Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 56


    యుద్ధభేరి మ్రోఁగసాగినది. ఉభయ సైన్యములును రణరంగమునఁ బ్రవేశింపఁ బోవుచుండెను. సేనాధక్షులగు బ్రహ్మరుద్రయ్యయు ఖడ్గతిక్కనయు నొకరి నొకరు గౌరవపూర్వకముగఁ జూచుకోనిరి. ఇరువురును బ్రాహ్మణులే! ఇరువురును మహావీరులే!
    తమ తమ సైన్యములకు నాయకులనుజ్జనొసంగిరి. యుద్దము ప్రారంభమయ్యెను. రణరంగమంతయు వీరుల సింహనాదములతోఁ బ్రతిధ్వనించుచుండెను. రెండు పక్షముల యందు సైనికులు కుప్పలు కుప్పలుగా నేలఁ గూలుచుండిరి. సంగరము భయంకరమయ్యెను. తలలు బంతులవలె నాకాశమున కేగిరిపోవుచుండేను. హస్తములు తెగిపడుచుండెను. రక్తము కాలువలు గట్టెను. మొండెములు కొండలవలెఁ గానవచ్చుచుండెను. ఖడ్గతిక్కన ఖడ్గమును గిరగిర త్రిప్పుచు "నిలుఁచు నిలుఁచు "పోకుఁడు,పోకుఁడు " అని హెచ్చరించుచు శత్రువీరుల శిరస్సులను రణభూమికి బలికావించుచుండెను.
    ఇంతలో కాటమరాజు ఖడ్గతిక్కనను సమీపించి నమస్కరించి "బ్రాహ్మణోత్తమా! మీరు బ్రాహ్మణులు. మేము యాదవులము. మాకును మీకును యుద్దము ధర్మము గాదు. మీరెలా యుద్దరంగమునకు వచ్చినారు? ఏ మాత్రము మేము తొందరపడినను మాకు బ్రహ్మహత్యపాతకము బ్రాప్తించును గదా" యని పలికెను.
    ఖడ్గతిక్కన యాగ్రవేశాముతో "ఓహో! కాటమరాజుగారా! ఎంత న్యాయముగా మాటలాడుచున్నారు! ఇన్ని ధర్మమూ లెప్పుడు నేర్చినారు? మా పుల్లరి నీయవలసి వచ్చినపుడు తమ కీజ్ఞానవాక్యములన్నియు నెచ్చటకు పోయినవి" అని యేమో పలుకుచుండునంతలో యాదవ సైన్యములు విజ్రుంభించి తన సైన్యములపైఁ బడుట నాతఁడు గమనించెను.
    ఇదియంతయు కాలయాపనముకై కాటమరాజు కావించు కుతంత్రమని నిశ్చయించి కత్తి త్రిప్పుచు మరల కాదనరంగమున కురికేను. కాని తన సైన్యములన్నియు చెల్లాచెదరై పోరిపోవుచుండుట చూచి "ఓహో! కార్యము తప్పివచ్చినదే" యని ఎలుగెత్తి ఇట్లు సంభోదించెను. "ఓ వీర సైనికులారా! సంగరమునఁ బారిపోవుట వీర ధర్మము గాదు. మన మహారాజు ఋణము దీర్చుకోనుఁడు సింహపురమున కపఖ్యాతి కలిగింపకుఁడు వెనుదిరుగుఁడు వెనుదిరుగుఁ"డని యెన్ని విధములఁ బ్రబోదించినను లాభము లేకపోయెను.
    దాదాఁపు  సైన్యమంతయును పట్టణాభిముఖమై పరుగిడిపోవుచుండేను. ఖడ్గ తిక్కన కేమియును దోఁచలేదు. యాదవ సైన్యమా సముద్రమువలె ననంతమైయుండెను. తానెంత వీరుఁడైనను నొంటరిగా నంత సైన్యముతో నెట్లు మార్కోనఁగలడు? ఇది యంతయు యాదవరాజు కుతంత్రముచేఁ గలిగిన ఫలము అతఁడు తిక్కనను సంభాషణలోనికి దింపి కాలయాపన గావించుటచే నీలోపల యాదవ సైన్యములు విజ్రుంభించినవి.
    ఆతని హృదయములో నొక యూహ తోఁచెను. "కానిమ్ము ఇప్పటికి రణరంగమునుండి తొలఁగిపోయి మరల సైన్యమును గూర్చుకొని వచ్చి యీ దుర్మార్గుల గర్వమడం? చెదఁగాక . తొందరపడి యిందరతో మార్కొని కార్యమును పాడు చేయుట కంటే నిదియే యత్తమ" మని తలఁచి గుఱ్ఱమును మరల్చుకొని నగరాభిముఖఁడై పోయెను. కాటమరాజు తాను పన్నిన యుక్తికి సంతోషించుచు జయము గాంచిన తన సైనికుల నభినందించి సేనా నాయకులను గొనియాడి మహానందముతో మైమరచియుండెను.
    

