చెల్లాపూర్ మీసాల వేణుగోపాల స్వామి ప్రత్యేకం

 

మెదక్ జిల్లా,దుబ్బాక మండలం, చల్లపూర్ నందు మీసాల వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది.ఇది ప్రాచీన ఆలయంగా చెప్తారు. ఈ ఆలయంలో శ్రీ మీసాల రాజ వేణుగోపాల స్వామీ వారు వేలసియున్నారు.ఇంతవరకు మనం ఎక్కడా చూడనివిధంగా శ్రీ కృష్ణుని విగ్రహానికి మీసాలు ఉండుట ఈ ఆలయంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామికి మీసాలు ఉంటాయి. అందువలనే ఇది ప్రత్యేకమైన ఆలయాయంగా గుర్తిపబడినది. ఈ ఆలయాన్ని గ్రామస్తులు దొరల పై పోరాడి మరీ కట్టించారు.

సుమారు 200 సంవత్సరాల క్రితం, దుబ్బాక గ్రామం దొరల పాలనలో ఉండేది.దొరలు ప్రజలను పన్నులు కట్టమని వేదిస్తూ ఉండేవారు.అప్పుడు చెల్లాపూర్ గ్రామస్తులందరూ ఎకమై దొరలకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకొని,ఎప్పుడైతే పన్నులు వసూలు చేసే అధికారులను ప్రజలందరూ ఒక్కటై వారిని తరిమికొట్టారో అప్పుడు అధికారులు పెద్ద సైన్యంతో గ్రామం పై  దాడిచేసి గ్రామస్తులను వేధించసాగారు.అప్పుడు గ్రామస్తులకు ఒక ఆలోచన వచ్చి,వారు దొరవద్దకు  వెళ్లి మేము ఈ స్థలంలో వేణుగోపాలస్వామి వారి దేవలయాన్ని నిర్మిచదలచాము.కావున మేమూ పన్నుల కట్టలేమని చెప్పారు. ఆ దొర కూడా శ్రీ కృష్ణుని భక్తుడు. అందువలన దొర కూడా కొంత డబ్బు  సహాయం చేసి అతనుఆ ప్రదేశాని వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు.ఆవిధంగా అక్కడ శ్రీరాజా వేణుగోపాలస్వామి ఆలయం నిర్మింపబడినది.

ఈ మీసాల వేణుగోపాల స్వామి ఆలయాన్ని గూర్చి మరొక ఆశ్చర్యకరమైన కథనం ఉంది.చెల్లాపురం గ్రామస్తులు ప్రజలందరి దగ్గర చందాలు వసూలు చేశారు.కాని విగ్రహాన్ని తయారు చేయించడం చాలా కష్టమైనది. అందువలన ప్రక్క ఊరి లో పుజించకుండా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆ గ్రామస్తులకు చెప్పకుండా తీసుకురావాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలో వారు విగ్రహాన్ని రహస్యంగా తీసుకువస్తుండగా ఆ గ్రామస్తులు వీరిని చూసి తరుమగా, స్వామి విగ్రహాన్ని చెల్లూరు కోనేరులో దాచారు. కొంతకాలానికి వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మాణం పూర్తికాగానే వారు కోనేరులో దాచి ఉంచిన విగ్రహాన్ని బయటకు తీసి కొన్ని మార్పు చేర్పులతో ఆలయంలో ప్రతిష్టించ్చారు. స్వామివారికి మీసాలు మరియు తల మీద కిరీటం ఈ మార్పులతో చోటుచేసుకుంన్నాయి అని చెబుతారు. ఈ దేవాలయ ఆవరణలో ఒక కోనేరు, రెండు ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నవి. ఈ స్వామివారి ఆలయంలో అఖoడ ధీపారాధన నిరంతరం వెలుగుతూ  ఉంటుంది.

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories