సౌభాగ్య ప్రదాయని వట సావిత్రి వ్రతం
(Soubhagya Pradayini Vata Savithri Vratham)
సకల సౌభాగ్యాలనూ ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుండీ కాపాడే వ్రతం,వట సావిత్రీ వ్రతం.ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు లేదా జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు ఆచరించాలి.ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి, సత్యవంతుల కథ ఉంది.ఈ వ్రతం ఆచరించే సావిత్రీ తన భర్త అయిన సత్యవంతుని మృత్యువు నుండీ కాపాడుకోగలిగింది. ఈ వ్రతాన్ని చేసే వారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి.వ్రతం రోజు తెల్లవారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి,దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి,మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి,సావిత్రి ,సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి .వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మనువైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.
బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరి ష్యే
అనే శ్లోకాన్ని పఠించాలి.
ఈ విధంగా మర్రిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రిచెట్టుకు 108సార్లు ప్రదక్షిణ చేసి,నైవేద్యం సమర్పించి,బ్రాహ్మణులు,ముత్తైదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి.ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్దాయం పొందుతాడు.ఈ వ్రతాన్ని భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు .



_medium.png)