                                              5

    ఏ వీర శిరోమణి బహుబలపరాక్రమములు మనుమసిద్ది మహీపాలునకు శ్రీరామరాక్షయై చెన్నారు'
చుండేనో, ఏ దీరాగ్రేసరుని యసమాన వీరవిహారము లాబాలగోపాలములచేఁ గొనియడఁబడుచుండెనో, ఏ శూర శిరోరత్నము తేజఃపుంజము పరసేనా సమూహములకు దరియరానిదో, ఏ మానధనుని భీకర కరవాలము విక్రమసింహపురమునకుఁ బెట్టనికోటయై వెలుఁగొందుచుండేనో, ఏ సాహసోపేతుని విజయగాధలు వృద్దులు తమ బాలురకుఁగాధలుగాఁ జెప్పుచుందురో యా ప్రతిపక్షభయంకరప్రతాపుఁడు ఖడ్గతిక్కన నేఁడు చెదరిన హృదయంతో - బెదరిన గుఱ్ఱముతో - చిందర వందరైన శిరోజములతో - శిదిలములైన భూషణములతో సంగ్రామరంగమునుండి పిరికిపందవలె గృహమునకు పర్వేత్తి వచ్చుచున్నాఁడు! ఆహా దైవ మహిమ!
    ఇట్లు ప్రత్యర్ధి సేనావాహినిచేఁ బరాభూతుఁడై కదన రంగమున విడిచి ఖడ్గతిక్కన పురములోనికిఁ బరువేత్తుకొని వచ్చుచున్నాఁడను వార్త పట్టణము నందందరకుఁ దెలియవచ్చెను. పరిపరివిధములఁ బురజనులందరు తిక్కనను నిందింప సాగిరి. కొందరు "ఇంతవరకు నెమో యనుకొంటిమి. సిద్దనామాత్యుని కుమారుఁడింత పిరికిపందయా!" యని గేలి చేసిరి. ప్రోలమంబ గర్భమునఁ జేడఁబుట్టినాఁడని పెద్ద ముత్తయిదువలు దిట్టసాగిరి. చిన్నచిన్న బాలకులు సైతము కరతాళములు వాయించుచు ఖడ్గతిక్కన వెంటపడి "వచ్చేనయ్యా రణవీరుడు" అని గోల సేయసాగిరి. కొందరు స్త్రీలు భవనో పరిభాగముల నిలిచి రణతిక్కన మొగము చూచి పేటపేట మెటికలు విరువ నారంభించిరి. ఎటు గాంచినను వేళాకొళములే! ఏ ప్రక్కఁజూచినను పరిహసములే! ఎందు విన్నను నిందా వాక్యములే!
    సంగ్రామరంగమునకుఁ బోవుసమయమున నే వీధులలో సతీమణులు మంగళహరతులిచ్చి లాజలు జల్లి దీవించిరో యా వీధులలోనే యా సతీమణులే పెడకల్లాపి చల్లి శపింపసాగిరి. "శుభమగుఁగాక" జయమగుఁగాక" యని పలికిన ముఖముల నుండియే "ఛీ ఛీ " యను తిరస్కారధ్వనులు వెలువడసాగెను. అప్పుడు గౌరవము- ఇప్పుడగౌరవము. అప్పుడు పుష్పవర్షములు - ఇప్పుడు శిలావర్షములు. అప్పుడు రాణోత్సాహము - ఇప్పుడు నిరుత్సాహము . ఎంతలో నెంత మార్పు! పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మవలసి వచ్చెను గదా!
    రణతిక్కన లజ్జావనతవదనుఁడై గుఱ్ఱముమీఁదఁ గూర్చుండి గృహాభిముఖఁడై పోవుచుండెను. ప్రజా సమూహము పలుకు పలుకులు ములుకులు వలె నాతని చెవులకు గ్రుచ్చుకొనుచుండెను. దుర్భరవమానముతో నా వీరుని గుండెలు కుమిలిపోవుచుండెను. అట్లే రణరంగమున నిలిచి పోరాడి ప్రాణములఁ బాసినచో వీరందరి కన్నులు చల్లఁబడి యుండును కాఁబోలు! తిక్కన మహావీరుఁడని పొలికేకలు పెట్టేడు వారు కాఁబోలు! వాని మృతకళేబరమును మహా వైభవముతో నూరేగించెడువారు కాఁబోలు! ఆహా! యుక్తాయుక్తము లేరుఁగని యా మూడ ప్రజలు మహా శూరాగ్రేసరుఁడగు తిక్కన హృదయమును, పరాక్రమవైభవమును, సమయోచిత ప్రవర్తనమును గుర్తింపలేకపోయిరి గదా!
    గృహము సమీపించిన కోలఁది ఖడ్గతిక్కన హృదయము మరింత వ్యాకులమగుచుండెను. నిజగేహమున జననీ జనకులేమని తలంతురో , యెట్లు తూలనాడుడురో యని యాతఁడు లోలోనఁ గుందుచుండెను. తనకిట్టి దుస్థితి దేచ్చిపెట్టిన తన దురదృష్టమున కెంతయు దురపిల్లుచు హతశేషమగు సైన్యమును దుర్గములోని కంపి మరల నాయాజ్జయగు నంతవరకు గమనాయాసము దీర్చుకొండని వారలను హెచ్చరించి నిజగృహభిముఖుఁడయ్యెను.

 Previous Page Next Page