Read more!
Next Page 
పెళ్ళి మంటలు  పేజి 1

   
                                                         పెళ్ళి మంటలు   

            
                                                                               -  పోల్కంపల్లి  శాంతాదేవి


        ఆ రోజు ఆదివారం

    రాత్రి ఎనిమిది గంటల వరకు స్నేహితులతో గడిపి ఇంటికి వచ్చాడు మల్లిఖార్జున్.  అతడు గడపలో అడుగు పెడుతూండగానే తల్లి యశోదమ్మ చెప్పింది.

    "పరమేశం మామయ్య వచ్చాడు రా!  లలితత్త కూడా వచ్చింది".

    "ఇద్దరు కలిసి వచ్చారంటే ఏదో విశేషముండాలి."  మల్లిఖార్జున్ కుర్చీలో కూర్చొని బూట్లు విప్పకోసాగాడు.

    "సరిగ్గా  ఊహించావురా! త్రిపురని నీకిద్దామని వచ్చారు."

    "త్రిపురనా?!  నిన్నగాకమొన్న పుట్టిన ఆపిల్లనా?! ఆ పిల్ల బారసాల వేడుకకూడా నాకింకా జ్ఞాపక ముంది"  అతడు విస్మయం వ్యక్తం చేసాడు.

    "ఇంకా ఉయ్యులలో నోట్లో వేలేసుకు చికుతుంధనుకున్నావా? దానికిప్పుడు ఎన్నేళ్ళో తెలుసా?  పది వెళ్ళబోతున్నయి.  ఒకటి రెండేళ్ళలో  ఈడేరుతుందని,  ఈడేరకముందే పెళ్ళి చేసి కన్యాదాన  ఫలం దక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం"

    "ఏమిటో,  ప్రపంచమంతా మారినా,  మామయ్యవాళ్ళు మాత్రం మారరు.  వాళ్ళ సంగతి వదిలెయ్యి.  బొత్తిగా అంత చిన్న పిల్లని ఇరవ్తే రెండేళ్ళ వాడిని ఎలా చేసుకొంటానమ్మా?"


    "పన్నెండేళ్ళు ఒక వ్యత్యాసమా,  మల్లిక్?  మీ నాన్నగారికి  నాకూ పదిహేడేళ్ళు తేడా.   మా తరం పెళ్ళిళ్ళన్నీ ఇంచుమించుగా ఇలాగే జరిగాయి."

    "అందుకే మీ తరం వాళ్ళలో   బోడెమ్మ లేక్కువ"

    "ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను?  కాని,  మగాడి కంటే ఆడది తొందరగా మ్రాగ్గిపోతుందిరా,  ముఖ్యంగా కాన్పులవల్లా,  చాకిరివల్లా,  అందుకే ముప్పయ్యేళ్ళ మగాడికి మూడేళ్ళపిల్ల  అన్నట్లుగా చేసేవాళ్ళు, నీ చదువు పూర్తి అయ్యేసరికి నాలుగేళ్ళు పడుతుంది. ఈ నాలుగెళ్ళలో త్రిపుర ఈడేరి కాపురానికి వస్తుంది.  చిన్నపిల్ల అని సాకు మాత్రం చెప్పొద్దు.  నాలుగేళ్ళ తరువాత చూశావంటే నీ కళ్ళు చెదిరి పోయేంత అందగ త్తెగా,  సౌష్టవంగా కనిపిస్తుంది.  ముఖ్యంగా మా అన్నయ్యకూతురు కాదనకురా?"
   
    "నాలుగేళ్ళ  తరువాతే ఈ పెళ్ళి ప్రస్తావన తెస్తే బాగుంటుంది కదమ్మా??"

