Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 58


    అని తనలోఁదాను తలపోసికొనుచు కవచమును విడిచి , ఖడ్గమును గడిగి శుభ్రమొనర్చి గదిలోని దేవుని యరుఁగుముం దుంచుండేను. ఇంతలో స్నానము చేయుఁడు. దొడ్డిలో వేడినీరు సిద్దముగానున్న" దను శబ్దము వినవచ్చెను.
    ఆ మాటలు తన యర్ధాంగ లక్ష్మివే యని కంఠస్వరమును బట్టి తిక్కన గురించినాఁడు'. కానీ యా సతీశిరోమణి సహజమదురములైన హక్కుల మెత్తఁదనములో నేఁడొక క్రొత్తఁదన ముండుట గమనించి స్నానోచిత వస్త్రములను ధరించి యాతఁడు దొడ్డిలోనికిఁబోయెను. తిక్కన కిదియంతయును మిక్కిలి విచిత్రముగాఁదోచెను. అతఁదు పీఁటపై గూర్చుండి బిందెలోని నీరు ముంచుకోనఁబోయెను. ఆ నీటి నిండ వేపాకులు, తములపాకులు వేయబడియుండెను ఇంతలోఁ దిక్కున భార్య యొక నులకమంచమును గొనివచ్చి భర్తగారి కడ్డముగాఁ బెట్టి దానిపై నొక  కంబళిని గప్పెను.
    తన సతీమణి చేయుచున్న విచిత్రకృత్యముల కెంతయు విస్మయమంది తిక్కన "ఇది యంతయు నేమి? నేఁటి నీ చర్యలన్నియు నద్భుతముగా నున్నవే?' యని భార్యను బ్రశ్నింపనామేయు" నిందు విచిత్ర మేమున్నది? నేను దమకుఁదగినట్లే యేర్పాట్లు గావించితిని" ననెను. తిక్కన కొంచెము కోపముతో "నిదేమి? నేనేమి యాఁడుదానా ననుకొంటివా! ఈ పసుపుముద్దలేమి? ఈ తెరచాపలేమి?" యని అడిగెను.
    అయన భార్య పతివాక్యముల కొకింత మందహాసము గావించి "నిజమే! తమ రాఁడువారు గాక మగవారని ఎవరనుకోనఁగలరు? శత్రువులకు వెన్ను చూపినవాడు స్త్రీలు గాక పురుషులగుదురా? ఈ యింటి యందింతకు మందిరువురమే స్త్రీల మున్నామనుకొంటిని. నేఁడు తమతో మువ్వురమైనాము. కాన సిగ్గుపడుటెందులకు ? స్నానము గానింఁడని పలికి యొకమాటు నిర్లక్ష్యభావముతో పతి వదనము వైపు వీక్షించి లోనికిఁబోయెను.
    భార్య పలికిన మాటలు కత్తిపోటులవలె నా వీరగ్రేసరుని హృదయ మునకుఁ దగిలేను. అతని కన్నులముందుఁ బ్రపంచమంతయు గిర్రున నొకమాటు తిరిగిపోయినట్లుండేను. నోట మాట వెలువడుటయే కష్టమయ్యెను. మిన్ను విరిగి నెత్తిఁపై గూలి నట్లయ్యేను. అతి కష్టముతో నతఁడేదో విదముగ స్నానమును ముగించుకొని భోజనమునకై వంటయింటి లోనికిఁ బోయెను.
    తల్లియగు ప్రోలమంబిక వెండి పళ్ళెములో నన్నమును వడ్డించి ప్రక్కఁగా గూర్చుండేను. తిక్కన తల్లిని దలయెత్తి చూడఁజాలక యట్లె యవనత ముఖముతో వచ్చి పీఁటపైఁ గూర్చుండి భోజనము సేయ నారంభించెను. కాని ముద్దలోనికిఁ బోలేదు. దుస్సహపరాభవ పరితప్తమనసుండగు నా వీరున కన్న మెట్లు రుచించును?ఎట్లో రెండు ముద్దలు నోట వైచుకొని మజ్జిగఁబోయమని తల్లి నడిగెను. ఆమెయు నొక పాత్రములో విరిగి పోయిన పాలను గొనివచ్చి కుమారుని కంచములోఁబోసేను. అది గాంచిన తిక్కన యులికిపడి "అమ్మా! ఇదియేమి? విరిగిపోయిన పాలు పొసితివేమి?" అని యడిగెను. ప్రోలమాంబయు "నాయనా! నీ పితృపితామహాదులందరు పిరికిపంద యేఱుంగని వారు. వారెప్పుడు సంగ్రామరంగమున శత్రు సైన్యములకు వెన్ను చూపి పారిపోయిరాలేదు. ఈనాఁటికి మా వంశోద్ధారకుఁడవైన నీవు పుట్టి పౌరుషము తరిగి విరిగి పరుగిడివచ్చితివి. కనుకనే కాఁబోలు పశువుల పాలును విరిగినవని యెత్తిపొడిచెను.
