రామదాసు లోపల కొచ్చేస్తున్నాడు.
"వీడు నన్ను... ..." అంటూ బావురుమంది కాశ్మీర.
విజయ్ చకితుడయ్యాడు. తన పరిస్ధితి విషమించిందని తెలుసు కోడానికి ఎంతోసేపు పట్టలేదతనికి.
విజయ్ మెరుపులా బాల్కానీలోకి పరుగెత్తాడు ఒకే ఒక అంగతో అటువేపుకి దూకేసి మెట్లు దిగి రోడ్డుమీది కోచ్చేశాడు విజయ్.
"పట్టుకోండి, దొంగ, దొంగ!"
వెనుకనించి కేకలు, కొన్ని ఇళ్ళలో దీపాలు వెలిగాయి వెనక కుక్కలు అరుస్తూ వెంటపడ్డాయి.
విజయ్ కళ్ళకేమి కనబడ్డంలేదు పరుగుదీస్తున్నాడు.
ఎక్కడికో తెలీదు.
దొరికితే పోలీసులకి అప్పగిస్తారు. ఓ ఆడపిల్లని చేరచడానికి ప్రయత్నం చేశాడన్న ఆరోపణమీద శిక్ష పడుతుంది.
కఠీన శిక్ష.
జైలు శిక్ష!?
పరుగు ఆపలేదు పరుగేత్తుతూనే వున్నాడు విజయ్.
ఆయాసంగా వుంది. చమట్లు పడుతున్నాయి. వెనక్కి తిరిగి చూడాలంటే భయం.
ఇసుక పర్రలోంచి ర్తెలు కట్ట పక్కగా పరుగు దిస్తున్నాడు.
కంకర రాళ్ళలో నడక వేగం తగ్గించి, తూలిపోతున్నాడు .
ఇప్పుడేం చెయ్యాలి?
తెల్లారేసరికి విషయం వూళ్ళో గుప్పమంటుంది. పోలీసులు పట్టుకుంటారు.
అప్పడే స్టేషనులో రైలు కదిలింది. మెల్లగా వస్తోంది రైలు ఎదురుగా పరుగెత్తాడు విజయ్. గభాల్న ఓ కంపార్టుమెంటులోకి ఎక్కేశాడు.
బరువైన నిట్టూర్పు వదిలి శ్వాస తీసుకున్నాడు విజయ్.
కంపార్ట్ మెంటంతా ఖాళీగా వుంది. తేలిగ్గా వూపిరి పీల్చుకుని ఒక్కసారి భాస్కరాపురం వైపు చూశాడు. అట్నుంచి ఏమీ కనబడ లేదు. అంటే తన వెనక ఎవరూ రాలేదు.
రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు.
అది లంకణాల బండి, చాలా మెల్లగా ప్రతి స్టేషనులో ఆగుతూ, గడుస్తూ పోతుంది. బందర్నుంచి బెజవాడ పోవడానికి నాలుగైదు గంటలు పడుతుంది పాసింజరు బండికి.
అతనికి తల పగిలిపోతున్నట్టుగా వుంది. పెడన స్టేషనులో ఆగింది రైలు ఒక్కసారి అనుమానంగా ఫ్లాట్ ఫారం మీదకు చూశాడు ఎవరూ లేరు. రైలుకి క్రాసింగ్ వున్నట్టుంది, కదలడంలేదు. మెల్లగా దిగి వెళ్ళి బెజవాడ వరకు టిక్కెట్ కొన్నాడు విజయ్.
అయిదు నిమిషాల తర్వాత గుంటూరు బండి రావడంతో తిరిగి రైలు కదిలింది.
అర్జునకి సంగతి తేలిస్తే తనని క్షమిస్తుందా?
అసహ్యించుకొంటుంది, ఏడుస్తుంది. "నువ్వు ఇంత వెధవ్వని నాకు తెలిదు" అంటుంది.
కాశ్మీర ఎందుకలా చేసింది?
మాటలు కలిపింది.
రెచ్చ కొట్టింది.
ఆహ్వానించింది.
తండ్రితో ఎందుకలా చెప్పింది. పిడికిలి బిగునుకుంది. కోపంతో వణికిపోయాడు విజయ్.
తనే పిలిచానని, తప్పు తనదే అని కాశ్మీర తండ్రితో చెప్పి వుంటే తానింత దౌర్భాగ్యపు స్ధితిలో పడిపోయే వాడు కాదు.
తన మానసిక దౌర్బల్యం ఎంత వినాశానికి దారితిసిందో కళ్ళారా చూస్తూ అనుభవిస్తూ ఇప్పుడు విచారిస్తున్నాడతను.
చేతులు కాలాక ఆకులు పట్టుకోడం అంటే ఇదేవేమో!
అతని కేడుపోచ్చింది.
"రాక్షసి" అనుకున్నాడు.
కాశ్మీరని చంపేయాలి. తన బతుకుని నిలువునా కాల్చిపారేసిన ఆ కామిని పిశాదాన్ని బ్రతక్కుండా ఖండ ఖండలుగా నరకాలి.
"కాశ్మీర!" పళ్ళు పట పట కొరికాడు. తాచుపాములా బుస కొట్టాడు.
కానీ తనేం చేయగలడు? ఇప్పడేక్కడికెళ్ళాలి?
ఎదురుగా వున్నా ప్రశ్నఅది.
సొంతవూరు మేనమామ దగ్గర కెళ్ళితే?
బాధతో నవ్వుతున్నాడు.
తన పిచ్చేగాని, ఆ వూళ్ళో తను పోలిసులకి దొరకకపోతే ముందు అక్కడికే వస్తారు దర్యాప్తుకి.
జైలు శిక్షపడి నేరస్దుడిగా బతికేకంటే చావడం నయం.
ఆందోళనతో, బాధతో అతని కళ్ళు తడయినాయి.
జేబులో చూచుకున్నాడు.
యాభై రూపాయలున్నాయి.
ఆ డబ్బుతో ఎన్నిరోజులు గడపగలడు?
కాశ్మీరే తనని కావాలని పిలిచిందని వాదించి ప్రయోజనం లేదు.
కాశ్మీర మైనర్ బాలిక.
రైలు ఏవన్నా స్టేషన్ లో ఆగినప్పడల్లా దొంగలా బయటకి చూస్తున్నాడు విజయ్.
అర్జున అతన్ని దూపిస్తున్నట్టు, 'ఛీ' నీ మొహం నాకు చూపించద్దని చీదరించుకొంటున్నట్టుగా భ్రాంతి చెందుతున్నాడు అతను.
జేబులోంచి సిగరెట్ పెట్టేతిసి సిగరెట్ వెలిగించాడు.
తన నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసిన కాశ్మీరని మట్టుబెట్టాలన్న ఆవేశం అతన్ని కంపింప జేస్తోంది.
ఆడది!
ఎంత ప్రమాకరమ్తెన క్రీచర్ ఆడది అనుకున్నాడు.
"తరిగొప్పల" బయట బోర్టు చూశాడు. బెజవాడ చేరడానికింకా సుమారు గంటపట్టవచ్చు.