    "పిల్లకు  పదేళ్ళోచ్చాయని అప్పడే అన్నయ్యకు నిద్రపట్టడం లేదటారా! ఇంతవరకు ఆ ఇంట ఏ ఆడపిల్ల ఈడేరాక పెళ్ళి చేయడం జరగలేదు.  త్రిపురని వాళ్ళు ఎక్కవ రోజులుంచరు.   మనం కాదంటే వాళ్ళు వేరే సంబంధం చూచుకొని, ఈ సంవత్సరం పెళ్ళి చేసేస్తారుట" 

    "కొన్నాళ్ళయ్యాక చూద్దాంలే,  అమ్మ"

    "కొన్నాళ్ళయ్యాక   చూసేందు కేమి ఉండదురా,  ఏ సంగతి ఇప్పడే చెప్పాలి.  అన్నయ్యకి  ఒక్కతే ఆడపిల్ల. కావలసినవాళ్ళకి  ఇచ్చుకోవాలని ఆయన తాపత్రయం. మానమ కాదంటే  చాలా బాధపడతాడు. పుట్టింటిపసుపు కుంకుమకు ఆశపడేదాన్నీ,  దేనికి ఆశపడక పోయినా, అన్నయ్యా మనసు నొప్పించి మళ్ళి ఆ ఇంట  అడుగు పెట్టలేనురా"

    "చాలా మెత్తగా సంకెళ్ళు వేస్తున్నావమ్మా"   మల్లిక్  ఇబ్బందిగా చూశాడు.  వయసు తక్కువని తప్ప మరోసాకు కనిపించలేదు.  మల్లిక్ కు దానికి తల్లి తగు సమాధానం చెబుతూనే వుంది."  "మీ యిష్టం,  అమ్మా" అనక తప్పలేదతడికి.

    తల్లీ  కొడుకులమధ్య ఈ సంభాషణ పూర్తి అయ్యేవరకు గుమ్మం అవతల నిశ్శబ్దంగా నిలబడిన పరమేశ్వర శాస్త్రి  అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రంగప్రవేశం చేశాడు.  ఆయన వెనుక ఆయన సతీమణి.

    "బాగున్నావా అల్లుడూ?"

    "ఆ మీరూ బాగున్నారా,  మామయ్యా?"

    "బాగున్నామయ్య"

    ఇరవ్తే రెండు సంవత్సరాలకే నిండు యవ్వనవంతుడ్తే,  స్పుర ద్రూపిగా, హుందాగా కనిపిస్తున్న అతడిని తృప్తిగా చూస్తూ "నిన్ను చూసి మూడేళ్ళయింది.  ఈ మూడేళ్ళలో గుర్తుపట్టలేనంతగా మారిపోయావయ్యా"  అంది లలితమ్మ.

    చిరునవ్వుతో,  "అలాగే అత్తయ్యా?" అన్నాడు మల్లిక్.

    మల్లిక్ కు అదే నెలలో త్రిపుర సుందరితో వివాహం నిశ్చయమ్తెంది.

    మల్లిక్ కి ప్రేండ్సు తక్కువేంలేరు.  పెళ్ళికి పదిహేను ఇరవ్తే మందిదాకా వచ్చారు.  అందరికి ఒకటే  ఆశ్చర్యం.  మల్లిక్ అంత చిన్న పిల్లను ఎలా పెళ్ళాడుతున్నాడూ అని.

    విడిదింట్లో దిగి పెళ్ళికి ముందే పెళ్ళికూతుర్ని చూస్తామని పట్టు బట్టారు వాళ్ళు.  మల్లిక్ కి పిన్నివరుస్తేన  ఒకావిడాను పెళ్ళి ఇంటికి పంపి పర్మిషన్ తెప్పించుకున్నాడు స్నేహ బృందాన్ని వెంటబెట్టుకు  బయల్దే రాడు.

    చారిచాపమిద,  జారిపోతున్న పట్టుచిరను సవరించుకోలేక సతమత మౌతున్న త్రిపురను అందరూ జాలిగా చూశారు. 'పాపం!  ఇంత చిన్న పిల్లకు పెళ్ళేమిటి?'  అని.

    సుందర్ అనే యువకుడి కళ్ళతో మాత్రం ఏదో అధ్బుతాన్ని చూస్తున్నట్టుగా సంభ్రమం,  తదేకంగా చూస్తున్న అతడి భుజాన్ని పొడిచాడు మల్లిక్.  "అలా చూస్తున్నా వేమిటి?"

