జీవితం లో కాంపిటీషన్  ఉండటం యెంత సహజమో , తమ పిల్లలు అందులో నెగ్గాలని తల్లిదండ్రులు కోరుకోవడం అంతే సహజం. పిల్లలు కిందపడినపుడల్లా వాళ్ళని వెన్నుతట్టి లేపాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అయినపుడు , పిల్లలు ఓటమి ని ఎదుర్కొన్నప్పుడు పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ అందివ్వాలి? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా?  కెరటాన్ని చూస్తే, అది "లేచి పడుతుందని" కాదు, "పడినా  లేస్తుందనే" విషయాన్ని తెలియజేయాలి. ఆ క్వాలిటీ ప్రతి మనిషి ,  ముఖ్యంగా పిల్లలు  నేర్చుకోవాలని అంటారు "స్వామి వివేకానంద".

 

సక్సెస్ స్టోరీస్ తో బాటుగా, అపజయాల తో ముడిపడి వున్న కథల్ని కూడా పిల్లలకు చెబుతూ ఉండాలి. ఓడిపోవడం చిన్నతనం కాదు అది ధైర్యవంతుల లక్షణం అని అందరూ తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ నుంచి బయటికి రావాలంటే ముందు ఆ ఓటమి ని ఒప్పుకోవాలి. అందులోని తప్పు-ఒప్పు లని విశ్లేషించుకోవాలి. గెలుపు కారణం మనమే అని చెప్పినపుడు, మన ఓటమికి కూడా కారణం మనమే అన్న జవాబుదారీతనం పిల్లల్లో కలిగేలా పెద్దవాళ్ళు శిక్షణ ఇవ్వాలి.

 

ఒక గెలుపు వెనుక పది ఓటమిలు వున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో మంది, మన చుట్టూ వున్నారు. ఈ విషయాలు, పిల్లలతో చర్చిస్తూ ఉండాలి.  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం పిల్లలకు అలవాటు చేయాలి. దీని వల్ల పిల్లలకు గెలుపు పట్ల ఆసక్తి కలగటమే కాక ఓటమి ఎదురైనపుడు కూడా సానుకూల దృక్పథం కలిగివుండటం ఎలాగో తెలుస్తుంది.

-Bhavana

 


More Baby Care