వివాహంలో అడ్డంకులు ఉన్నవారు గురువారం ఈ మూడు పనులు చేసి చూడండి..!

వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన దశ.  వయసుకు వచ్చిన ఆడపిల్ల అయినా, మగ పిల్లాడు అయినా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు.  వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నం చేసినా వివాహం కావడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది.  మరికొందరికి వివాహం ఖాయం అయ్యి ఆ తరువాత ఆగిపోతూ ఉంటుంది.  వివాహంలో అడ్డంకులు ఎదురయ్యేవారు,  సంబందాలు కురదరని వారు గురువారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల సమస్యలు తీరి వివాహ యోగం వస్తుంది.  

గురువారం రోజున విష్ణువును పూజించడం,  ఉపవాసం ఉండటం ద్వారా విష్ణువు ప్రసన్నుడు అవుతాడట. భక్తుల దుఃఖాలన్నింటినీ తొలగిస్తాడట. విష్ణువు ఆశీస్సులు పొందడానికి గురువారం చాలామంచి రోజు అని అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువారం దేవతల గురువు అయిన బృహస్పతితో ముడిపడి ఉంటుంది. గురువారం నాడు కుంకుమపువ్వు,  పప్పుధాన్యాలను దానం చేస్తే, జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటుంది. జాతకంలో బృహస్పతి స్థానం సరిగ్గా ఉంటే, ఆ వ్యక్తి వైవాహిక జీవితంలో అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. కానీ స్థానం బలహీనంగా ఉంటే వివాహంలో అడ్డంకులు,  పనిలో వైఫల్యాలను ఎదుర్కోవచ్చు. గురువారం నాడు కొన్ని పనులు చేయడం ద్వారా వివాహ సంబంధిత సమస్యలను తొలగించవచ్చు.

గురువారం రోజు విష్ణువును పూజించాలి.  ఈ రోజున ఉపవాసం ఉండాలి. ఇలా ప్రతి గురువారం చెయ్యాలి.  వీలుంటే విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి. దీని వల్ల  విష్ణువు సంతోషిస్తాడని,  వివాహంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

గురువారం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తరువాత తులసి దండను తీసుకొని ఓం బృం బృహస్పతే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల కోరుకున్న వరుడిని పొందాలనే కోరిక నెరవేరుతుంది.

గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణువును పూజించాలి.  తరువాత స్వామికి  అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి. ఇది కాకుండా విష్ణు పూజలో పసుపు పువ్వులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల వివాహంలో సమస్యలు తొలగిపోయి జీవితంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి.

గురువారం నాడు ఇంటి పెద్దలందరితో కలిసి విష్ణువు హారతి చేయాలి.  వివాహం జరగాలనే కోరిక తీరడానికి, యోగ్యమైన వరుడు లేదా వధువు లభించాలని  యువతీ యువకులు ధనుర్మాసంలో విష్ణువును ఆరాధిస్తూ శ్రీ వ్రతం చేయడం అందరికీ తెలిసిందే.. అందుకే విష్ణువును ఆరాధిస్తే.. విష్ణువు ప్రసన్నం అయితే వివాహం అడ్డంకులు తొలగుతాయి.  విష్ణువు ఆరాధన   సాధకుడి  జీవితంలో ఆనందం,  అదృష్టాన్ని పెంచుతుంది.


                                         *రూపశ్రీ.
 


More Vyasalu