    గోరుచుట్టుపై రోఁకటి పోటువలె పత్నీ పరాభవ పరితప్త హ్రుదయుఁడగు తిక్కన కీయవమానము సహింపరానిదయ్యేను. అతఁడంతటితో భోజనమును ముగించెను. ఇఁక నొక క్షణమేనియు నా గృహములో నిలువఁజాలకపోయెను. తాను గావించినాపని యెంతటి యవమానకరమైనదో యాతనికిప్పుడు బాగుగా బోధపడెను. వెంటనే కవచమును దొడిగికొని, ఖడ్గమును కేంగెల ధరించి, యిష్టదేవతమునకు నొక్క పర్యాయము హృదయపూర్వకముగా నమస్కారము నోసరించేను. ఆ దేవత చరణములందలి పూజా కుంకుంమమును భక్తీ పూర్వకముగా ముఖమున ధరించి ప్రళయ కాలభైరవుని విధమున దేవమందిరము నుండి వెలుపలికి వచ్చి యశ్వము నాయత్త మొనర్చుమని సేవకుని కాజ్ఞాపించెను.
    ప్రాణనాధుని నూతన రాణోత్సాహమును దిలకించి యాతని యార్ధాంగలక్ష్మియగు చానమ్మ యత్యంత సంతోషముతో మూర్తిభావించిన యుత్సాహశక్తివలెఁ బతి సాన్నిధ్యమున  కరిగి తదీయ పదకమలములకు నమస్కారము లాచరించి నాధా! ఈనాఁడు నేను గావించిన యవమానము నకుఁ గినుక నందకుఁడు . నిరుత్సాహముతోఁ దిరిగివచ్చిన మీకుఁ దిరిగి యుత్సాహము నుప్పొంగించు నుద్దేశముతో నట్లు పలికితిని గాని యన్యము గాదు. నేను పలికిన కార్యములకు నన్ను దయతో క్షమింపుఁడు. పురుషులకుఁ బౌరుషమే కదా ప్రధానము.  పాంచభౌతికమగు నీ దేహము శాశ్వతము గాదు. యశశ్శరీరము మాత్రమే శాశ్వతము. కనుక వీరాధివీరులై  శత్రుసేనాసముహ మూలఁబారద్రోలి యాత్మగౌరమును నిలఁబెట్టుకోనుఁడు. జన్మభూమిని బరులపాలు గావింపకుఁడు. "జననియును జన్మభూమియును స్వర్గమున కంటే నుత్త\మోత్తమము" లని పెద్దలు చెప్పుదురు గదా! ఇది తెలుగుగడ్డ. తెలుఁగుగడ్డలోఁ బుట్టిన తెలుఁగు బిడ్డ పిరికికండ యేఱుంగఁడను ప్రతిష్టను గాపాడుఁడు" అని పలికెను.
    రణతిక్కనయు వీరనారీలలాను యగు నర్ధాంగి పలుకుచున్న యుత్సహసముత్తేజకములగు నుద్రేకవాక్యములను విని యానందించి యామెను వీడ్కొని జననీజనకుల చరణ కమలములగు సాష్టాంగనమస్కారం లాచరించి వారి యాశీర్వాదముల నందుకొని యశ్వమునెక్కి కోటలోనికిఁ జనియెను'.
    దుర్గమునఁ బ్రవేశించి రణభేరిని మ్రోగించేను. సమర సన్నద్ధులై యశ్వముల నదిరోహించుచున్న తన యోదాగ్రేసరులతో వెలుగెత్తిఁ యిట్లు పలికెను. "వీరాధివీరులారా! యలసించక యాలమునకు సంసిద్ధులు కండు. ఈనాఁటితోఁ గాటమరాజు గర్వము నేలమట్టము గావింపవలయును. లేదా మనమందఱమును రణరంగమున బలియై పోవలయును. హరిహరనాధుని యనుగ్రహమున ననాయాసముగానే యరాతి సంచయములఁజించి చెండాడి ధర్మముగా మనకు రావలసిన పుల్లరిని మనము గైకొనఁగలము. భగవంతుఁడను కూలింపఁడా , మన వీరధర్మమును మనము నిర్వర్తించుకొన్నవారల మగుదుము. లెందు; లెం" డని ప్రభోధించునంతలోనే సైనికులందరు వీరావేశపరవశులై తమతమ యాయుధములు ధరించి ద్విగుణీకృతముతోఁదమ సేనానాయకు ననుగమించిరి.

 Previous Page Next Page