Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 8

     ఆవేశం అతనిలో ఆశాంతిని  పెంచుతోంది. ఆకాశంలోకి చూస్తూ పడుకున్నాడు విజయ్.

    దూరంగా సరువుడుచెట్లు చేస్తున్న గిజురుశబ్ధం ఒంటరి మనసుల్ని మనుషుల్ని భయపెట్టేలా వుంది.

    ఎడం చేతినీ తలకింద పెట్టుకున్నాడు. గుండెలమీద ఓ పుస్తకం వుంది.

    అది చదివిన గుర్తులేవి పుస్తకంపైన లేవు కాని అందుకు  ప్రయత్నించిన సూచనగా  అట్ట బాగా  నలిగిపోయింది కుడిచేతిలో సిగరేట్ వెలుగుతోంది.

    కళ్ళు ఆకాశంలోకి  చూస్తున్నాయి ఇంకొంచెంసేపు చూస్తే ఆకాశం విరిగి మీద పడుతుందనిపించింది విజయ్ కి. ఆ ఆలోచనకి నవ్వుకున్నాడు కళ్ళు మండుతున్నాయి.

    నిద్రలేకపోవడంతో బారెడు పొద్దెక్కినా అతనికి లేవబుద్ధి కాలేదు.

     పరుపు చుట్టి కాట్ పైన  వేసుకుని మళ్ళి పడుకున్నాడు.

    ఆ రోజు కాలేజికి ఎగనామం పెట్టేశాడు. పన్నెండు గంటలకి లేచి మొహం కడుక్కుని మెస్ భోజనానికి వెళ్ళాడు.

    మళ్ళీ గదికి వచ్చేసి  పడుకున్నాడు.

    ఒక్క రాత్రి నిద్ర కరువైతే ఎంత బద్దకంగా వుంటుందో అనుకున్నాడు.

    సాయంత్రం అర్జున ఇంటికి వెళ్ళాలి. అసలు తను కాలేజిలో కనబడకపోతే తన రూమ్ కి వచ్చేదే  కాని ఎందుకు రాలేదో?

    నిన్న సాయంత్రంసంఘటనకి  సిగ్గుపడిందా? కోపంవచ్చిందా?

    వెళ్ళి అర్జునకి తన తోందరపాటుకి క్షమాపణ  చెప్పాలి.

     సాయంత్రం మెల్లగా లేచి బయటకి బయలుదేరాడు.

    కాని అర్జునఇంటికి వెళ్ళాలనిపించలేదు  వెళ్ళాలని మరోప్రక్క.

    రైలుకట్టవెంట  కొంతదూరం అవుటర్ సిగ్నల్ వరకు నడిచి మళ్ళి గదికి చేరాడు.

    మెస్ కి వెళ్లాలనిలేదు గదిలోవున్న  బ్రెడ్ తిని గ్లాసుడు మంచి నీళ్ళు త్రాగి, సిగరెట్ వెలిగించాడు విజయ్.

    బాల్కనిలోకొచ్చి నించున్నాడు నీటిగొట్టాన్ని ఆసరా చేసుకొని పైకి పాకి వచ్చిన మాలతి తీగల సువాసనలు విరజిమ్ముతోంది.

    కాశ్మీర గదిలో ల్తెటు వెలుగుతోంది.

    "ఏంచేస్తోందో  పుణ్యాత్మురాలు" అనుకున్నాడు విజయ్.

    కాశ్మీర కనబడితే కాస్తంత కాలక్షేపం అవుతుందనుకున్నాడు విజయ్.

    అర్జున ఏం చేస్తుందో?

    కాలేజికి తను వెళ్ళనందుకు అలుగుతుంది. కనీసం సాయంత్రం ఇంటికి రాలేదని తిడుతుంది.

    అసలు తనకేమయింది?

    నిన్నటినించి మనసులో  ఏదో దెయ్యం ప్రవేశించింది. లేకపోతే ఏమిటిదంతా?!

    ఈ రాత్రి కూడా క్రితం  రాత్రిలా  నిద్రపట్టదా? ఏమో!

    పొద్దున్నే వెళ్ళి అర్జునకి కనబడాలి. ఆమెని చూసి అప్పుపడే నలభ్తే ఎనిమిది గంటలు అయింది. అర్జునని చూడకుండా తనన్ని  గంటలు  ఎప్పుడు వుండలేదు.

    నిన్నటి అనుభవాన్ని ఓ తియ్యని అనుభూతిగా అతను పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు.

    మరిచిపోలేకుండా వున్నాడు విజయ్. మనసుకి మళ్ళి విప్పంటుకుంది. రాజుకుంది రగిలింది.

    అర్జునకి తను తగదేమో అన్న అనుమానంతో దూరంగా ఉండాలని ప్రయత్నం చేశాడు విజయ్. కాని అర్జున దగ్గరయింది ఇప్పుడు తన సర్వస్వం అయిపోయింది.

    అర్జునని మనసారా ప్రేమగా దగ్గరకి తీసుకొనే  రోజు ఎంత దూరంలో వుంది?

    ఆకాశం మనోహరంగా వుంది. చల్లని వెన్నెల కోరికలని పెంచుతోంది.
   
    రాత్రి పదకొండయింది. భాస్కరపురం వూరికి చివరగా వుంది. భాస్కరపురాన్ని  నక్కలతోట అని కూడా పిలుస్తారు.

    వూరికి చివరగావుండడంచేత అక్కడ ప్రశాంతంగా ఉంటుందని చాలామంది స్టూడెంట్స్ ఆపరిసరాలలోనే  అద్దెకి ఇళ్ళని సంపాదిస్తారు.

    చాలావరకు ఇళ్ళలో దీపాలు ఆరిపోయినాయి. కాశ్మీర గదిలో లైటువెలుగుతూనే వుంది.

    పరుపుపైన లేచి కూర్చుని సిగరెట్ వెలిగించాడు విజయ్.

    ఆలోచనలు మనసుని కుమ్మరి పురుగుల్లా తోలుస్తున్నాయి.

    "ఇంకా నిద్రపోలా?"

    తలతప్పి చూశాడు విజయ్.

    కాశ్మీర పిట్టగోడదగ్గర నించునుంది విజయ్ లేచి అటునడిచాడు.

    "నువ్వేం చేస్తున్నావు" అడిగాడు.

    కాశ్మీర నవ్వింది.

    "ఇక్కడ నించుని నిన్ను చూస్తున్నాను" అంది కాశ్మీర.

    వెన్నెల వెలుగులో కాశ్మీరరూపం  అతన్ని  పిచ్చివాడ్ని చేస్తోంది.

    "మంచిపనే చేస్తున్నావు" అన్నాడు విజయ్ చేతిలోని సిగరెట్ పీకను పక్కన పడేస్తూ.

    "ఉండు ఇప్పడే వస్తాను" అని లోపలకి వెళ్ళింది కాశ్మీర.

    విజయ్ అక్కడే నించున్నాడు. కాశ్మీర గదిలో కూనిరాగం తీస్తోంది.

    "మల్లెలు పూచే వెన్నేలి కాసే"

    విజయ్ చూస్తూనే వున్నాడు.

    కాశ్మీర పవిటని కిందికి వదిలేసి, జాకెట్ నీ  విప్పతోంది.

    గదిలో నించుని నవ్వుతోంది తన కళ్ళముందు కాశ్మీర కావాలనే అలా చేస్తోంది.

    బ్రాపైన పవిటని వేసుకొని మళ్ళి వచ్చింది కాశ్మీర.

 Previous Page Next Page