ఉండ్రాళ్ళ తద్ది నోము

(Undraalla Taddi Nomu)

 

పూర్వమొక వేశ్య శ్రీమంతులను చేపట్టి తిరుగులేని సంపద ఆర్జించింది. చివరికి ఆ దేశాన్నిపాలించే రాజు కూడా ఆమెకు దాసుడైపోయాడు. అలా ఉండగా, ఒకసారి దేశంలోని ప్రజలందరూ ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకుంటూ ఉండగా, రాజు అది గమనించి, వేశ్య వద్దకు వెళ్లి "నీవు కూడా నోము నోచుకో "అని కోరాడు. అయితే దానికి ఆమె దేవుడిమీద తనకు నమ్మకం లేదని చెప్పి నోము నోచుకోలేదు.

తర్వాత కొద్ది రోజులకు ఆ వేశ్యఇంటిలో దొంగలుపడి ఆమె సంపదనంతా దోచుకుపోయారు. ఆమె అనారోగ్యం పాలయ్యింది. రాజు ఆమెను పట్టించుకోలేదు. చివరికామె రాజపురోహితుడిని కలుసుకుని తన అవస్థ చెప్పుకోగా, ఉండ్రాళ్ళ తద్ది నోము నోచకపోవడం వలన ఈ స్థితి వచ్చిందని చెప్పి, ఆ నోము నోచుకోమని సూచించాడు.

ఆ మాటల ప్రకారం భాద్రపద విదియనాడు, ఐదుగురు పేరంటాళ్లకు తలంటు చేయించి, తను స్నానము చేసి, మర్నాడు ఉదయం ఆ ముత్తయిదువలతో భోజనం చేసింది. పార్వతీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి, ముత్తయిదువులకు వాయినమిచ్చి పంపింది. అతి తక్కువకాలంలోనే ఆమె వ్యాధి తగ్గిపోయింది.దొంగలు దోచుకున్నసొత్తు దొరికింది.

ఈ కథలోసూచించిన విధంగా నోము నోచుకుంటే దైవానుగ్రహం కలుగుతుంది.


More Vratalu