తులసిని ఇలా పూజిస్తే కొరత అనేది ఉండదు తెలుసా!
ప్రతిరోజూ సాయంత్ర వేళ తులసి కోట దగ్గర దీపం పెట్టి, ప్రార్థనలు చేయడం మన భారతీయ జీవన విధానంలో భాగం. తులసి కోట ఉన్న ఇంట్లోకి యమధర్మరాజుకు ప్రవేశం లేదన్నది అందరికీ తెలిసిన విషయం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతకరమైన తుల సిని పూజించడం గురించి ఎన్నెన్నో శాస్త్రీయ విషయాలు, భక్తి, పురాణ కథలు ఉన్నాయి. తులసిని పూజించేతప్పుడు తప్పనిసరిగా మంత్రం చెప్పడం తప్పనిసరి. మన పెద్దలు చెప్పిన 'తులసీ ప్రణామ మంత్రం' ఒకటి ఉంది. తులసి కోటకు నమస్కరించి, ప్రదక్షిణం చేసేవారు ఈ మంత్రాన్ని పఠించవచ్చు.
బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ ||
విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః ॥
'ఓ బృందాదేవీ! తులసీదేవీ! కేశవునికి ప్రియమైనదానా! విష్ణుభక్తి ప్రదాత్రీ! దేవీ! సత్యవతీ! నీకు నమస్సులు!'
ఇకపోతే తులసిని పూజించడం ద్వారా ఐశ్వర్యం, అభివృద్ధి పొందాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. నిజానికి తులసిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కానీ అంతకు మించి పలితం కలగాలంటే ఇలా చెయ్యాలి.
'సోమపతి అమావాస్య' (సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య) నాడు తులసి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే, కొరత అనేది లేకుండా పోతుంది.
'బ్రహ్మ వైవర్త పురాణం'లోని ప్రకృతీ ఖండంలో bఇలా ఉంది:
సుధా ఘట సహస్రేణ సా తుష్టిర భవేద్ధరేః । యా చ తుష్టి ర్భనేవేన్నృణామ్ తులసీ పత్ర దానతః ॥
'వెయ్యి కుండల అమృతంతో అభిషేకం చేసినా తృప్తి చెందని శ్రీహరి, ఒక్క తులసీ పత్రాన్ని దానమిస్తే చాలు సంతుష్టు డవుతాడు.
ఇక, శ్రీమహావిష్ణువుకు ఒక్క తులసి ఆకును సమర్పించి, ప్రార్థించినా చాలు, లక్ష అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. తులసి మొక్కను ఎక్కడ పెట్టుకొని పూజించినా, అక్కడ పరమాత్మ స్వయంగా సాక్షాత్కరిస్తాడని పూర్వకాలం నుంచి మనవాళ్ళ నమ్మకం. తులసమ్మను ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, అక్కడ సకల దోషాలూ తొలగి, ప్రశాంతత నెలకొంటుంది.
పరబ్రహ్మ స్వరూపేయం - తులసీ యత్ర తిష్ఠతి |
తతైవ కుశలం సర్వం - సుదృఢం ప్రోచ్యతే మయా ॥
పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఈ పవిత్రమైన తులసి ఎక్కడ ఉంటుందో, అక్కడ సర్వక్షేమాలూ ఉంటాయి.
*నిశ్శబ్ద.