బృహస్పతికి ఇష్టమైన రాశులు.. వీళ్ల జ్ఞానం అమోఘం!


జ్యోతిష్యంలో 12 రాశులు ఉంటాయని అందరికీ తెలుసు.  ఈ రాశులకు అధిపతి గ్రహాలు ఉంటాయి.  ఈ గ్రహ సంచారాన్ని బట్టి జీవితంలో మంచి, చెడు,  ఒడిదుడుకులు ఎదురవుతాయని జ్యోతిష్యం చెబుతుంది. అయితే ఈ 12 రాశులలో కొన్ని రాశులు బృహస్పతి గ్రహానికి చాలా ప్రియమైనవి అని జ్యోతిష్యులు చెబుతారు.  ఈ రాశుల జన్మించిన వారు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారట.  అలాగే వీరికి జ్ఞానం కూడా బోలెడు ఉంటుందని,  వీరిని జ్ఞానవంతులు అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. ఇంతకీ బృహస్పతికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకుంటే..

బృహస్పతి..

బృహస్పతి దేవతల గురువు.  ఈ గ్రహాన్ని గురు గ్రహం అని కూడా అంటారు.  మనిషి జ్ఞానానికి గురువే కీలకం.  గురు గ్రహం బలంగా ఉంటే వారు వృత్తి, విద్య, వ్యాపారాలలో బలంగా ఉంటారని చెబుతారు.  

బృహస్పతికి ఇష్టమైన రాశులు..

కర్కాటక రాశి..

బృహస్పతికి ఇష్టమైన రాశులలో కర్కాటక రాశి ఒకటి. ఈ రాశి వారి మీద గురు గ్రహ ఆశీర్వాదం మెరుగ్గా ఉంటుంది.  వీరు కెరీర్ లో మంచి పురోగతి చూస్తారు.  అలాగే ఉద్యోగాలలో అదృష్టం వీరి వెంట  ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కర్కాటక రాశి వారు చాలా తెలివైన వారిగా ఉంటారట. అలాగే వీరి జ్ఞానం చాలా అమోఘం.  విజయం సాధించడానికి అవసరమైన తెలివితేటలు ఉపయోగించడంలో వీరికి వీరే సాటి.


ధనస్సు రాశి..

ధనస్సు రాశి వారిని బృహస్పతి పాలిస్తాడు.  ఈ రాశి వారు పదునైన తెలివి తేటలు కలిగి ఉంటారు.  ఆధ్యాత్మిక ఆలోచన వీరిలో ఎక్కువ.

బృహస్పతి ఆశీర్వాదాలు ప్రత్యేకంగా  ఉండటం వల్ల వీరు అన్ని వైపుల విజయం సాధిస్తారు. అన్ని పనులలో  అదృ,ష్టం వీరి వైపు ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి వారికి అధిపతి బృహస్పతి. అందుకే ఈ రాశి వారికి బృహస్పతి ఆశీర్వాదం మెరుగ్గా ఉంటుంది.  ఏ సమస్య వచ్చినా సరే.. ఆ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం వీరికి చాలా సులువు.

గురువారం రోజు బృహస్పతిని మనస్ఫూర్తిగా పూజిస్తే.. వారికి అదృష్టం వెంట ఉన్నట్టే.  గురువును పూజించేవారు, గురు స్వరూపులకు సేవ చేసే వారికి బృహస్పతి  అనుగ్రహం చాలా తొందరగా లభిస్తుంది.  బృహస్పతి ఆశీర్వాదం ఉంటే విద్య,  వృత్తి రంగాలలో విజయం లభిస్తుంది.

                                      *రూపశ్రీ.


More Aacharalu