శ్రీకృష్ణుని మనుమని వివాహ గాథ

 

 

శ్రీకృష్ణ బలరాముల పరాక్రమముకు సంబంధించిన అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ గాథలలో మచ్చుకు రెండు ప్రహ్లాదుని ప్రపౌత్రుడు, దైత్యరాజయిన బలి చక్రవర్తి కుమారుడు బాణాసురుడు. వేయి హస్తములు కలవాడు. చాలా బలవంతుడు. శంకరుని మెప్పు పొందినవాడు. శంకరుడూ ఎల్లప్పుడు అతని నగరాన్ని కాపాలా కాయుచుండును. బాణాసురిని కుమార్తె ఉషాసుందరి. శ్రీకృష్టుణి మనుమడైన అనిరుద్దుని కలలో చూసి ప్రేమించింది.

 

అతనినే వివాహమాడాలని నిశ్చయించుకుంది. ఉషాసుందరి ప్రియసఖి తన యోగ విద్యచే నిదురించుచున్న అనిరుద్ధుని ద్వారక నుంచి మాయ జేసి తెచ్చినది. తన పుత్రిక ఉషాసుందరి మందిరంలో అనిరుద్ద కుమారుడిని చూసి, బాణాసురుడు అతన్ని బంధించెను. దేవర్షి నారదుని వలన సమాచారం అందుకున్న బలరామకృష్ణులిరువురు దండెత్తి వచ్చిరి. శంకర భగవానుడు భూతప్రేతాలతో యుద్దసన్నద్ధుడైనాడు. కృష్ణుడు భూతప్రేతాలను పారద్రోలి, శంకరునిపై సమ్మోహనాస్త్రము ప్రయోగించెను.

 

 

శంకరభగవానుడు మాయలో మునిగి ఉండగా శ్రీకృష్ణుడు బాణాసురుడి చేతులను నాల్గింటిని మాత్రమే మిగిల్చి మిగిలినవి ఖండించి వేసెను. నిద్ర నుంచి మేల్కొనిన శంకరుడు భాణాసురుని చంపవద్దని ప్రాణాలతో విడిచి వుంచమని కోరెను. బాణాసురుడు క్షమింపమని శ్రీకృష్ణుని ప్రార్థించెను. తన కుమార్తె ఉషా సుందరిని, అనిరుద్ధునికిచ్చి వివాహము గావించెను.


More Purana Patralu - Mythological Stories