కానీ అతని దిగులు బట్టలగురించి కాదు. ప్యాంటు జేబులో వున్న పేక గురించి అతని ఆరాటం....! ఆ పేకని తన ప్రాణంలా చూసుకుంటాడతను.
తన ఆశయాన్ని నెరవేర్చుకోడానికి లక్ష్యాన్ని ఛేదించేందుకు చేదు గుర్తుగా ఆ పేకని తను ప్రతిక్షణం జేబులో వుంచుకుంటాడు.
అది పోతే తన ప్రాణం పోయినట్టే!
అతడి మనసు గిజగిజలాడిపోతోంది.
మేడం గదికేసి పరుగుదీశాడు పరుశురామ్.
విషయం తెలిసిన పనివాళ్ళు వస్తున్న నవ్వును ఆపుకొంటున్నారు.
ఆ సమయంలో నందిని డ్రస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పవిటకి బ్రోచ్ పిన్ పెట్టుకొని తన అలంకరణ సరిగ్గా వుందా లేదా అని పరీక్షగా చూసుకుంటోంది.
నుదుట నీలం రంగు బొట్టు, పెదిమలకి గులాబీరంగు లిప్ స్టిక్... చెవులకి రవ్వదిద్దులు పెట్టుకొంది ముక్కుకి రవ్వబులాకీ.... చెంపలకి రోజ్ కలర్, నీలం రంగులతో రవ్వంత తళుకు అద్దడంతో నున్నగా మెరిసిపోతున్నాయి.
మెడలో కాసులపేరు గుండెలమీదగా పొట్టవరకూ జారింది. కుడిచేతికి నాలుగు గోల్డ్ బాంగిల్స్, ఎడంచేతికి వాచ్....
లేత బ్లూ కలర్ సిల్క్ చీర బొడ్డుకిందగా కుచ్చెళ్ళని పేర్చి కట్టుకొంది. మాచింగ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్.... మెడదిగి తెల్లని గుండ్రని ఎత్తయిన ఆమె వక్ష శిఖరాలు అద్భుత హిమాలయాల్లా దివ్యదర్శనాన్ని కలిగిస్తున్నాయి.
బ్లౌజ్ లోంచి ఆమె ధరించిన బ్లాక్ కలర్ బ్రా అందమైన డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
స్ప్రే చేసుకొంటున్న నందిని అద్దంలో పరుశురామ్ తన గదిలోకి రావడం చూసింది. అతడ్ని చూడగానే ఆమె పెదవులపైన మత్తుగా చిరునవ్వు కదిలింది.
ఆ నవ్వుకి ఎలాంటి మగవాడైనా సరే దాసోహం అనక తప్పదు.
తన అందం చూసి పరుశురామ్ కి మతి చలిస్తుందనుకున్నది నందిని.
కనురెప్ప వేయకుండా తననే చూస్తూ తన అందాన్ని ఆదిశేషుడిలా పొగుడుతాడనుకుంది. అయితే అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయింది నందిని.
"నా బట్టలెక్కడ?"
తన అందానికి, చందానికి నీరాజనాలర్పిస్తాడనుకున్న పరుశురామ్ ప్రశ్న శరాఘాతమైందామెకి.
తన అందానికి బానిస కాని మగవాడు తనకింతవరకూ కనిపించలేదు. చిరునవ్వు కోసం కాళ్ళదగ్గర పడి నిరంతర ఆరాధనతో పిచ్చికుక్కల్లా పడిగాపులుపడే వాళ్ళెందరో వున్నారు.
అయినా తన కంటిచూపుకైనా నోచుకోలేదలాంటి వాళ్ళు.
తన అందానికి గల సమ్మోహన శక్తి ఎంత శక్తివంతమైనదో నందినికి తెలుసు.
రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమలని మించిన అందంతో ఎదురుగా నిలిచిన తనని అతను "నా బట్టలెక్కడ?" అని ప్రశ్నించడంతో విస్తుపోయింది.
తీరని ఆశాభంగంతో ఆమె అహమే దెబ్బతింది.
