Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 27

   
     ఇప్పటికి బోధపడింది స్పష్టంగా . "నేను సమర్థుడ్ని రణధీర్ . నాకు మనుషుల అండ అక్కర్లేదు. ఏమిటి,ఎప్పుడు , ఎందుకు,ఎలా,  ఎక్కడ ,ఎవరు అనే ఆరుగురు నాకు అత్యంత ప్రీతిపాత్రమరయిన ప్రశ్నలూ, స్నేహితులూను. వాళ్ళు చాలు నీకు షాచెప్పటానికి!" ఫోన్ క్రెడిల్ చేశాడు.


    ఇక్కడ చర్చ ఇలా ముగిసిన సమయానికి మురారి వచ్చాడు ఏ.ఎస్.పి. మేనక దగ్గరికి.

 

    "మేడం! రాజయ్యగాని, అతని కూతురు మల్లిగాని ఊళ్ళోలేరు. ఎక్కడికి వెళ్ళిందీ ఎవరూ చెప్పలేకపోతున్నారు."

 

    మేనక ఆలోచనలో మునిగిపోయింది.రణధీర్ సాక్ష్యాన్ని గల్లంతు చేయడానికి అప్పుడే పావుల్ని నడపడం మొదలు పెట్టాడా?

 

                           *    *    *    *

 

     ఫోన్ రింగవుతుంటే అర్థరాత్రివేళ నిద్రలేచింది  మేనక. గోడుకున్న డిజిటల్ వాచ్ రాత్రి  పన్నెండున్నర అయినట్లు చూపుతుంది. ఒడలికగా రిసీవరు అందుకుంది. " హల్లో!"

 

    "మేనకా? గొతు గుర్తుపట్టలేకపోయింది.

 

    "నేను రాజీని."

 

    " మేనకా.... నువ్వు మల్లికోసం గాలిస్తున్నావు కదూ? " వెంటనే రాగలవా? అర్జెంటు మేనకా, మల్లిని ప్రస్తుతం ఓ గోడౌన్ లో దాచేశారు. మరో పది  నిముషాల్లో మా ఆయన తరలించబోతున్నాడు.బహుశా చంపేస్తాడేమో కూడా."

 

    మేనక అవాక్కయి వింటూంది.

 

    "మరేవర్నీ పంపేప్రయత్నం చేయకుమేనకా. నీకు  తెలీదు నీ డిపార్ట్ మెంటులో ఎవరొచ్చినా కొనేయగలడు మా ఆయన. నువ్వే .... నువ్వే స్వయంగా వస్తే మంచిది."

 

    "ఎడ్రసు చెప్పగలవా?"

 

     చెప్పింది ఆందోళనగా.

 

     మరో పదిహేను నిముషాల్లో నగరానికి ఓ మూల ఉన్న పుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ కి చేరుకుంది.ఏ. ఎస్. పి. మేనక.

 

      జీపును ఓ ఫర్లాంగు దూరంలో ఆపి రాజీ చెప్పిన మూడో గోడౌన్ చేరుకుంది.

 

     తెరుచుకున్న చిన్న ట్రాప్  డోర్ లో చీకటి. నిర్జీవంగా ఉన్న ఆ ప్రదేశంలో నడుస్తూ తానెంత రిస్క్ తీసుకుంటున్నదీ గుర్తుంచే స్థితిలో లేదామె.

 

     రెండు అంగల్లో  లోనికి అడుగు పెట్టింది.

 

    గుట్టాల్లా పేర్చబడిన బస్తాలు. మధ్యలో  సన్నని బాట. ఇరవై అడుగులు నడిచిందో లేదో వెనుకడోర్ మూసుకన్న చప్పుడు

 

     గబాలున వెనక్కి తిరిగింది. అంతే! ఓ మూల నుంచి వస్తున్నాడు రణధీర్.

 

    ఇప్పుడు తను ఓ వలయంలో చిక్కుకుపోయానని గ్రహించేసరికి ఆలస్యమైపోయింది.


    
     మేనక చేయ రివాల్వర్ ని చేరకముందే ఇద్దరు వ్యక్తులు ఆమెను  వెనుక నుంచి పట్టుకున్నారు.


    
     అక్కడ మల్లిలేదు.అసలు చేరకముందే ఇద్దరు వ్యక్తులు ఆమెను దెబ్బతీయాలని రణధీర్ విసిరిన వలలో ఇప్పుడు తను ఇరుక్కుపోయింది.    

 

    ఇండియన్ పోలీస్ సర్వీస్ అవుట్ డోర్ ట్రైనింగ్ లో రహస్యస్థావరాలపైన దాడి  గురించీ, " ఆంబుష్  అండ్  రికవరీ" గురించి ఫీల్డ్ లో చాలా నేర్చుకుంది.

 

     కాని ఇది ఆమె ఊహించని విపత్కర స్థితి.

 

    ఏ మల్లికోసం తను గాలిస్తుందో, ఆ "మల్లి విషయంలో రాజీ ఫోన్ చేయడాన్ని నిజాయితీగా నమ్మింది తప్ప, ఇదిరణధీర్  ప్రయత్నమని అనుమానించలేకపోయింది.

 

    0.38 రివాల్వర్ నేలకి జారిపోయింది.


    
    మసక వెలుతురులో ఎవరో నెట్టినట్లు ముందుకు తూలిపడిన గోనెసంచుల పైనుంచి వేగంగా కదలబోతూ టక్కున ఆగిపోయింది.    

 

     తప్పించుకునే అవకాశం  లేనట్టు చుట్టూ నిలబడి  ఉన్న దుండగలు, నెమ్మదిగా పైకి చేరుకుంటున్నాడు రణధీర్.

 

    ముందు మానసికంగా బలహీనురాలేపోయింది.
    


     అదే రణధీర్ గ్రహించిన విషయం కూడా.


    
     "నిన్ను సాధ్యమైనంత త్వరలో నంజుకోవాలనుకున్నాను గాని, ఇంత సులభంగా అలాంటి అవకాశం దక్కుతుందని కలగనలేకపోయాను మేనకా!" మొహంపైన పడుతున్న క్రీనీడలో కదులుతున్న శవంలా కనిపిస్తున్న రణధీర్- " నువ్వు యూనిఫారంలో ఉండగానే...."

 

    అసహ్యంగా ఉంది ఆ మాటలు వింటుంటే. అంతకుమించి ఇలాంటి ఓటమికి ముందే తనకు తాను ఆత్మాహుతి చేసుకునే అవకాశముంటే బాగుణ్ణనిపిస్తూంది.

 Previous Page Next Page