దేవాలయంలోని దేవతా విగ్రహానికి ఎదురుగా


నిలబడి ప్రార్ధన చేయరాదా?

 

 

Don't we stand straight in front of god ,Justification refers to a right judicial standing before God.

 

 

పిల్లలు దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఉంటే పక్కకు జరిగి నిలబడమని పెద్దలు మందలిస్తారు. అనేక దేవాలయాలలో ఈ సమస్య లేకుండా ఉండేలా విగ్రహానికి ఎదురు భాగంలో ఇనుప కంచెను నిర్మిస్తారు. విగ్రహాన్ని సూటిగా కాకుండా కాస్త ఎడంగా కుడివైపునకు కానీ, ఎడమవైపునకు కానీ నిలబడి దేవుడిని చూస్తూ ప్రార్థించవచ్చు. సూటిగా దేవుడి దృష్టి పడేలాకాక ౩౦ డిగ్రీలు పక్కగా చేతులు జోడించి నిలబడి ప్రార్ధనలు చేయాలి.

 

Don't we stand straight in front of god ,Justification refers to a right judicial standing before God.

 

 

దేవతా విగ్రహం నుండి వెలువడే దైవకృపా శక్తి సర్పగతిలో తరంగాలుగా ప్రవహిస్తూ భక్తుడిని చేరుతుంది. కాబట్టి విగ్రహం దగ్గర ఉన్నప్పుడు చేతులు జోడించి ఉంచి కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా దైవధ్యానంలో మునిగి ఉండాలి. అలా చేతులు జోడించి ఉండటం వల్ల మెదడు నుండి ప్రాణశక్తి కలిగివుంటుంది. కాబట్టి అలా నమస్కారం పెట్టి ఉంచడం ద్వారా శారీరిక  బలం, బుద్ధిబలం మరియు ఆత్మవిశ్వాసం పొందుతారు. మానవదేహం సూటిగా దైవ విగ్రహం నుండి వెలువడుతున్న దివ్యకిరణాలను భరించలేదు. అందుకే విగ్రహానికి సూటీగా ప్రార్ధన చేయరాదని చెప్పబడింది.


More Enduku-Emiti