Previous Page
భార్యతో రెండో పెళ్ళి పేజి 50


    డాక్టర్ స్వామి పేరు వినగానే వివేక్ మొహం పాలిపోయింది ఈ రహస్యం మరొకరి నోట వినలేదు అతడు... పాలిపోయిన వివేక్ మొహం చూసి ఆనందించాడు వీరన్న మనసులో జానీకి థేంక్స్ చెప్పుకున్నాడు.
    "ఓ, ఎంత కావాలీ?"
    "ఎంత? జస్ట్ పదివేలు!."
    "ఓ"
    డబ్బు తీయటానికన్నట్లు వెనక్కి తిరిగి, సడెన్ గా వీరన్న కడుపులో ఒక్కతాపు  తన్నాడు వివేక్.
    ముందుకు పడ్డాడు వీరన్న అంతలో మెరుపులా లేచి, కత్తితో వివేక్ మీదకి వచ్చాడు ఆ కత్తిని వివేక్ తప్పించుకునేవాడే కానీ సమయానికి అక్కడికి వచ్చిని దేవిశంకర్ మెరుపు వేగంతో కత్తికీ, వివేక్ కీ అడ్డుగా వచ్చాడు.
    కత్తి దేవిశంకర్ పొట్టలో దిగిపోయింది వీరన్న పారిపోయాడు దేవిశంకర్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు యశోద, జానీ వచ్చేటప్పటికి అంతా అయిపోయింది.
    "సారీ ఈ కిరాయి గూండాలు ఎలాంటి వాళ్ళో దేవిశంకర్ కి పాఠం చెప్పాలనుకున్నాను! కానీ ఇంత జరుగుతుందనుకోలేదు" బాధపడ్డాడు జానీ.    
                                                             * * *
    ప్రసూన ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు దేవిశంకర్ చావు బతుకులలో ఉన్నాడు.
    "ప్రసూనా ఒక చిన్న కోరిక" అన్నాడు.... భార్యని తప్ప మరెవరినీ చూడటం లేదు.
    "చెప్పండి"
    "నన్నొకసారి ముద్దు పెట్టుకో"
    శిలలా ఉన్న ప్రసూన కళ్లలో సముద్రాలు పొంగాయి. ముందుకు వంగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది రక్తసిక్తమైన అతడి శరీరాన్ని ప్రేమతో కౌగలించుకుంది కఠోర ముద్ర స్థిరపడిన అతడి ముఖంలో మధురమైన మందహాసం విరిసింది.
    ఆ కౌగిలిలోనే అతడి ప్రాణం పోయింది.  
    దేవిశంకర్ అంత్యక్రియలు వైభవంగా పూర్తి చేశాడు వివేక్. కానీ తల్లిలో మాత్రం చైతన్యం తీసుకురాలేకపోయాడు విగ్రహంలా కూచోవటం తప్ప, చలనం లేదు. తిండి లేదు, నీళ్ళు లేవు.  
    "అమ్మనాన్నగారిని ఇంతగా ప్రేమించిందని నేను ఏనాడూ ఊహించలేదు" అన్నాడు వివేక్.   
    ప్రసూన ఇక బ్రతకదన్నట్లు మాట్లాడాడు డాక్టర్.
    యశోదకి ఒక ఉపాయం స్ఫురించింది. ఆడుకుంటున్న పింకూని తీసుకొచ్చి ప్రసూన ఒళ్ళో వేసింది.
    నాయనమ్మ తనతో మాట్లాడకుండా, ఎటో చూస్తోంటే పింకూకి కోపం వచ్చి జుట్టు పట్టుకుని పీకాడు అప్పటికీ నాయనమ్మ తనవైపు చూడకపోతే, గోలగోలగా ఏడ్చేశాడు.
    సమాధి భగ్నమైన యోగినిలా పసివాడిని చూసింది ప్రసూన.
    "యశోదా పింకూ ఏడుస్తున్నాడు చూడు" అంది ఓపిక లేని గొంతుకతో.
    "ఇంక ఫర్వాలేదు ఈవిడ కోలుకుంటుంది" అన్నాడు ప్రసూని పరీక్షిస్తున్న డాక్టర్.
                                     * సమాప్తం *                                      

 Previous Page