ్ణి పేరుకు మాత్రం మొగుడిగా ఉండనీయ్. ఒక రకంగా అలా ఉండటం మంచిదే. మిగతా విషయాలు నేను చూసుకుంటాను."
కుర్చీలోంచి లేచి నా దగ్గరకొచ్చి నిల్చుని తలమీద చెయ్యివేసి నిమురుతున్నాడు.
మగాడు ఆడదాన్ని అలా తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడంటే.... అది వాత్సల్యమనుకోవాలా? ట్రాప్ చేస్తున్నాడనుకోవచ్చా? ఏదయినా జీవితంలో నిజంకన్నా నటనకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి అలాంటి సమయాల్లో ఆడది కరిగిపోతూ వుంటుంది. కాని మొదట్నుంచి నాది ఆలోచనాత్మక స్వభావం కాబట్టి నిగ్రహించుకున్నాను.
ఆడదాన్ని పడగొట్టటానికి మగాడు చేసే ప్రయత్నాలన్నిట్లో సానుభూతి ఫస్ట్ మార్క్ సంపాదించుకుంటుంది.
"మిగతా విషయాలంటే?"
"నీ కోరికలు తీర్చటం, అమోఘమైన ఆనందాలు అందించటం...."
"కోరికలు తీర్చుకుంటూ ఉంటే జీవితంలో సంపూర్ణత్వం సిద్ధిస్తుందా?"
"సంపూర్ణత్వమంటే?
"మీరూ మీ ఆవిడలాగా...."
"అందరి జీవితాలూ ఒకేలా ఉంటాయేమిటి? ఒక్కొక్కరిలో ఒక్కో లోపం ఏర్పడుతున్నప్పుడు, వాటిని ఏదో రూపంలో భర్తీ చేసుకుంటూ వుండాలి."
"అయితే నాకోసం మీరేం చేస్తానంటారు?"
"నువ్వు ఆ చవట వెధవ దగ్గర కోల్పోయినదాన్ని అందిస్తూ వుంటాను."
"మీ ఆవిడగారికి తెలిస్తే?"
"దానికి నాకూ అండర్ స్టాండింగ్ వుందిలే. చూసి చూడనట్టు ఊరుకుంటూ వుంటుంది."
"ఆవిడ విషయంలో కూడా మీరు చూసీ చూడనట్లు ఊరుకుంటూ వుంటారా?"
"తనకంత అవసరం లేదు. ఎందుకంటే నేను సమర్థుణ్ణి కాబట్టి."
"మగాడు సమర్థుడయినా బయట తిరిగే ఆడవాళ్ళను చూశానే."
చిత్రమేమంటే ఆదర్శవంతమైన దాంపత్యంలో వున్న స్త్రీ కూడా ఏదో ఓ సందర్భంలో ఇష్టంగానో, అయిష్టంగానో, మధ్యస్థంగానో పరాయి మగాడితో ఇలాంటి సంభాషణలతో చిక్కుకుంటూ వుంటుంది. బయటపడి భగ్గుమనిపించే గుట్లు జీవన ప్రవాహంలో సైలెంటుగా సాగిపోతూ వుంటాయి.
అతని ముఖంలో విసుగుదల కనిపించింది. "ఇప్పుడవన్నీ ఎందుకు మన సంగతి చూసుకోకుండా..." అంటూ చేయి తల మీద నుంచి భుజం మీదకు, ఆ తర్వాత ఇంకా క్రిందకు జారుస్తున్నాడు.
చేతిని విసురుగా తోసేశాను.
"ఏం"? అన్నాడు.
"నాకిష్టం లేదు. మీరిక్కణ్ణించి వెళ్లిపోండి" అన్నాను కటువుగా.
"నేను వెళ్ళటానికి రాలేదు."
అతని వంక అసహనంగా చూశాను.
"నిన్ను సొంతం చేసుకోటానికొచ్చాను"
"నాకిష్టం లేకుండా..."
నవ్వాడు, "ఇష్టం, అయిష్టం అనే పదాలు. కొంతవరకే వర్తిస్తాయి. నీది అద్భుతమైన అందం. మహాద్భుతమైన శరీరలావణ్యం. నీ సొగసులు నన్ను రెచ్చగొడుతున్నాయి. నిన్ను బలవంతానైనా సరే అనుభవిస్తాను. ఎందుకంటే అనుభవించకుండా ఉండలేకపోతున్నాను గనుక." అంటూ చప్పున వెళ్ళి గది తలుపులు గడియవేసి వచ్చాడు.
అందమైన ఆడదాన్ని చూసి చలించటంలో, కోరికలతో రగలటంలో ఆశ్చర్యం లేదు. కాని తనకున్న అర్హతల్ని గురించి ఆలోచించకుండా ప్రతి బేవార్సుగాడూ ఆమె మీద తనకేదో హక్కు ఉందనుకుంటాడు.