    "ఆమెను ఆరేళ్ళ తరువాత ఊహించుకోంటూంటే  ఒక అద్భుత సౌందర్యరాసి సాక్షాత్కారమిస్తూంది.  అందమ్తెన  భార్యని పొదడం ఒక అదృష్టమే అయితే,  నీకంటే అదృష్టవంతుడు లేడంటాను."

    స్నేహితులందరిలోకి సుందర్ అతిసన్నిహితుడు మల్లిక్ కు.  మల్లిక్ తో పాటు మెడిసిన్ సెకండియర్ చదువుతున్నాడు.  కలవాళ్ళకి  ఒక్కగానొక్క అబ్బాయి.  మంచి భావుకుడు, బొమ్మలు గిస్తూంటాడు.  సితార్ మీటుతూ అతడు పాటలు పాడుతూంటే స్నేహితులు తన్మయుల్తే వింటుంటారు. అందాన్ని ఆర్తిగా వేదుకుతుంటాయి అతడి కళ్ళు.

    మరో స్నేహితుడు అన్నాడు "బొత్తిగా చిన్నపిల్ల.  ఈ పెళ్ళికి ఎలా అంగీకరించావో అర్ధంకావడంలేదు.  అమ్మాయి నీ చేతి కంధడానికి అయిదేళ్ళు వెయిట్ చెయ్యాలి  నువ్వు.  నాతిగల బ్రహ్మచారివి ఈరోజు నుండి"

    "నా కిష్టంలేదు.  మా అమ్మ బలవంతం ఇది,  నాకు బయటి సంబంధం చేయడం ఇష్టంలేదామెకు. అన్నగారికి ఉన్న ఒక్కగా నోక్కకూతురు తని కోడలు కావాలని ఆవిడ పట్టుదల. పిల్ల పెద్ద మనిషి అయితే కన్యాదాన ఫలం దక్కదని,  వాళ్ళ  పట్టుదల ముందు తలవంచక తప్పలేదు."

    "ఆశయాలు,  ఆదర్శాలు అంటూ ఎప్పడూ గొప్పగా లేక్చార్లిస్తూ ఉంటావు అసలు దగ్గరికి వచ్చేసరికి అంతా వట్టిదే"  మరో స్నేహితుడు ఎత్తిపొడిచాడు.

    మల్లిక్ ముఖం బాగా ఎర్రబడింది.  "ఆమె నాకంటే చిన్నదనేగా మిరనడం?  అయిదారు సంవత్సరం తరివాత మీరీ మాట అనలేరు"
    "అప్పడే విచ్చుకోంటున్న మొగ్గమీద  గండుతుమ్మెద దాడిచేసి నట్టుగా  ఉంటుంది.  నీ వయసులో సగం కూడా లేనిపిల్లను చేసుకోవడం నాకు మాత్రం చాలా అమానుషం అనిపిస్తూంది."

    స్నేహితులంతా చాలా అసహజంగా,  అమానుషంగా భావిస్తున్న ఈ విషయం పెద్దవాళ్ళ దృష్టిలో చాలా మామూలు విషయం,  ఎందుకంటే పూర్వపు వివాహాలన్నీ ఇంతకంటే ఎక్కువ తేడాతోనే జరిగేవట.  అమ్మ చెప్పినట్టుగా,  మగ్గవాళ్ళకంటే ఆడవాళ్ళు ముందుగా యవ్వనం కోల్పోవ చెప్పినట్టుగా,  మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ముందుగా యవ్వనం కోల్పోవడమే అందుకు కారనమనిపిస్తుంది.

    తన వయసులో సగంకూడా లేని పిల్లను చేసుకోవడం స్నేహితులదృష్టిలో అనాగరికంగా కనిపించడంతో ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నానా,  చేసుకొన్నా స్నేహితులని ఎందుకు పిలిచావా అని పశ్చాత్తాప పడసాగాడు మల్లిక్.

Next Page