డిప్రెషన్‌లో చిక్కుకున్నారా.. ఇలా చేస్తే బయటపడతారు..!

నేటికాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య డిప్రెషన్. ఈ డిప్రెషన్ సమస్య కారణంగా చాలా మంది జీవితాలు ఊహించని విదంగా పతనం అవుతుంటాయి. ఎంతో మంచి తెలివి తేటలు, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనుకునే వారు కూడా డిప్రెషన్ కారణంగా జీవితంలో చాలా పతనం స్థాయికి జారిపోతారు. కొందరు ఈ డిప్రెషన్ శ్రుతి మించడం వల్ల ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. కొందరికి ఆత్మహత్య చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఒత్తిడుల వల్ల ఆత్మహత్య వైపు అడుగులు వేస్తుంటారు. అయితే ఈ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనల నుండి బయట పడటానికి భారతీయ హిందూ ధర్మం కొన్ని మార్గాలు సూచించింది. అవేంటో తెలుసుకుంటే ఎంతో మంది డిప్రెషన్ నుండి, ఆత్మహత్య ఆలోచనల నుండి బయటపడతారు. ఇంతకీ ఆ మార్గాలు ఏంటో తెలుసుకుంటే..
డిప్రెషన్ కు మూల కారణం..
ఏదైనా ఒక సంఘటన లేదా ఒక విషయం జరిగినప్పుడు దాని గురించి ఆలోచించేవారు చాలా ఎక్కువగా ఉంటారు. అయితే కొంత సమయం గడిచిపోయాక ఆ విషయం గురించి మరచిపోయి వేరే పనుల మీద ధ్యాస పెట్టేవారు కొందరైతే.. అదే విషయాలను పదే పదే ఆలోచిస్తూ తవ్వుకుని, తవ్వుకుని మరీ లోతుగా వెళ్లిపోయి డిప్రెషన్ లో చిక్కుకునేవారు ఉంటారు. వీరికే డిప్రెషన్ సమస్య వస్తుంది. అందులోనూ డిప్రెషన్ శృతిమించితే ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి.
డిప్రెషన్ తొలగించుకునే మార్గం..
డిప్రెషన్ గా ఉన్నప్పుడు లేదా ఏదైనా మానసికంగా డిస్టర్బ్ చేసే సంఘటన జరిగినప్పుడు కాళీ బీజం చెప్పుకోవడం వల్ల చాలా తొందరగా ఉపశమనం దొరుకుతుంది. కాళీ బీజాన్ని జపం చేయాలి. కొన్ని నిమిషాల పాటు జపం చేయడం వల్ల డిప్రెషన్ మెల్లిగా తగ్గిపోతుంది.
"క్రీమ్.." అనే మంత్రాన్ని కాళీ బీజం అంటారు. ఈ మంత్రాన్ని ఒక స్పష్టమైన ఉచ్ఛారణతో జపించడం వల్ల గొంతులో జరిగే ఒక చర్య కారణంగా వేడి పుడుతుంది. ఇది డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా కాంచీపురంలో శ్రీవిద్యా పీఠం స్థాపించి, శ్రీ విద్యను అందరికీ అందిస్తున్న శ్రీ గురు కరుణామయ గురువు గారు తెలిపారు.
ఆత్మహత్య ఆలోచనలకు పరిష్కారం..
ఆత్మహత్య ఆలోచనలకు పరిష్కారం కావాలని చాలామంది అనుకుంటారు. బలవంతంగా చనిపోవడం ఎవరికీ నచ్చదు. కానీ మానసిక దుర్బలత్వం, చుట్టూ పరిస్థితులు, ఎవరూ సరిగా అర్థం చేసుకోలేకపోవడం వంటివి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తాయి.
కానీ మనిషి జన్మ చాలా క్లిష్టమైనది. మోక్షం కోసం దేవతలు కూడా మనిషిగా పుట్టాలని కోరుకుంటారని పురాణ గంథ్రాలు, పెద్దలు చెబుతున్నారు. ఎన్నో వేల కోట్ల జన్మలు తర్వాత కానీ మనిషిగా పుట్టడం జరగదు. అలాంటి పవిత్రమైన జన్మను ఆత్మహత్యతో ముగించడం చాలా పాపం. మానవ జన్మ గురించి గరుడ పురాణం వివరిస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకున్న ఆత్మ ఎలాంటి నరకం అనుభవిస్తుంది అనే విషయం తెలుసుకుంటే.. ఆత్మహత్య అనే ఆలోచనే దూరం అవుతుంది.
*రూపశ్రీ