"అవి బట్టలా?" ఎక్కడాలేని ఈసడింపు ధ్వనించింది ఆమె గొంతులో.
"మేడం! నీ దృష్టిలో అవి కుళ్ళుబట్టలు కావచ్చు. అవి ముష్టివాళ్ళు వేసుకునే దుస్తుల్లా అనిపించి వుండొచ్చు. కానీ అవి నిన్నటివరకు నా వంటి పైన వున్నాయి. ఆ బట్టల్లో కంపరంగా కనుపించే నన్ను వెంటబెట్టుకువచ్చి ఆదరించావు. అయితే నేను బట్టలు పోయినందుకు బాధపడడం లేదు. పాంటు జేబులో అతి విలువయిన వస్తువుంది. అది పోతే నా ప్రాణం పోయినట్టే! జీవశ్చవాన్ని అయిపోతాను నేను. ఆ వస్తువుని తిరిగి నేను పొందాలంటే ఏ ముష్టివాడికి నా బట్టల్ని దానం చేశావో ఆ ముష్టివాడ్ని వెదికించి ఆ వస్తువు నాకు దొరికేలా చేయ్. కమాన్, ప్లీజ్, అర్జంట్."
ఎక్కడాలేని ఆవేశం ధ్వనిస్తోంది ఆ గొంతులో.
నందిని విస్మయంగా చూసిందతనికేసి.
"జేబులో వెదికించాను ఇచ్చేసేముందు. అంత విలువయిన వస్తువులేమీ నాకు కనిపించలేదే! ఏమిటది?" అడిగిందామె.
"కార్డ్స్.... ప్లేయింగ్ కార్డ్స్.... ఆత్రుత....
అతని మాటలు వింటూనే నందిని పడీపడీ నవ్వడం మొదలుపెట్టింది. ఆమె ముందుకి వంగి నవ్వుతూంటే పవిట బ్రోచ్ సిన్ నుంచి కిందికి వేలాడుతూ జాకెట్లోంచి ఎనభైశాతం బయటపడిన వక్షోజాలు కనువిందుని, మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంటే చటుక్కున తల తిప్పుకున్నాడు పరుశురాం.
ఆకలిమీదున్న సింహంలా మీదికి దూకుతాడనుకున్న నందినికి మళ్ళీ నిరాశే కలిగింది. దాంతో ఆమెకి కోపం వస్తున్నా అణచుకొని అతనికేసి చూస్తూ నిర్లక్ష్యంగా....
"ఆ పాత పేకముక్కల కోసమూ యింత హడావిడి. ఏడ్చేనట్టి వుంది పరుశురామ్. వాటిని పారేశాను" అంది.
ఆమె నిర్లక్ష్యమైన సమాధానానికి అతను ఊగిపోయాడు.
"అయ్" గాలిలోకి అతని చేయి లేచింది.
అంతలోనే తమాయించుకుని ఆగిపోయాడు.
అసంకల్పితంగా జరిగిన ఆ సంఘటనకి నిర్ఘాంతపోయింది నందిని.
అదే మరో వ్యక్తి తనపట్ల ఆ విధంగా ప్రవర్తిస్తే కొరడాతో ఒళ్ళు చీరేసేది!
అతనిపట్ల ఆమెకున్న ఏవో... ఏదో.... ఇష్టం, అభిమానం ఆమె ఉద్రేకాన్ని చల్లార్చింది. అయినా....
"పరుశురామ్!" ఖంగుమంది ఆమె గొంతు. ఆ గొంతులోని తీవ్రతకి చిగురుటాకులా కంపించాడతను.
"రామ్!" ఈసారి ఆమె గొంతులో అమృతధారలు.
"ఆగావే! ఎత్తిన చేయి దించకూడదు. అది మగాడి లక్షణం కాదు. ఘట్స్ వున్న మగాడ్ని నేను ప్రేమిస్తాను, అభిమానిస్తాను. పిరికితనం అంటే అసహ్యం నాకు. అలాంటివాళ్ళను నేను ద్వేషిస్తాను."