సంపాతి జటాయువు
Sampati Jatayuvu
జటాయువు ఒక పక్షి. అనూరుడు, శ్యేనిల కుమారుడితడు. సంపాతి సోదరుడితడు. చిన్నతనంలో సోదరురిద్దరూ ఎవరు ఎంత ఎత్తుకు
ఎగరగలరో అని పోటీపడి ఇద్దరు సూర్యమండలం వరకూ వెళతారు. సంపాతి రెక్కలు మాడిపోయి ఒకచోట. జటాయువు సొమ్మసిల్లి మరోచోట పడిపోతారు. రావణాసురుడు సీతను అరణ్యం నుంచి అపహరించుకుని వెడుతుండగా, జటాయువు అతనికి అడ్డంపడి, సీతను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. జటాయువు రెక్కలను రావణాసురుడు ఖండించడంతో రెక్కలు తెగిన జటాయువు అంత్యక్రియలు రాముడే నిర్వర్తిస్తాడు. జటాయువు మరణించిన తర్వాత అనుకోకుండా వానరులు సంపాతిని కూడా కలుస్తారు. జటాయువు సోదరుడే సంపాతి అని తెలుసుకుంటారు. జటాయువు మరణించాడని తెలుసుకున్న సంపాతి తన కుమారులైన సుపార్శ్వుడు, బభ్రువు, శీఘ్రగుడులను కూడా వానరులకు సహాయంగా పంపుతాడు.



